Hero Venu Thottempudi Father Demise : హీరో వేణు తొట్టెంపూడి ఇంట తీవ్ర విషాదం

website 6tvnews template 2024 01 29T121028.966 Hero Venu Thottempudi Father Demise : హీరో వేణు తొట్టెంపూడి ఇంట తీవ్ర విషాదం

Hero Venu Thottempudi Father Demise : సినీ నటుడు వేణు తొట్టెంపూడి(Hero Venu Thottempudi) ఇంట తీరని విషాదం నెలకొంది. అయన తండ్రి ప్రొఫెస్సర్ వెంకటసుబ్బారావు తొట్టెంపూడి(Venkata Subbarao Thottempudi) జనవరి 29వ తేదీ తెల్లవారు ఝామున తుదిశ్వాస విడిచారు.

అయితే వెంకటసుబ్బారావు వయసు 92 సంవత్సరాలు, ఇటీవలి కలం నుండి అయన వృధాప్య సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక వేణు తండ్రి మృతి చెందిన విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, వేణు సన్నిహితులు స్నేహితులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

(Hero Venu Thottempudi Father Demise) వెంకట సుబ్బారావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇక వెంకటసుబ్బారావు భౌతికకాయాన్ని సందర్శనార్ధం జనవరి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ కాలనీలోని స్టీల్ అండ్ మైన్స్ కాంప్లెక్స్ వద్ద సందర్శనార్ధం ఉంచనున్నారు. వెంకటసుబ్బారావు అంత్యక్రియలను జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో నిర్వహిస్తారని తెలుస్తోంది.

Venu Hero Venu Thottempudi Father Demise : హీరో వేణు తొట్టెంపూడి ఇంట తీవ్ర విషాదం

ఇక వేణు విషయానికే వస్తే అయన స్వయంవరం(Swayamvaram) సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. చిరునవ్వుతో(Chirunavvutho), హనుమాన్ జంక్షన్(Hanuman Junction), కల్యాణ రాముడు(Kalyana Ramudu), పెళ్ళాం ఊరెళితే(Pellam Oorelithe), ఖుషి ఖుషీగా(Khushi Khushiga), శ్రీ కృష్ణ 2006, యమగోల మళ్ళి మొదలైంది వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

2013 వచ్చిన రామాచారి తరువాత చాలా గ్యాప్ తీసుకున్న వేణు తొట్టెంపూడి 2022 లో రామారావు ఆన్ డ్యూటీ(Rama Rao On Duty) తో మరి సారి వెండి తెరపై మెరిశారు.

2023 లో అతిధి(Atidhi) అనే వెబ్ సీరీస్ చేసి డిజిటల్ మీడియాలోకి కూడా అడుగు పెట్టేశారు. తన మనసుకు నచ్చిన కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలను చేస్తూ వెళుతున్నారు వేణు.

Leave a Comment