Hanuman Pre Release Event: హనుమాన్ సూపర్ హీరో అంటున్న చిరు.

Hanuman is a super hero.

Hanuman Pre Release Event: తేజా సజ్జా(Teja Sajja) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్(Amruta Ayyar) గా తెరకెక్కిన తాజా సినిమా హనుమాన్(Hanuman), దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma) రూపొందించిన ఈ సినిమాను కె నిరంజన్(K Niranjan) నిర్మించారు.

సంక్రాతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండ ఆదరిస్తారని చిత్ర బృందం భావిస్తోంది. జనవరి 12 వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడనుంది.

కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ను జనవరి 7వ తేదీన చాల గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjevi)

హాజరయ్యి సినిమా యూనిట్ ను ఆశీర్వదించారు. ఇక ఈ సినిమా విషయమై మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు.

హనుమాన్ మా ఇలవేల్పు అయింది అందుకే – చిరు Megastar Chiru Reveled Secret Why Hanuman Become Their Family God

హనుమాన్(Hanuman) ను మించిన సూపర్ హీరో లేరని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మన జీవితంలో ఒక్కసారి గనుక హనుమంతుడి కరుణా కటాక్షాలు పొందగలిగామంటే అయన మనల్ని జీవితాంతం విడిచిపెట్టరని అన్నారు.

ఈ సినిమా తన ఆరాధ్యదైవమైన హనుమంతుడి గురించి తెలియజేసే సినిమా అని, తన చిన్ననాటి నుండి హనుమంతుడికి భక్తుడినని చెప్పుకొచ్చారు.

ఆంజనేయస్వామి(Lord Hanuman) ఆశీర్వాదం ఉండటం వల్లనే తనకు ఈ పేరు ప్రఖ్యాతలు లభించాయని, జీవితంలో తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది ఆ హనుమంతుడి అని అన్నారు. అందుకే ఆయనను తమ ఇలవేల్పుగా కొలుస్తామని అన్నారు.

Hanuman Inspired Me – Megastar హనుమంతుడే నాకు స్ఫూర్తిదాయకం

హనుమంతుడు తనకు స్ఫూర్తిదాయకమైన దైవం అని, ఎన్నో సందర్భాల్లో తన కుటుంబంలో హనుమంతుడు ధైర్యాన్ని నింపారని చెప్పారు.

tej Hanuman Pre Release Event: హనుమాన్ సూపర్ హీరో అంటున్న చిరు.

ఇక సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ హనుమాన్ సినిమా తప్పక విజయం సాధించాలని ఆశిస్తున్నానని అన్నారు. సంక్రాంతి (Sankranthi) నాటికి వచ్చే సినిమాలు బాగుండాలి గాని,

ఎన్ని సినిమాలు వచ్చినా బాగున్నవాటన్నిటిని తెలుగు ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని చెప్పారు. ఈ సినిమా కి సంబంధించిన టీజర్, ట్రైలర్లను తానూ చూశానని,

వాటిలోని విజువల్ అండ్ సౌండింగ్ చాలా బాగున్నాయని కితాబిచ్చారు చిరు. ఇక తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న సమయంలో చిరు తో కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించారు.

వాటిలో చూడాలని ఉంది(Chudalani Undi), ఇంద్ర(Indra), ఠాగూర్(Thagore) వంటి చిత్రాలను చెప్పుకోవచ్చు. ఇక హనుమాన్ సినిమాలో వరలక్ష్మి

శరత్ కుమార్(Varalakshmi Sharath Kumar), వెన్నెల కిషోర్(Vennela Kishore), వినయ్ రాయ్(Vinay Rai), దీపక్ శెట్టి(Deepak Shetty) తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Leave a Comment