Sachin’s deep fake video: సచిన్ డీప్ ఫేక్ వీడియో చూశారా ? వీడియోలో ఎం ఉందంటే ?

website 6tvnews template 45 Sachin's deep fake video: సచిన్ డీప్ ఫేక్ వీడియో చూశారా ? వీడియోలో ఎం ఉందంటే ?

Have you seen Sachin’s deep fake video?: డీప్ ఫేక్ వీడియో బారిన పడి కలత చెందిన వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, అలియా భట్, తోపాటు నిన్నటి తరం నాయిక కాజోల్ కూడా ఉన్నారు. అయితే ఈ జాబితా లోకి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోయాడు. సచిన్ కూడా డీప్ ఫేక్ బాధితుడయ్యాడు.

అయితే వారిలా ఎక్స్పోజింగ్ చేయించారా మాస్టర్ బ్లాస్టర్ తో అని ఆలోచనలో పడకండి, ఈ క్రికెట్ దిగ్గజం తో డీప్ ఫేక్ వీరియో చేయించి నకిలీ యాప్ లకి మోసపూరిత యప్లేకి ప్రమోషన్ ఇస్తున్నట్టు వీడియో చేయించారు. అయితే ఈ విషయం సచిన్ వరకు వెళ్లడంతో సచిన్ రెస్పాండ్ అయ్యాడు. సచిన్ పర్సనల్ అసిస్టెంట్ రమేశ్ పార్డే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేడు నమోదు చేసిన ముంబై పోలీసులు : Mumbai police registered the case

ఈ కేసుపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసుకున్న ముంబై సైబర్ సెల్ (Mumbai Cyber Cell Police)పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వీడియో క్రియేట్ చేయడం గురించి గుర్తు తెలియని వ్యక్తి పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 500, ఐటీ చట్టంలోని సెక్షన్ 56 కింద ఈ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. జనవరి 15 వ తేదీ నుండే ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Skyward Aviator Request అనే గేమింగ్‌ యాప్‌ను సచిన్ స్వయంగా ప్రమోట్ చేసినట్టుగానే ఆ వీడియోలో ఉంది, పైగా తన కూతురు సారా టెండూల్కర్ కూడా ఈ గేమ్ వాడుతూ ఎంజాయ్ చేస్తోందని సచిన్ చెప్పినట్టు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన ఈ వీడియోలో సచిన్ ఇంకా ఎం చెప్పాడంటే ఈ వీడియో ను ఉపయోగించి వేగంగా డబ్బు సంపాదించవచ్చని అంటున్నారు.

వీడియో పై సచిన్ విచారం.. Sachin felt sad about the video

ఇక సచిన్(Sachin) వీడియో అని తన అభిమానులకు, ఫాలోవర్స్ కి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆ వీడియోను తన ఎక్స్‌ (X)ఖాతాలో షేర్‌ చేశాడు. దానిని ఎవ్వరూ నమ్మవద్దని, అది మోసపూరితమైన యాడ్(Dangerous Apps) అని చెప్పుకొచ్చాడు.

టెక్నాలజీని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారని మండి పడ్డాడు. ఇలాంటి వీడియోస్(Videos), యాడ్స్‌,(Adds) యాప్స్‌ గమనించినప్పుడు వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ చెప్పాడు. ఇలాంటి వీడియోల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. ఇక చట్టపరంగా వీరిపై కఠిన చర్యలు చేపట్టాలని, ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడాలంటే బి భయపడేలా శిక్ష ఉండాలని సూచించాడు.

Leave a Comment