అకస్మాత్తు గా వచ్చిన తీవ్రమైన తుఫాను మరియు భారీ వర్షాల కారణం గా ఆదివారం గౌహతిలో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పైకప్పు తో పాటు లోపల ఉన్న షెడ్డు లో భాగం కూలిపోయింది. అకస్మాత్తుగా పైకప్పు కూలిపోవడం వల్ల లోపలికి నీరు ప్రవహించడంతో విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడిందని ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు. LGBI విమానాశ్రయం లో వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన కార్యకలాపాలను నిలిపివేసామని ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు. షెడ్డు కూలిన ఘటన లో ఇంతవరకు ఎవ్వరు గాయపడలేదని అధికార వర్గాలు తెలిపాయి.
తీవ్రమైన తుఫాను కారణంగా, విమానాశ్రయ అధికార యంత్రాంగం కార్యకలాపాలను నిలిపివేసిందని అంతే కాకుండా ఆరు విమానాలను ఇతర గమ్యస్థానాలకు మళ్లించామని ” అదానీ గ్రూప్-నియంత్రిత ఫెసిలిటీ ఆఫీస్ బయట ఉన్న ఆయిల్ ఇండియా కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఒక పెద్ద చెట్టును కూల్చివేసి, రహదారిని క్లీయర్ చేసామని అని చీఫ్ ఎయిర్‌పోర్ట్ ఆఫీసర్ (CAO) ఉత్పల్ బారుహ్ PTI కి తెలిపారు.