సర్జరీ కోసం ఇంటిని అమ్మాల్సి వచ్చింది – జబర్దస్త్ శాంతి

shanthiswaroop3 1652522466 సర్జరీ కోసం ఇంటిని అమ్మాల్సి వచ్చింది - జబర్దస్త్ శాంతి

మీ అందరికీ జబర్దస్త్ శాంతి అంటే తెలిసి ఉండే వుంటుంది. ఆడియెన్సు కు జబర్దస్త్ శాంతి గానే తెలుసు. మంచి కామెడి తో టైమింగ్ తో మంచి గురింపు తెచ్చుకున్న తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు తన జీవిత కాలం లో ఎన్ని కష్టాలు ఎదుర్కొంది అని ఈ మద్యనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. ఈ మధ్యనే తనకున్న చిన్నపాటి ఇల్లు ను అమ్మాల్సి వచ్చింది అని ఎమోషన్ అయ్యింది. దీనికి కారణం మా అమ్మకి మోకాళ్ళు నెప్పులు వచ్చి వెంటనే సర్జరీ చెయ్యాలి అన్నారు. నా వద్ద అంత డబ్బులు లేవు. కాని తప్పలేదు ఆపరేషన్ కోసం అనంతరం మందుల ఖర్చు కోసం ఇల్లు ని అమ్మేసానని చెప్పింది.

అయితే ఈ మధ్యనే అమ్మకి మోకాలు సర్జరీ నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అయ్యిందని, సర్జర్ కూడా బాగా జరిగిందని డాక్టర్స్ చెప్పారని, ఇక్కడ ఉన్న డాక్టర్స్ మా అమ్మని నన్ను కుడా బాగా చూసుకున్నారని చెప్పింది. ఈ విషయాలు అన్ని తన యు ట్యూబ్ ద్వార చెప్పింది.

ఇప్పుడు మా అమ్మ చాల సంతోషం గా ఉందని, మా అమ్మని అలా చూస్తుంటే నేను పడ్డ కష్టం అంత పోయిందని చెప్పింది.ఈ ప్రకృతి లో అమ్మని మించిన ఆస్తి, సంపద ,ఆనందం ఎం ఉంటాయని, నాకు అమ్మ తర్వాతే ఏదైనా అని చెప్పింది. నా ఇల్లు కొనుకున్న వారు ఆయింట్లో సంతోషాలతో ఆనందం గా ఉండాలని కోరుకుంటున్నాని అని చెప్పింది.

Leave a Comment