నిన్న జరిగిన రామేశ్వరం కేఫ్ లో పేలుడు కి కారణం ఇతనే

5ab4145d b048 4ebd a120 54b230b69fee నిన్న జరిగిన రామేశ్వరం కేఫ్ లో పేలుడు కి కారణం ఇతనే

నిన్న బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబు పేలుడు విషయం అందరికి తెలిసిందే. ఈ పేలుడు తో బెంగళూరు నగరం ఒక్క సారి ఉలిక్కి పడింది. ఆయినే నిన్నటి నుండి పోలీసులు తో పాటు NIA వాళ్ళు జారిపిన సోదాల లో కొన్ని అనుమానిత వస్తువులను గుర్తించారు పోలీసులు.

వీటితో పాటు అక్కడ ఉన్న CC Tv లను పరిశీలించినపుడు వారికి ఒక అనుమానితుడు కనిపించడం జరిగింది. అక్కడ ఒక నల్లని బాగ్ ఉండడమే కాకుండా ఆ బాగ్ పెట్టిన చోటే పేలుడు జరిగింది అని ఒక నిర్ధారణ కి వచ్చారు పోలీసులు, NIA అధికారులు.

అయితే మొత్తం ఫుటేజ్ పరిశీలించగా ఒక అనుమానితుడు దగ్గర ఉన్న బాగ్ అక్కడ పెట్టిన బాగ్ ఒకటే అవడంతో పేలుడు అతని పనే అయ్యి ఉంటుందని వారు చెప్పారు.అతడు ఎక్కడ నుండి వచ్చాడు అనేది మొత్తం జల్లిడ పట్టగా అతను ఒక బస్ లో రామేశ్వరం కేఫ్ వద్దకి వచ్చాడని గుర్తించారు.

ఫుడ్ కౌంటర్ దగ్గర టోకెన్ తీసుకుని డైనింగ్ టేబుల్ వద్దకి వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే ఎం తినకుండానే వెను తిరిగి వెళ్లిపోయినట్లు వెళ్తూ వెళ్తూ బాగా అక్కడ వదిలి వెళ్ళడం జరిగింది అని వారి విచారణ లో ఇదే ఇంత వరకు ఉన్న సమాచారం అని అయితే అతడు ని గుర్తించే పని లో ఉన్నాం అని అతని ముఖ కవళికలు సరిగ్గా కనిపించడం లేదు అని కాని ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ని అంటే AI ను ఉపయోగించి అన్ని వివరాలు సంపాదిస్తాం అని పోలీసులు అలాగే NIA అధికారులు ఒక ప్రకటన లో తెలిపారు.

Leave a Comment