లీకైన మహేష్ బాబు గుంటూరు కారం సాంగ్ పాట ఎలా ఉందంటే.Guntur Kaaram song leaked
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకు వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి.
అతడు మంచి హిట్టే అయినప్పటికీ ఖలేజా సినిమా ప్రేక్షకులను థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ రెండు సినిమాలు టివిలో ప్రసారం అయ్యాక మాత్రం ప్రేక్షకుల మది దోచుకున్నాయి.
ఇక ఈ రెండు సినిమాల తరువాత త్రివిక్రమ్ మహేష్ తో మరో సినిమా చేయలేదు. వారిద్దరి కంబినేషన్లో సినిమా కోసం ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అతడు లో మహేష్ తో సెటిల్డ్ యాక్షన్ చేయించి ఒక రకంగా చూపెడితే, ఖలేజా లో పూర్తిగా ఎంటర్టైనింగ్ గా నటింపజేశారు.
మహేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకునేలా చేశారు. మరి వారి కంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందా, రిపీట్ అయితే ఎలాంటి పాత్రలో మహేష్ ను త్రివిక్రమ్ చూపెడతారా అని అనుకుంటున్నారు ఫాన్స్.
సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. ఈ సినిమా నుండి తాజాగా ఒక సాంగ్ లీక్ అయింది. గుంటూరు కారం మొదటి సాంగ్ అంటూ ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేష్ ఫాన్స్ మాత్రం ఈ పాట ను తెగ వైరల్ చేస్తున్నారు. కొంతమంది అసలు ఇది గుంటూరు కరం సినిమాలోదేనా ? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటే, కొంతమంది మాత్రం చాల బాగుంది సాంగ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఇంకో సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం ఈ సాంగ్ ఏమి బాలేదని, థమన్ పాత మ్యూజిక్ కొట్టాడు అని సీరియస్ అవుతున్నారు. ఇప్పటి వరకు చూస్తే థమన్, మహేష్ కోసం దూకుడు, బిజినెస్ మెన్, ఆగడు, సర్కారు వారి పాట సినిమాలకు మ్యూజిక్ అందించాడు.
ఇక ఈ సినిమాలో మహేష్ సరస ఆడిపాడేందుకు ఇద్దరు ముద్దుగుమ్మలు సిద్ధమయ్యారు. వారిలో మోస్ట్ వాంటెడ్ టాలీవుడ్ భామ శ్రీలీల ఒకరైతే, రెండవ అమ్మాయి మీనాక్షి చౌదరి.
దర్శక నిర్మాతలు ఈ మూవీ ని సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరవాత మహేష్ రాజమౌళి కంబినేషన్ లో సినిమా పట్టాలెక్కేస్తుంది అని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.