#Vanakammodi v/s #GoBackModi: గో బ్యాక్ మోదీ అంటూ..ట్విట్టర్ లో హ్యాష్ టాగ్స్.

Hash tags on Twitter.

#Vanakammodi v/s #GoBackModi: భారత ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలో పర్యటించనున్నారు. దీనితో అధికార యంత్రాంగం అన్నీ ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసింది.

ఇది ఇలా వుండగా తమిళనాడులో Pm ప్రధాని పర్యటన అని తెలియగానే సోషల్ మీడియా గో బ్యాక్ మోదీ అంటూ హాష్ ట్యాగులతో దద్దరిళ్ళిపోతుంది.

ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ గోబ్యాక్ మోదీ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు.. ఈ హ్యాష్‌ట్యాగ్‌కు ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తమిళనాడుకు చెందిన కొందరు నెటిజన్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ సిద్ధాంతాలు, ధరల పెరుగుదల,

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, హిందీ భాషపై వివాదం, వ్యాపారవేత్తలకు ప్రధాని మోదీనే కారణమంటూ ఆరోపిస్తున్నారు.

ఇలా రకరకాల కారణాలతో మోదీ చెన్నై పర్యటనను కొందరు తమిళ తంబీలు నిరసిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా తమ నిరసనను తెలుపుతున్నారు.

ఇలాంటి హ్యాష్‌ట్యాగ్స్ ను పీఎం మోదీ ఎప్పుడు తమిళనాడు వెళ్లినా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతునే ఉంటాయి.

కానీ, ఈసారి తమిళనాడు బీజేపీ సోషల్ మీడియా కూడా ఈ హ్యాష్‌ట్యాగ్‌ను తిప్పికొడుతూ వణక్కం మోదీ అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రోల్ చేస్తున్నారు.

ఈ ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్ వార్ మోదీ చెన్నైకి చేరుకునే సమయానికి పరాకాష్టకు చేరేలా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి ఈ రోజు సాయంత్రం 5.10 గంటలకు చెన్నైకి చేరుకుంటారు.

తరువాత పూర్తయిన 1,152 గృహాలను మోదీ కూడా ప్రారంభించనున్నారు. అలాగే, రూ.28,500 కోట్లతో చేపట్టనున్న ఆరు ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

విమానాశ్రయంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు స్వాగతం పలకనున్నారు. వెల్కమ్ మోదీ అంటూ చెన్నై నగరంలో పోస్టర్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

అంతేకాదు.. కొన్ని పోస్టర్లపై 2024లో మధురై నుంచి ఎంపీగా మోదీ జీ పోటీ చేయాలని కూడా కొంత మంది కార్యకర్తలు కోరుతున్నారు.

Leave a Comment