Cheif Guest Of Bigg Boss Telugu 7 Grand Finale: బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఇతనే.

He is the guest of Bigg Boss 7 grand finale.

Cheif Guest Of Bigg Boss Telugu 7 Grand Finale: బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఇతనే.

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రియాలిటీగా పేరుగాంచిన బిగ్ బాస్, వివాదాలకి ఇల్లులాంటిది. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసి, ప్రస్తుతం 7 వ సీజన్ ఉల్టా పుల్టా సాగుతుంది. ఇప్పడు బిగ్ బస్ తెలుగు చివరి వారానికి చేరుకుంది.

చాలా మంది ఇంటి సభ్యులు ఎలిమినేషన్ లో ఇంటి నుండి వెళ్లిపోగా, ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఆరుగురు పోటీదారులు ఫైనల్స్ వరకు వచ్చారు.

బిగ్ బాస్ టైటిల్ కోసం శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అర్జున్ అంబటి, అమర్ దీప్, ప్రియాంకా జైన్ ఉన్నారు. ఈ ఆదివారం అసలు బిగ్ బాస్ టైటిల్ విజేత ఎవరో ప్రకటిస్తారు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17 వ తారీఖున ఆదివారం జరగనుంది.బిగ్ బాస్ 6 వ సీజన్ గ్రాండ్ ఫినాలే అతిథులు ఎవరూ లేకుండానే చాలా సాదారణంగా పూర్తయ్యింది.

ఈ సారి మాత్రం బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలేకి సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా రానున్నట్టు ప్రచారం సాగుతుంది. గ్రాండ్ ఫినాలేకి మహేష్ బాబు ని ఆహ్వానించినట్టు సమాచారం.

కానీ మహేష్ బాబు వస్తాడా రాడా అన్నది ఒక్క రోజులో తెలిసిపోతుంది.గుంటూరు కారం సినిమా విడుదల త్వరలో ఉంది కాబట్టి మహేష్ బాబు ఆ సినిమా ప్రమోషన్ల కోసం వచ్చే అవకాశం ఉంది.

ఇక చివరి ఎపిసోడ్ లో టైటిల్ విన్నర్ అనౌన్స్ మెంట్ ఉంటుంది కాబట్టి మహేష్ బాబు తో పాటు సంక్రాంతికి విడుదలకి సిద్దంగా ఉన్న హీరోలు కూడా వచ్చే అవకాశం ఉంది.

Leave a Comment