AI టెక్నాలజీ ద్వారా చనిపోయిన కూతురిని బ్రతికించుకున్నాడు

WhatsApp Image 2024 03 14 at 11.55.36 AM 1 AI టెక్నాలజీ ద్వారా చనిపోయిన కూతురిని బ్రతికించుకున్నాడు

ఏ తండ్రి కి అయిన కూతురు అంటే ప్రాణం గా చూస్తాడు. కూతురు నాన్న నాకు అది కావాలని అడగాలనే కాని ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తాడు. అది తండ్రి ప్రేమ అంటే. ఇటీవల తైవాన్ దేశానికీ చెందినా ఒక తండ్రి కి ఊహించని దెబ్బ ఒకటి తగిలింది. అదే తన ఒక్కగాని ఒక్క కూతురు బ్లడ్ డిసీజ్ తో చనిపోయింది. ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పెంచుకున్న ఒక్క కూతురు అలా చనిపోయే సరికి ఆ తల్లి తండ్రులు కి ఎం భోధ పడలేదు.

తనకి వ్యాధి వల్ల మాట పడి పోయింది. ఉన్న కొద్ది రోజులు కూడా తన కూతురు మాటలు వినలేక పోయినందుకు నరకం అనుభవించాడు. తన కూతురు చనిపోయిన తర్వాత చాలా కాలం పాటు భార్య భర్త లు ఇద్దరు అసలు మాట్లాడుకోలేదు. ఇద్దరిలో ఎవరు మాట్లాడిన తన కూతురు ప్రస్తావన వస్తుందని దాని వల్ల ఇద్దరిలో ఎవరో ఒకరు భాదపెట్టిన వాళ్ళు అవుతాం అని సైలెంట్ గా ఉండిపోయారు.

కాని ఒక రోజు తన భార్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో లో ఉన్నది తన కూతురు లా ఉంది అనుకుంది. తన భర్త కి చూపించి కూతురు మాట్లాడలేదు కదా మరి ఈ వీడియో ఎలా వచ్చింది ఎలా మాట్లాడుతోంది అని భర్త ని అడిగింది. అప్పుడు భర్త తన భార్య కి చెప్పాడు. అది AI టెక్నాలజీ ఉపయోగించి తయారుచేసానని చెప్పాడు.

ఇది ఎలా సాద్యం అని భార్య అడిగితే తనకి కంప్యూటర్ మీద పట్టు ఉంది కనుక తన కూతురు సంబందించి ఒక ఆడియో వీడియో తయారు చేయాలని అనుకున్నానని అందుకని A I టెక్నాలజీ లో PHD చేసానని దాని సాయం తోనే కూతురు కి సంబందించిన వీడియో అలా రూపుదిద్దుకుందని తన భర్త చెప్పాడు. ఇప్పడు ఈ A I టెక్నాలజీ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుంటే ఆ భార్య భర్త లు ఇద్దరు తమ కూతురు తో ఎంత సేపు అయిన మాట్లాడడానికి వీలు పాడడం తో ఇప్పుడు వారికి కూతురు లేని లోటు తీరిపోయింది.

ఇప్పుడు వీరు తమ కూతురు తమతోనే ఉందని అనే భవన లో ఉన్నారు. తమ కూతురు తమ మద్య లేకపోయినా ఈ A I టెక్నాలజీ పుణ్య మా తమ భాదని కొంత వరకు మర్చిపోగలిగామని ఆ భార్య భర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment