Hanuman Movie Ticket Price : తేజ సజ్జా హనుమాన్ టికెట్ ఎంతంటే ?

website 6tvnews template 7 Hanuman Movie Ticket Price : తేజ సజ్జా హనుమాన్ టికెట్ ఎంతంటే ?

Hanuman Movie Ticket Price: తేజా సజ్జా(Teja Sajja) హీరోగా మారి వరుస సినిమాలు చేస్తున్నాడు. ఓ బేబీ(Oh Baby) సినిమా లో మెరిసిన ఈ కుర్రాడు, జాంబీ రెడ్డి(Jomby Reddy) సినిమా తో అలరించాడు. ఇప్పుడు జాంబీ రెడ్డి తీసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లోనే మరో సినిమా చేశాడు. అదే హనుమాన్.

అమ్రిత అయ్యర్ ఈ సినిమా లో నాయికగా నటించింది. సంకాంతి కానుకగా ఈసినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. తెలుగు తోపాటు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలతోపాటు ఇతర భారతీయ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.

భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఎస్ నిరంజన్ రెడ్డి కే నిరంజన్ రెడ్డి నిర్మించారు.

తెలంగాణ లో టికెట్ ధర ఇది : Hanuman Ticket Prices In Telangana

ఇక ఈ సినిమా విషయానికి వస్తే బడ్జెట్ ఎక్కువ పెట్టినప్పుడు హీరో సీనియర్ ? కదా అన్నది చూడాల్సిన పని లేదని చెప్పాలి. కథ డిమాండ్ చేయడం వల్లనే విఎఫెక్స్, గ్రాఫిక్స్ పనులను ఎక్కువగా ఉపయోగించి ఉండొచ్చు.

అయితే పెట్టిన పెట్టుబడి పైసలతో సహా రాబట్టుకోవాలంటే టికెట్ ధర పెంచక తప్పదు. అందుకే ఈ సినిమాకు తెలంగాణ సర్కారు(Telangana Government) కొంత వెసులుబాటు కల్పించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగల్ స్క్రీన్ థియేటర్లలో ఈ టికెట్ ధరను 110 రూపాయలుగా ఫిక్స్ చేసింది.

ఇక భాగ్యనగరంలో చుస్తే 150 రూపాయలు కు పెంచుకునే వీలు కల్పించారు. మల్టిప్లెక్స్ విషయానికి వస్తే టికెట్ ధర 295 రూపాయలకు ఫిక్స్ చేశారట. అయితే ఏపీ లో ఈ సినిమాకి సంబంధించిన టికెట్ ధరలు ఎంత మేర పెంచుకునే వీలు కల్పించారన్నది తెలియాల్సి ఉంది.

బడ్జెట్ ను బట్టి పెద్ద సినిమా కాబట్టి గుంటూరు కారం(Gunturu karam) సినిమాకి మాదిరిగానే ఈ సినిమాకి కూడా అవే ధరలు వారిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే హెవీ బడ్జెట్ సినిమాలను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కారు ఏకంగా జివో ను జారీ చేసింది.

Leave a Comment