Guntur kaaram Trailer record: ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ లో దుమ్ముదులిపేందుకు రెడీ అవుతోంది గుంటూరు కారం (guntur Kaaram). ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu) మాస్ లుక్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పంచు డైలాగుల ఘాటుతో 12వ తేదీనా థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయంగా తెలుస్తోంది.
సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కొద్దీ మూవీకి సంబంధించి వస్తున్న అప్డేట్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నాయి. తాజాగా గుంటూరు కారం అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.
మహేష్ ఫ్యాన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోందనే చెప్పాలి. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్, మహేష్ మాస్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్రైలర్ లోని ఫైట్స్,
యాక్షన్ సీన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ అదుర్స్ అనిపించాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై అంచనాలు ఆకాశమంత ఎత్తుకి చేరాయి. అంతే కాదు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. రికార్డుల జాతరను సృష్టిస్తోంది.
guntur karaam broke salaar record : సలార్‌ను బీట్ చేసిన గుంటూరు కారం
యూట్యూబ్ లో ఈ గుంటూరు కారం ట్రైలర్ (guntur Kaaram trailer)విడుదలై 24 గంటలు పూర్తి అయ్యే సమయానికి సౌత్‌లోనే ఆల్ టైం హైయెస్ట్ వ్యూస్ రికార్డును సొంతం చేసుంది గుంటూరు కారం ట్రైలర్.
అంతేకాదు లేటెస్టుగా ఓవరాల్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వ్యూస్ విషయంలో సెన్సేషనల్ రికార్డు నెలకొల్పి టాప్ స్థానంలో నిలిచింది. గడిచిన 24 గంటల్లో గుంటూరు కారం ట్రైలర్ కి యూట్యూబ్ లో 39 మిలియన్ల వ్యూస్ లభించాయి.
665వేల లైకుల మార్క్ ని అందుకుంది. ఇక యంగ్ రెబెల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ (Salaar) మూవీ 24 గంటల్లో 32 మిలియన్ వ్యూస్ అందుకోగా గుంటూరు కారం
39 మిలియన్ల వ్యూస్ తో దాని రికార్డును బ్రేక్ చేసింది. మొత్తంగా ట్రైలర్ రెస్పాన్స్ అదుర్స్ అనిపించడంతో ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా తెలుస్తోంది.
Mahesh Babu mesmerising mass looks : మహేష్ బాబు మాస్ లుక్స్ అదుర్స్
ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో వస్తున్న మూవీ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram).తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి(Sankaranthi)
రోజూ వెండితెర మీద ఈ మూవీ సందడి చేయబోతోంది. ఈ మూవీలో ప్రిన్స్ తనోలని మరోకోణాన్ని చూపించాడు. మాస్ హీరోగా ఇంతవరకూ ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లుగా గుంటూరు కారంలో ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు మహేష్.
ఇక తాజాగా విడుదలైన ట్రైలర్లో మహేష్ లుక్ చూడగానే అభిమానుల్లో హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేసింది.
ఆట సూస్తావా అంటూ మహేశ్ బాబు చెప్పే సింపుల్ డైలాగ్స్ ఈ ట్రైలర్‌ను హైలెట్ చేశాయి. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది. త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్,
మహేష్ మాస్ లుక్స్, యాక్షన్ సీన్స్ , ఎమోషన్స్ , ఇలా ఎన్నో అదిరిపోయే ఎలిమెంట్స్ గుంటూరు కారం ట్రైలర్ ను టాప్ లో నిలబెట్టాయి. ఇక త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ మహేష్ నోట వింటుంటే అందరికీ ఖలేజా(Khaleja) రోజులు మళ్లీ గుర్తుకు వచ్చాయి.
5408 premiere shows in America : అమెరికాలో 5408 ప్రీమియర్ షోస్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) , ప్రిన్స్ మహేష్ బాబు (మహేష్ బాబు )కాంబోలో ఇప్పటికే అతడు (Athadu),ఖలేజా (Khaleja) వంటి క్రేజీ సినిమాల వచ్చాయి.
వీరిద్దరి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం (Guntur Kaaram).దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ
ఈ మూవీని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. జనవరి 12 న సంక్రాంతి గిఫ్ట్ గా గుంటూరు కారం రిలీజ్ కాబోతోంది.
Attention (San Jose,CA) 🇺🇸🤞🏻 Super Fans
— SSMB Fan Club USA (@Maheshfans_USA) January 9, 2024
AMC Just Opened Bookings at 2 Locations 😉
AMC Mercado (SantaClara) 📍
AMC Manteca (Manteca) CA 📍
Grab your tickets 🎟️ Before Soldout 💥#GunturKaaramUSA #GunturKaaram#GunturKaaramPremiersonJan11#GkUsaBookingsUpdate pic.twitter.com/vDiBAk4OPO
యువ కథానాయికలు శ్రీలీల (Srileela), మీనాక్షి చౌదరీ (meenakshi Choudary)తో పాటు సీనియర్ యాక్టర్స్ జగపతిబాబు (Jagapathi Babu),
ప్రకాశ్ రాజ్ (Prakash Raj), రావు రమేశ్ (Rao Ramesh), రమ్యకృష్ణ (Ramya Krishna)ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. నైజాంలో ఇప్పటికే గుంటూరు కారానికి భారీగా థియేటర్స్ లభించాయి.
రీజనల్ సినిమాతో మహేష్ వంద కోట్ల ఓపెనింగ్స్ రాబడతారని ఫ్యాన్స్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఇక అమెరికాలో ఈ సినిమాకి 5408 ప్రీమియర్ షోస్ కేటాయించారు.
ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ఆ లెవెల్ లో ఎక్కువ థియేటర్‌లలో రిలీజ్ అయ్యే మూవీ గుంటూరు కారం కావడం విశేషం.