Bigg Boss 7 Telugu: ప్రియాంక జైన్ తన బిగ్ బాస్ జర్నీ గురించి ఏం చెప్పిందంటే.
BIG BOSS TELUGU SEASON 7 లో లేడి ఫైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న PRIYANKA JAIN, టాప్ 6 కంటెస్టెంట్స్ లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకుంది.
బుల్లితెర నుంచి రియాలిటీ షో వరకి :
స్టార్ మా లో బుల్లితెర సీరియల్స్ లో నటించే PRIYANKA JAIN, BIG BOSS SEASON 7 కంటెస్టంట్ గా అడుగు పెట్టింది.మొదటి వారం నుంచి హౌస్ లోని కంటెస్టంట్ ల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
హౌస్ లో ఆమె ఆట కన్నా ఆమె వంట చేయడమే ఎక్కువయ్యేది. ఆమె హౌస్ మేట్స్ కి వంట చేసేందుకే బిగ్ బాస్ కి వెళ్ళిందా అంటూ చాలా మంది ఆమెను విమర్శించారు.
హౌస్ లో వివాదాలు :
హౌస్ లో PRIYANAKA JAIN గట్టి గట్టిగా ఇతర హౌస్ మేట్స్ పైన అరిచేది.
కొంతమంది తో కలిసి టీంగా విడిపోయి మిగితా వారిని టార్గెట్ చేసేవారు.
హౌస్ లో జరిగే గోడవలన్నీటికి ఒకానొక సమయంలో ప్రియాంక ప్రధాన సూత్రధారిగా మారింది.
హౌస్ జర్నీ గురించి ప్రియాంక అభిప్రాయం :
BIG BOSS నుంచి బయటకు వచ్చిన తరువాత ఇంటర్వ్యూ లో ప్రియాంక మాట్లాడుతూ,
హౌస్ లో నాకు తప్పు అనిపించింది నేను చెప్పాను,
ఇక పోతే శోభ, అమర్ ముందు నుంచి మంచి స్నేహితులు అందుకే వాళ్ళతో అంత బాగా ఉన్నాను కానీ వల్ల దగ్గర నుంచి ఏది ఆశించలేదు అన్నారు.
అలాగే డబ్బు విషయానికి వస్తే, తనకి ఓటు వేసి గెలిపించిన అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే డబ్బు ఆఫర్ చేసినప్పటికీ తీసుకోలేదని అన్నారు.