Gunturkaaram Trailer: గుంటూరు కారం ట్రైలర్ అదుర్స్.

Guntur Karam Trailer Adurs.

Gunturkaaram Trailer: ఎట్టకేలకు ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu)ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది. మహేష్ బాబు నటించిన లేటెస్టు మూవీ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)ట్రైలర్‌ విడుదలైంది.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి(Sankaranthi) సందడి షురూ అయ్యింది. ఈ ట్రైలర్ లో ప్రిన్స్ తనోలని మరోకోణాన్ని చూపించాడు.

మాస్ హీరోగా ఇంతవరకూ ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లుగా ఉంది గుంటూరు కారం ట్రైలర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మహేష్ ను సరికొత్తగా చూపించాడు.

మహేష్ లుక్ చూడగానే అభిమానుల్లో హార్ట్ బీట్ పెరిగిపోయింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది.

ఈ క్రమంలో ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. వాస్తవానికి ఈ ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు.

అయితే ఈ ఈవెంట్ కు హైదరాబాద్ పోలీసులు అనుమతించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశపడ్డారు. ఈ క్రమంలో తాజాగా యూట్యూబ్‌లో మేకర్స్ ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. గుంటూరు కారం ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

Trivikram Mark Dialogues from Mahesh : మహేష్ నోట త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. త్రివిక్రమ్ (Trivikram) మహేశ్ బాబు (Mahesh Babu) క్యారెక్టర్ లో మాస్ లెవెల్ లో డిజైన్ చేశారు.

413 Gunturkaaram Trailer: గుంటూరు కారం ట్రైలర్ అదుర్స్.

లేటెస్టుగా విడుదలైన ట్రైలర్ లో ఆయన పాత్రను ఎలా డిజైన్ చేశారనేది స్పష్టంగా చూపించారు. నన్ను చూడగానే హార్ట్ బీట్ పెరిగిందా, విజిల్ వేయాలనిపించింది..

ఆట సూస్తావా అంటే మహేశ్ బాబు చెప్పే సింపుల్ డైలాగ్స్ ఆయన క్యారెక్టర్ ను ప్రతిబింభిస్తున్నాయి. ఇక ట్రైలర్ లో పండు మిరపకాయలు ఆరబోసిన స్థలంలో మహేష్ ఎంట్రీ అక్కడి ఫైటింగ్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి.

1357521 mahesh Gunturkaaram Trailer: గుంటూరు కారం ట్రైలర్ అదుర్స్.

ఇక టాలీవుడ్ మోస్ట్ వాంటెంట్ మీరోయిన్ శ్రీలీలను (Srileela) చూస్తూ మహేష్ చెప్పే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్,

మహేష్ మాస్ లుక్స్, యాక్షన్ సీన్స్ , ఎమోషన్స్ , ఇలా ఎన్నో అదిరిపోయే ఎలిమెంట్స్ గుంటూరు కారం ట్రైలర్ లో పుష్కలంగా కనిపించాయి. ఇక త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ మహేష్ నోట వింటుంటే అందరికీ ఖలేజా (Khaleja) రోజులు మళ్లీ గుర్తుకు వస్తాయి.

5408 premiere shows in America : అమెరికాలో 5408 ప్రీమియర్ షోస్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) , ప్రిన్స్ మహేష్ బాబు (మహేష్ బాబు )కాంబోలో ఇప్పటికే అతడు (Athadu),ఖలేజా (Khaleja) వంటి క్రేజీ సినిమాల వచ్చాయి.

వీరిద్దరి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం (Guntur Kaaram).దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ మూవీని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. జనవరి 12 న సంక్రాంతి గిఫ్ట్ గా గుంటూరు కారం రిలీజ్ కాబోతోంది.

ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటివరకు విడులైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదల చేసి ట్రైలర్‌ కూడా అంచనాలను పెంచేసింది.

యువ కథానాయికలు శ్రీలీల (Srileela), మీనాక్షి చౌదరీ (meenakshi Choudary)తో పాటు సీనియర్ యాక్టర్స్ జగపతిబాబు (Jagapathi Babu), ప్రకాశ్ రాజ్ (Prakash Raj), రావు రమేశ్ (Rao Ramesh), రమ్యకృష్ణ (Ramya Krishna)

ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. నైజాంలో ఇప్పటికే గుంటూరు కారానికి భారీగా థియేటర్స్ లభించాయి. రీజనల్ సినిమాతో మహేష్ వంద కోట్ల ఓపెనింగ్స్ రాబడతారని ఫ్యాన్స్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు.

ఇక అమెరికాలో ఈ సినిమాకి 5408 ప్రీమియర్ షోస్ కేటాయించారు. ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత ఆ లెవెల్ లో ఎక్కువ థియేటర్‌లలో రిలీజ్ అయ్యే మూవీ గుంటూరు కారం కావడం విశేషం.

Leave a Comment