త్వరలో తెలుగు హీరొయిన్ తో హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి

WhatsApp Image 2024 03 11 at 5.13.19 PM త్వరలో తెలుగు హీరొయిన్ తో హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి

తన మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కిరణ్‌ అబ్బవరం మంచి టైమింగ్ తో పాటు కధని ఎంచుకోవడం వల్ల మొదటి మూవీ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ మూవీ లోనే రహస్య హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య మంచి స్నేహం కుదిరింది.

ఇక అక్కడ నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగింది. అయితే ఆ సమయం లో అలాంటిది ఏమీ లేదని తనకు రహస్య మంచి స్నేహితురాలు అంతే అని కిరణ్‌ ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇక తన సినిమాల విషయానికి వస్తే, గత సంవత్సరం విడుదల అయిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మీటర్‌’, ‘రూల్స్‌ రంజన్‌’ లాంటి మూవీలతో కిరణ్‌ అబ్బవరం ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాయి. ప్రస్తుతం ‘దిల్‌ రుబా’ అనే మూవీ తో 1970 నాటి కాలం లో సాగే ఒక పీరియాడిక్ సినిమా చేస్తున్నట్లు ఆయన చెప్పారు

తెలుగు నటుడు కిరణ్‌ అబ్బవరం త్వరలో ఓ ఇంటివాడు అవుతున్నాడు. తన ఫస్ట్ మూవీ హీరోయిన్‌ అయిన రహస్య గోరక్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు అందుతున్నాయి. వీరిద్దరూ ఐదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారని సమాచారం.

ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వారి అంగీకారంతోనే మార్చి 13న నిశ్చితార్థం జరగనున్నదని హీరో తరపున కుటుంబ సబ్యులు ద్వార తెలిసింది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ రిసార్ట్స్‌లో అతి తక్కువ మంది బంధువులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానం అందిస్తున్నామని వారు చెప్పారు. వీరి వివాహం ఆగస్టులో జరిగే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తోంది.

Leave a Comment