Hanuman breaks KGF, Kantara records: టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత వర్మ (Prashanth Varma) డైరెక్షన్లో యువ హీరో తేజ్ సజ్జా (Tej Sajja)నటించిన సూపర్ హీరో మూవీ హనుమాన్ (Hanuman) బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కలెక్షన్ల సునామీతో దూసుకెళ్తోంది.
తాజాగా కేజీఎఫ్ (KGF), కాంతారా (Kantara) రికార్డులను సైతం బ్రేక్ చేసి 100 కోట్ల షేర్ దిశగా సంక్రాంతి విజేతగా కొత్త సంవత్సరంలో హనుమాన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జనాల పల్స్ కు తగ్గట్లుగా స్టోరీలో మేటర్ ఉంటే చాలు బొమ్మ తప్పక హిట్ అవుతుందని ప్రశాంత్ వర్మ మరోసారి నిరూపించాడు.
ఎలాంటి స్టార్ పవర్ లేకుండా మీడియం బడ్జెట్‌తో విడుదలైన హనుమాన్ మైండ్ బ్లోయింగ్ వసూళ్లను రాబడుతోంది. హాలీవుడ్ సూపర్ హీరోలను సైతం పక్కకు నెట్టి జనాలు టాలీవుడ్ సూపర్ హీరోను చూసేందుకు యూటర్న్ తీసుకుంటున్నారు.
సంక్రాంతి సెలవులకు తోడు పాజిటివ్ టాక్ రావడం, గుంటూరు కారం ఘాటు అంతగా లేకపోవడంతో రోజు రోజుకీ వసూళ్లను పెంచుకుంటూ బాక్సాఫీస్ బరిలో తొడకొడుతోంది హనుమాన్. ఓవర్సీస్ లోనూ రికార్డు లెవెల్లో వసూళ్లను రాబడుతోంది.
Hanuman Beat KGF, Kantara, Pushpa Records : కేజీఎఫ్,కాంతారా,పుష్ప రికార్డులను బ్రేక్ చేసిన హనుమాన్
కొత్త సంవత్సంలో తొలి బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది ‘హనుమాన్’ (Hanuman).సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో బ్రేకుల్లేకుండా ముందుకెళ్తోంది. మీడియం బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు.
ఇండియాతో పాటు ఓవర్సీస్లోనూ హనుమాన్ కలెక్షన్లలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. హిందీ డబ్బింగ్ వెర్షన్లో కేజీఎఫ్ (KGF) మొదటి భాగం, కన్నడ మూవీ కాంతారా (Kantara), అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప (Pushpa) సినిమాల ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లను సైతం ప్రశాంత్ వర్మ (Prashanth) హనుమాన్ అధిగమించి వారి రికార్డులను బ్రేక్ చేసింది.
ఫస్ట్ వీకెండ్లోనే స్టార్ హీరోల సినిమాల కన్నా హనుమాన్ అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. హిందీలో హనుమాన్ ఓపెనింగ్ డేనే రూ.2.15 కోట్లను రాబట్టింది. శనివారం రూ.4.05 కోట్ల వసూళ్లు రాగా, ఆదివారం రూ.6.06 కోట్లను కొల్లగొట్టింది. మొత్తంగా ఈ మూడు రోజుల్లో రూ.
12.26కోట్ల కలెక్షన్లను రాబట్టి బాక్సాపీస్ వద్ద విజేతగా నిలిచింది. హిందీ వెర్షన్ మాత్రమే కాదు నార్త్‌లో తెలుగు వెర్షన్‌కు మంచి ఆదరణ వస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.1.09 కోట్లుకుపైగా కలెక్షన్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 25 వరకు కొత్త సినిమాలు లేకపోవడంతో హనుమాన్ మరిన్ని కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.
Hanuman vs Gutur Kaaram : హనుమాన్ vs గుంటూరు కారం
సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్‌గా హనుమాన్ (Hanuman) విడుదలైంది. ఈ మూవీతో పాటే త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం (Guntur Kaaram)సంక్రాంతి బరిలోకి దిగింది.
రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో థియేటర్ల ఇష్యూ పెద్ద టాపిక్ అయ్యింది. అయినప్పటికీ హనుమాన్ మూవీ తాజాగా ఓవర్సీస్లోనూ గుంటూరు కారం కలెక్షన్స్‌ను బ్రేక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్లో ఇప్పటివరకు గుంటూరు కారం 2.16 మిలియన్ డాలర్లను రాబట్టగా, హనుమాన్ దాదాపు 2.20 మిలియన్ డాలర్లకు పైగానే రాబట్టిందని తెలుస్తోంది.
మరో 10 రోజులు హనుమాన్ ఇదే జోరును కొనసాగిస్తే భరత్ అనే నేను ( Bharath ane nenu), రంగస్థలం (Rangasthalam), అల వైకుంఠపురంలో (Ala vykuntapuramlo)రికార్డులను కూడా క్రాస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.