Breaking News

Hanuman Movie first song date reviled : హనుమాన్ నుండి మొదటి సాంగ్ రిలీస్ డేట్ వచ్చేసింది.

20 1 Hanuman Movie first song date reviled : హనుమాన్ నుండి మొదటి సాంగ్ రిలీస్ డేట్ వచ్చేసింది.

Hanuman Movie first song date reviled : హనుమాన్ నుండి మొదటి సాంగ్ రిలీస్ డేట్ వచ్చేసింది.

యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ ప్లే చేస్తున్న తాజా సినిమా హనుమాన్, ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తున్నామని ప్రకటించినప్పుడు దానిపై ఎవరికీ అంతగా అంచనాలు లేవు. కానీ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసిన వెంటనే సీన్ మారిపోయింది. సదరు టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా నుండి వస్తున్న ప్రతి అప్ డేట్, సినిమాపై ఆశక్తి రేకెత్తిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మూవీ ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించారు. కానీ హీరో తేజ సజ్జా అప్ కమింగ్ హీరో కావడంతో కొంత సందేహిస్తున్నారట. సంక్రాతి సీజన్ కి పెద్ద పెద్ద స్టార్ హీరోలు తమ సినిమాను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి హనుమాన్ ను పోస్ట్ పోన్ చేద్దామా అనే ఆలోచన కూడా చేస్తున్నారట.

అయితే స్టోరీ మీద ఉన్న నమ్మకంతో వాయిదా వేయడానికి ఇష్టపడటం లేదని కూడా తెలుస్తోంది. మొత్తానికి ప్రొడ్యూసర్స్ మాత్రం నిర్ణయం తీసుకోలేని ఊగిసలాటలో ఉండిపోయారు. అయితే బాలీవుడ్ లో రిలీస్ డేట్ ఇచ్చేయడంతో సంక్రాతి డేట్ ను మాత్రం మార్చలేకపోతున్నట్టు తెలుస్తోంది. మరి దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తే వారికి తోచింది ఒక్కటే, అదే ప్రమోషన్స్ లో జోరు పెంచడం.

ప్రమోషన్స్ లో భాగంగానే వంబర్14న మొదటి పాట తోపాటు చిన్న కామిక్ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. మరోవైపు డిసెంబర్ నెలలో ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ఒకటికి మించి ట్రైలర్లను విడుదల చేయరు కానీ హనుమాన్ సినిమా కోసం రెండు లేదా అంతకు మించి ట్రైలర్లను కూడా విడుదల చేయాలనీ చూస్తున్నారట. ట్రైలర్ తోనే సినిమా రేంజ్ ఏంటనేది చూపెడితే సినిమాను సంక్రాంతికి విడుదల చేసినా ప్రేక్షకాదరణకు కొదువ ఉండదని వారి అంచనా.

సినిమా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి ప్రమోషన్ల విషయంలో వీలైనంత వైవిధ్యాన్ని చూపెడుతూ దేశ వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటే మంచి ఫలితాన్ని రాబట్టుకోవచ్చని చూస్తున్నారు. 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *