కోవిడ్ రాకుడదని 200 సార్లు వాక్సిన్స్ వేయించుకున్నాడు – ఏమైంది ?

5ca06930 38fd 11eb bf9b 38a4c8d7a1a3 కోవిడ్ రాకుడదని 200 సార్లు వాక్సిన్స్ వేయించుకున్నాడు - ఏమైంది ?

మొత్తం ప్రపంచాన్ని వణికించిన ఆ మహామ్మారి ని తలుచుకుంటే చాలు వెన్నులో ఒణుకు పుడుతుంది. అయితే చాలామంది ప్రాణాలు పోకుండా అవసరమైన వాక్సిన్స్ వేయించుకున్నారు అప్పట్లో. అంతే కాదు మానవ శరీరం లో రోగ నిరోధక శక్తీ పెరగడానికి ఈ వాక్సిన్స్ బాగా పనిచేసాయి. వాక్సిన్ బట్టి చాల మంది ఒక డోసు రెండు డోసులు అని కుడా వేయించుకున్నారు. కాని కొంత మంది అతి జాగ్రత్తలకు పోయి ఎక్కువ సార్లు తీసుకున్న వార్తలు కూడా వచ్చాయి.

ఇప్పుడు అలాంటి వ్యక్తి గురుంచి చెప్పుకుంటే అతను జర్మని కే చెందినా వ్యక్తి. ఇతడు ఏకంగా 200 సార్లు వాక్సిన్స్ తీసుకున్నానని అని చెప్పడం తో జెర్మనీ వైద్య యంత్రాంగం ఒక్క సారి ఉలిక్కి పడింది. దీంతో అక్కడ అధికారులు పరుగులు పెట్టి అతని శరీరం ఏ విధం గ ఉంది. బాడీ లోపల ఎలా ఉంది. అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి ఇలా రిసెర్చ్ మొదలు పెట్టేసారు. దాంతో చాల ఆసక్తి కర విషయాలు బయటకి వచ్చాయి.

అయితే అధికారుల లెక్కల ప్రకారం అతడు 134 సార్లు వాక్సిన్స్ తీసుకున్నట్లు తేలింది అని చెప్పారు.అయితే ఇన్ని సార్లు తీసుకుంటే రోగ నిరోధక శక్తీ వ్యవస్ద మొత్తం బలహీన పడి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కునే శక్తీ ని కోల్పోతారని డాక్టర్ల బృందం తెలిపింది. విచిత్రం ఎంటంటే అతని బాడి లో అన్ని అవయవాలు సరిగ్గానే పని చేస్తున్నాయని వారు తెలిపారు. అతని శరీరం లో లోపల అంతా సాధారణ స్థితి లోనే ఉందని డాక్టర్లు చెప్పారు

Leave a Comment