నేటి ఆధునిక సమాజంలో పెళ్లి అనేది అంటే అతిపెద్ద వేడుక. మరి అలాంటి వేడుకను రక రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు డబ్బున్న వ్యక్తులు. కొంతమంది అయితే కొంత మంది వినూత్నంగా ఆలోచనలు చేసి పదిమందికి ఆదర్శంగా నిలవడం కూడా చూసి ఉంటాం. ఇప్పుడు అలాంటి పెళ్లివేడుక మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏనుగొండ అనే చిన్న గ్రామం లో అట్టహాసంగా జరిగింది.
సంతోష్ నగర్ కాలనీకి చెందిన ఉమామహేశ్వరి , రాజనర్సింహాశెట్టి దంపతులు తమ కుమార్తె పెళ్లిలో మొత్తం ఆర్గానిక్ వంటలు చేయించి దగ్గరుండి అందరికి వడ్డించి పెళ్లికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా పెళ్లికి ఆహ్వానం పలుకుతూ కట్టిన ఫ్లెక్సీ సైతం వినైల్ ప్రింటింగ్ తో కాకుండా పూర్వ కాలం లో రాసినట్లు గా వస్త్రంపై వధూవరుల చిత్రాలతో కూడిన ఆహ్వానాన్ని పెయింటింగ్ చేయించారు. ఇలా చెయ్యడానికి ఒక కారణం ఉందని చెప్తున్నారు వధువు తల్లి తండ్రులు.
రాజనర్సింహాశెట్టి ఆ గ్రామం లో పేరు పొందిన విద్యుత్ కాంట్రాక్టర్, ఆయన భార్య ఉమామహేశ్వరి, ఈవిడ గత కొంత కాలం గా బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతోందని రాజనర్సింహా శెట్టి చెప్పారు. ఈ దంపతులకు నలుగురు సంతానం అని అందులో అందరు ఆడపిల్లలే అని చెప్పారు. తమ పెద్ద కూతురు బిడ్డ ఆనారోగ్యంతో బాధపడుతోందని కొందరి ఆయుర్వేద నిపుణులు చెప్పడం వల్ల , వారి సూచనల మేరకు సేంద్రియ ఆహారం తయారు చేసుకుని తినడం మొదలు పెట్టమని చెప్పారు.
ఇక అప్పటి నుంచి పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలోనే పండించిన కురగాయలు, పప్పులు, వీటితో తయారు చేసిన ఆహార ఉత్పత్తులనే తీసుకుంటున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే సెంద్రీయ ఉత్పత్తుల గురించి వాటి వల్ల ఉండే ఎపయోగాలు గురుంచి మరింత మందికి అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యం తో తమ నాలుగో కూతురు వివాహానికి హాజరైన వారికి సేంద్రీయ వంటకాలను తయారు చేయించి వచ్చిన అతిధులకు విందుభోజనం పూర్తిగా వడ్డించారు.
ఈనెల 28న రంగ రంగ వైభోగం గా జరిగిన పెళ్లి వేడుకులకు వచ్చిన సుమారు 2500 మందికి సేంద్రీయ వంటకాలను తయారు చేసిన భోజనం ఏర్పాటు చేశారు. ఇందులో వాడినని అన్ని సాంప్రదాయ పద్దతులలో పండించినవే అవ్వడం విశేషం. మైసూర్ మల్లిగ బియ్యం, బ్లాక్ రైస్‌తో పలు రకాలు స్వీట్లు చేయించారు.
వచ్చిన అతిథులకు బాస్మతి రైస్‌తో వెజిటెబుల్ బిర్యానీ, మా పిల్లేసంబ నవారా బియ్యంతో తయారు చేసిన పెరుగు అన్నం , స్వచ్ఛమైన నెయ్యి, దేశీ ఆవు పాలు, పెరుగు ఈ పదార్ధాలు అన్ని అరటి ఆకులో వడ్డించారు. తమిళనాడు, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఓ మహిళా రైతుతో పాటు పలువురు నుంచి గో ఆధారిత సేంద్రీయ బియ్యం, పప్పు ధాన్యాలను సేకరించి ఇతర సామాగ్రితో వంటకాలు చేయించామని రాజనరసింహా శెట్టి చెప్పారు.
సమాజం లో ఉన్న ప్రతి ఒక్కరికి సేంద్రీయ ఆహారంపై అవగాహ కల్పించాలన్న ఉద్దేశ్యంతోనే తమ నాలగవ కూతురు వివాహవేడుకలో వంటకాలను చేయ్యించినట్లు రాజనర్సింహాశెట్టి తెలిపారు. ఈ రకంగా పెళ్లి భోజనం పెట్టడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. సాధరణంగా పెళ్లి భోజనాలకు అయ్యే ఖర్చు కన్నా తనకు పెళ్ళికి ఖర్చు తక్కువగా వచ్చిందని రాజనర్సింహాశెట్టి చెప్పారు. వచ్చిన వారికి తెలియాలని పెళ్లి వేడుకలోనే ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శనకు కోసం ప్రత్యేకంగా స్టాల్ ను సైతం ఏర్పాటు చేసామని ఆయన అన్నారు.