Has medicine become expensive in India? : భారతదేశంలో వైద్యం ఖరీదు అయ్యిందా?

Add a heading 2023 11 26T112146.014 Has medicine become expensive in India? : భారతదేశంలో వైద్యం ఖరీదు అయ్యిందా?

Has medicine become expensive in India? : భారతదేశంలో వైద్యం ఖరీదు అయ్యిందా?

భారతదేశంలో వైద్యం ఖరీదు అయ్యిందా..కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం సంపన్నులకేనా.. సంక్షేమ పధకాలు లేని మధ్యతరగతి వారి సంగతేంటి..మంచి వైద్యం అందే మార్గం ఇదే..

మనిషి జీవనానికి అత్యంత అవసరమైన వాటిలో కూడు గూడు నీడ అనే వాటిని అత్యంత ప్రధానమైనవిగా చెబుతారు, కానీ ఆ మూడిటి తో పాటు వైద్యం అనే పదాన్ని కూడా చేర్చి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

ఎందుకంటే పేద వాడికి, కూడు గుడ్డ పై ఆరాటం ఉంటుంది, మధ్య తరగతి వాడి దగ్గర ఆ రెండు ఉంటాయి కానీ గూడు ఉండదు, ఏ అద్దె ఇంట్లోనో ఆశ్రయం పొంది కాలం వెళ్లదీస్తూ ఉంటాడు.

కానీ ఈ ఇద్దరికీ అందనిది సరైన వైద్యం. నిరుపేద వైద్యం అందక చస్తుంటే, మధ్య తరగతి వాడు, అటు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేక ఇటు ప్రయివేటు ఆసుపత్రులలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆర్ధిక స్థోమత చాలక కొట్టుమిట్టాడుతున్నాడు.

అందుకే అన్నారేమో పెద్దలు ఆరోగ్యమే మహా భాగ్యం అని. ఆరోగ్యంగా ఉంటే ఆసుపత్రులకు వెళ్లే పని ఉండదు, ఆసుపత్రులకు వెళ్లకపోతే జేబుకు చిల్లు పడదు.

మన డబ్బు మన దగ్గరే నిక్షేపంగా ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో వైద్యం అనేది దిగువమధ్య తరగతి గీత కన్నా దిగువన ఉన్న ప్రతి ఒకరికి అందని ద్రాక్ష లానే మారింది.

వైద్యం కోసమే అంటూ పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ ఇంకా ప్రభుత్వాసుపత్రులు మృత్యుకుహరాల మాదిరిగానే ఉన్నాయి.

దీనితో అనేక మంది అప్పు చేసైనా ప్రయివేటు వైద్యమే చేయించుకుంటున్నారు కానీ సర్కారీ దవాఖానా గుమ్మం తొక్కడానికి ధైర్యం చేయడం లేదు.

అయితే ఈ కారణమే వైద్యం సామాన్యుడికి మోయలేని భారంగా మారిందా ?

ఎన్టీఆర్ ఏ.ఎన్.ఆర్ ల హార్ట్ ఆపరేషన్ ఎక్కడంటే..

Add a heading 2023 11 26T113645.649 Has medicine become expensive in India? : భారతదేశంలో వైద్యం ఖరీదు అయ్యిందా?

నటరత్న, నందమూరి తారకరామారావు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు ఇద్దరు కూడా 80 ల దశకంలో హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నవారే.

అయితే ఆ హార్ట్ ఆపరేషన్ కోసం వారు ఫారెన్ వెళ్లి అక్కడే ఉండి చేయించుకున్నారు. పూర్తిగా కోలుకున్న అనంతరం వారు ఇండియాకి తిరిగి వచ్చి మరలా సినిమాల్లో నటించారు.

అక్కినేని గుండె ఆపరేషన్ చేయించుకున్న తరువాత కూడా యధావిధిగా డాన్సులు కూడా వేశారు. నందమూరి ఆయన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారు.

పైగా ఎన్టీఆర్ హార్ట్ ఆపరేషన్ తరువాతనే నాదెండ్ల మూవ్మెంట్ ను కూడా పేస్ చేశారు.

అయితే ఇవన్నీ చెప్పడానికి కారణం ఏమిటంటే ఆనాడు మన భారత దేశంలో అటువంటి అధునాతన వైద్య సదుపాయాలు లేవని చెప్పడం కోసమే.

ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ లు ఆరోగ్యం విషయంలో డబ్బును లక్ష్య పెట్టకుండా ఫారెన్ వెళ్లారు. వారిదగ్గర అందుకు తగినంత డబ్బు ఉంది కాబట్టి వారు విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు.

ఇక ఎన్టీఆర్ తన భార్య బసవతారకం కాన్సర్ వల్ల కన్ను మూయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

ఆమెకు సరైన సమయంలో కాన్సర్ ఉందని గ్రహించగలిగితే ఆమె ప్రాణాలు దక్కి ఉండేవి, కాబట్టి ఆ స్థితి మరొకరికి రాకూడదు అనే ఉద్దేశ్యం తోనే ఎన్టీఆర్ బసవరామ తారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ ను నెలకొల్పారు.

ఏ.ఎన్.ఆర్ తదనంతర కాలంలో ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. తన జీవితంలో ఈట్ లెస్ ఈట్ మోర్ అనే సూత్రాన్ని పాటించి ఎక్కువ కాలం పాటు జీవించారు.

ఎన్టీఆర్ 73 సంవత్సరాల వయసులో కన్ను మూసినప్పటికీ ఏ.ఎన్.ఆర్ మాత్రం 90 వసంతాలు పూర్తి చేసుకున్నారు.

సామాన్యులకు వైద్యం బహు దూరం..

ఇక సామాన్యుల విషయానికి వస్తే వారు సినిమా హీరోలుగా మారి శ్రీమంతులుకాగా ఎదగబట్టి ఖరీదైన వైద్యాన్ని అందిపుచ్చుకోగలిగారు.కానీ మాములు ప్రజలకు అది సాధ్యపడటం లేదు.

మరో ప్రక్క సంక్షేమ పధకాల పేరుతో పేద వారికి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వాలు డప్పాలు కొట్టుకుంటున్నాయి, కానీ ఆ సంక్షేమ పధకాలు మధ్యతరగతి వాడికి అందవు, కేవలం తెల్ల రేషన్ కార్డు వారికి మాత్రమే ఆ సౌకర్యం ఉంటుంది.

అయితే మధ్య తరగతి వాడు మాత్రం వైద్యం విషయం లో ఆర్ధికంగా నలిగిపోతున్నాడు. చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రికి వెళ్లాల్సిందే, ప్రతుతం ప్రయివేటు ఆసుపత్రిలో అవుట్ పేషేంట్ గా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 500 వందలు అప్పటికప్పుడు సమర్పించాల్సిందే.

ఇక మందుల ని, ఎక్స్ రే లని, టెస్టులని, రకరకాల రూపంలో డబ్బును ముక్కు పిండి వసూలు చేస్తారు. దీంతో మిడిల్ క్లాస్ పీపుల్ కి బడ్జెట్ తడిసి మోపెడవుతుంది.

వీళ్ళ ఆలోచన ఎలా ఉంటాయంటే వీలైనంతవరకు మెడికల్ షాప్ లో టాబ్లెట్స్ తెచ్చుకుని వేసుకుని రోగం నయం చేసుకోవాలని అనుకుంటారు, అప్పుడు కూడా తగ్గకపోతే దగ్గరలోని ఆర్.ఎం.పి ని ఆశ్రయిస్తారు.

అప్పటికి తగ్గకపోతే ఆసుపత్రి మెట్లు ఎక్కుతారు. ఎందుకంటే పెట్టాల్సిన ఖర్చు తగ్గుతుందేమో అని ఒక చిన్న ఆశ. కొన్ని కొన్ని సందర్భాల్లో వీరి టైం బాగుంటే ఆర్.ఎం.పి వాడిన మందులతో కూడా నయం అవుతూ ఉంటుంది.

కేవలం మిడిల్ క్లాస్ ప్రజానీకాన్ని బేస్ చేసుకునే చిన్న చిన్న క్లినిక్ లు పట్టణాలు అనేకం ఉంటున్నాయి. ఇచ్చిన వరకు తీసుకుని వచ్చిన కాడికి వైద్యం చేసే డాక్టర్లు కూడా ఉన్నారు. వీళ్ళను చిల్లర దేవుళ్లుగా చూడొచ్చు.

కార్పొరేట్ దోపిడీ ఎలా ఉంటుందంటే..

Add a heading 2023 11 26T115030.107 Has medicine become expensive in India? : భారతదేశంలో వైద్యం ఖరీదు అయ్యిందా?

ఇది కాకుండా కార్పొరేట్ దోపిడీ మరోలా ఉంటుంది. కొన్ని కొన్ని ఆసుపత్రులలో అసలు పేషంట్ ను వారి కుటుంబ సభ్యులకు కూడా చూపించకుండా ఐసీయూ లో పెట్టేస్తారు.

కేవలం ఐసీయూ గది తలుపుకి ఉండే చిన్నపాటి అద్దం నుంచి మాత్రమే చూసేందుకు వీలు కల్పిస్తారు. అదేమని అంటే ఇన్ఫెక్షన్ అనే పేరు వాదిస్తారు.

వైద్యులు ఏ మందులు చెప్తే ఆ మందులు తీసుకు వచ్చి నర్సులు కాంపౌండర్ల చేతికి ఇవ్వడమే మన పని, ఆతరువాత ఆ మందులు ఇంజక్షన్ లు ఏ టైం కి వాడారు అన్నది అస్సలు మన చెవిన వేయరు, మన కంటి తో చూడనివ్వరు. ఇది అక్కడి తంతు.

ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే వైద్యం మీకు తెలుసా మాకు తెలుసా, డాక్టర్ మీరా మేమా అంటూ ఒకరకమైన భయాన్ని మన మదిలో క్రియేట్ చేస్తారు.

దాంతో ఎంతటివారైనా సైలెంట్ గా ఉండిపోతారు. కొన్ని ఆసుపత్రులలో చనిపోయిన మృతదేహాన్ని కూడా వదలకుండా వైద్యం అందిస్తున్నట్టు నాటకాలాడి దొరికిపోయిన వైద్య సిబ్బంది కూడా ఉన్నారు.

దొంగ డాక్టార్ల తో జాగ్రత్త సుమా..

Add a heading 2023 11 26T115558.367 Has medicine become expensive in India? : భారతదేశంలో వైద్యం ఖరీదు అయ్యిందా?

మరి కొన్ని ఆసుపత్రులలో తంతు వేరేగా ఉంటుంది, సరైన అర్హత లేని డాక్టర్లు వైద్యం చేస్తూ మందులు ఇవ్వడమే కాక, ఆపరేషన్లు చేయడం కూడా చేస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో అవి వికటించి మనుషుల ప్రాణాలు ఆసుపత్రి బెడ్ మీదనే పోతున్నాయి.

నకిలీ సర్టిఫికెట్లను వాడటమో లేదంటే వేరే డాక్టర్ పేరుతో ఆసుపత్రికి అనుమతులు తెచ్చుకుని మరి వ్యక్తి వైద్యం చేయడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం.

ఇటువంటి ఉదంతాలు తేరా రోగుల ప్రాణాలు పోయి వారి కుటుంబసభ్యులు ఆర్తనాదాలు చేసిన తరువాతనే బయటకు వస్తున్నాయి.

అసలు ప్రాణ నష్టం జరగక మునుపే ఇటువంటి ఆసుపత్రులపై ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నాయి.

నగరంలోని ఏయే వార్డులో ఎక్కడెక్కడ క్లినిక్స్ ఉన్నాయన్న సమాచారం తెప్పించుకోవడం అధికారులకు కష్టతరమైన పని కాదు కాబట్టి ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్లు కాస్తున్నాయి.

మెడికల్ సీటు ఎంతో తెలుసా..

Add a heading 2023 11 26T121533.368 Has medicine become expensive in India? : భారతదేశంలో వైద్యం ఖరీదు అయ్యిందా?

ఒక విద్యార్థి డాక్టర్ చదువు చదివి, వైద్యం అందించే అర్హత సాధించడానికి పట్టె సమయం ఖర్చు రెండూ ఎక్కువే, పైగా మన దేశంలో డాక్టర్లు చాల తక్కువ సంఖ్యలో ఉన్నారు.

సప్లై ను బట్టి డిమాండ్ ఉంటుంది అంటారు. అంటే ఏ వస్తువైతే తక్కువ సంఖ్యలో ఉంటుందో దానిని కొనడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది చాలా ప్రాధమిక సూత్రం.

ఈ సూత్రం వైద్యానికి కూడా వర్తిస్తుంది. మన దేశంలో వైద్యం చదివిన వారు తక్కువ మంది, డాక్టర్ చదివితేనే వైద్యం చేసే అర్హత ఉంటుంది కాబట్టి వైద్యులకు అపరిమితమైన డిమాండ్ ఉంది.

పైగా ఇంజినీరింగ్ లో సీటు కొనాలంటే ఏమంత పెద్ద ఖర్చు కాదు మహా అయితే ఏడాదికి ఒక 10 లక్షలు నాలుగేళ్లకి కలిపి 40 లక్షలు అవుతుందేమో.

ప్రస్తుతం ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఒకటి లేదా రెండు ఇంజినీటింగ్ కాలేజీలు వచ్చేశాయి. పుట్టగొడుగుల్లా కాలేజీలు పుట్టుకొచ్చిన కారణంగా సీట్లు మిగిలిపోయిన సందర్భం కూడా ఉంది.

అయితే మెడికల్ కాలేజీ పరిస్థితి వేరు. ఒక మెడికల్ సీటు కొనాలంటే ఒక కోటి యాభై లక్షల నుండి రెండు కోట్లు ఉంటుంది అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన సేతు కొనాలంటే మూడు నుండి నాలుగు కోట్ల వరకు కూడా ఖర్చవుతుంది.

వైద్యం అందుకే అందని ద్రాక్ష లా మారింది

ఖరీదైన చదువు చదివిన వైద్యుడు ఆ తరువాత ఉచిత వైద్యం అందిస్తాడని ఆశించడం అమాయకత్వం అవుతుంది.

పైగా అంత ఖరీదైన చదువు పూర్తి చేసిన అనంతరం అంతకు ఎక్కువగానే తక్కువగానే ఖర్చు చేసి ఆసుపత్రి కట్టవలసిందే, లేదంటే చెట్టు కింద ఆసుపత్రి పెట్టి వైద్యం చేయలేదు కదా..మరి పెట్టిన ఖర్చంతా రాబట్టాలి అంటే పేషంట్ల దగ్గర నుండి వసూలు చేయాలి.

కాబట్టీ నేటి రోజుల్లో వైద్యం అందని ద్రాక్షలా కాదుకానీ ఖరీదైన ద్రాక్షలా మారింది.

మరో వైపు చుస్తే మెరిట్ లో పాస్ అయ్యి ఫ్రీ గా మెడికల్ సీట్ సంపాదించిన విద్యార్థులు కూడా మెడిసిన్ పూర్తి చేసిన అనంతరం కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తూ డబ్బు సంపాదించుకోవాలని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.

ఎవరో ఒకటి ఆరా వైద్యులు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

అయితే వారిలో కూడా కొందరు పార్ట్ టైం గా మల్టి స్పెషాలిటీ ఆసుపత్రులలో వైద్యులుగా పనిచేస్తున్నారు.

విదేశాల్లో మన డాక్టర్లకు గిరాకీ..

భారతదేశంలోని వైద్యులకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది, ఇండియా నుండి వచ్చిన వైద్యుల హస్తవాసి మంచిదని అక్కడ కూడా మంచి నమ్మకమే ఉంది.

అనాదిగా చూస్తే మన దగ్గర చదువుకుని ఫారెన్ వెళ్లి పెద్ద పెద్ద ఆసుపత్రులలో వైద్యులుగా పనిచేస్తున్న వారు వేలు లక్షల సంఖ్యలో ఉంటారు.

విదేశాలలో ప్రముఖ వైద్యులుగా [పేరెన్నికగన్న వైద్యులతో మన భారతీయులు కూడా ఉన్నారు. విదేశాలలో వైద్యులను కేవలం వైద్యులుగానే చూస్తారు, వారు డబ్బు తీసుకుని చికిత్స అందిస్తున్నారు వారిది కూడా ఒక వృత్తే అన్నట్టు ఉంటుంది.

కానీ భారత దేశంలో వైద్యులకు ఉండే గౌరవ మర్యాదలు వేరుగా ఉంటాయి. ఇక్కడ వైద్యులను దైవంతో సమానంగా చూస్తారు.

అందుకే వైద్యో నారాయణో హరీ అనే మాట వచ్చింది. వైద్యులు దేవునితో సమానమే కానీ ఈ దేవుళ్ళు కాస్త ఖరీదైన దేవుళ్ళు అంతే.

ఆరోగ్య భీమా పై అవగాహన అవసరమే..

Add a heading 2023 11 26T123919.952 Has medicine become expensive in India? : భారతదేశంలో వైద్యం ఖరీదు అయ్యిందా?

భారతదేశంలో వైద్యం ఇంత ఖరీదైనది గా మారిపోతున్నప్పటికీ అనేక మందికి హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటి మీద అవగాహన లేకపోవడం శోచనీయం.

ఆరోగ్య భీమా పొందడం వల్ల అనారోగ్యం వచ్చిన సమయంలో నిశ్చంతగా ఉండొచ్చని, ఏడాదికి ఒక్కసారి డబ్బు చెల్లించడం ద్వారా మన చేతిలో డబ్బు వృధా కాకుండా ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం పొందవచ్చనే విషయాన్నీ మర్చిపోతున్నారు.

ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సంక్షేమాన్ని అందిపుచ్చుకోలేని మధ్యతరగతి వారు ఆరోగ్య బీమాను చేయించుకోవడం వల్ల తక్కువ ఖరీదు తో మెరుగైన వైద్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Leave a Comment