Hero Vijay’s political entry: రాజకీయ ఆరంగేట్రం పై తమిళ హీరో ఇళయదళపతి విజయ్(Vijay) పెదవి విప్పాడు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పడమే కాక తన పార్టీ పేరునుకూడా ప్రకటించేశాడు. అతని పీఈటీ పేరు తమిళగ వెట్రి కళగం(Tamilaga Vetri kalagam). అయితే విజయ్ 2024 లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో(LOk Sabha Elections) తమ పార్టీ పోటీకి నిబడటం లేదని అన్నాడు.
అలా అని మారె ఇతర పార్టీకి కూడా మద్దతును ప్రకటించబోదని అన్నారు. ఇక విజయ్ మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందని దుయ్యబట్టారు.
ఇక తమిళనాడులో సినిమా నేపధ్యం నుండి వచ్చి కొత్త పార్టీ పెట్టిన వారి జాబితా చుస్తే పెద్దగానే ఉంటుంది, ఎంజీఆర్(MGR) అన్నా డీఎంకే(DMK) పార్టీ పెట్టగా, విజయ్ కాంత్(Vijay Kanth) దేశీయ మురుపోక్కు ద్రవిడ కళగం అనే పార్టీ పెట్టారు, ఆతరువాత కమల్ హాసన్(kamal Hassan) మక్కల్ నీది మయ్యం అనే పార్టీ పెట్టగా, రజని కాంత్(Rajani Kanth) మక్కల్ సేవై కట్చి అనే పార్టీ పెట్టారు. తాజాగా ఇప్పుడు విజయ్ తమిళగ వెట్రి కళగం(TVK) పేరుతో కొత్త పార్టీ పెట్టారు.
పార్టీ పెట్టి సక్సస్ అయినా వారు ఎవరంటే ? Hero’s Who Succeeded In Politics By Own Political party
అయితే రాజకీయ పార్టీ పెట్టగానే సరికాదు, ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి దానిని సమర్ధవతముగా కొనసాగించి అధికారంలోకి రావడం అనేది చాలా కష్టంతో కూడిన పని, అదునులో విజయం సాధించిన వారు చాలా తక్కువ మండే ఉన్నారని చెప్పాలి. అలా సీఎం అయిన వారిలో తమిళనాడులో ఎంజీఆర్(MGR), తెలుగు నాట ఎన్టీఆర్(NTR) పేర్లు వినిపిస్తాయి.
జయలలిత(Jayalalitha) కరుణానిధి(Karuna Nidhi) ఇద్దరు కూడా సినీ నేపధ్యం ఉన్న వారే అయినప్పటికీ వారు సొంతగా పార్టీ పెట్టలేదు. కరుణానిధి డీఎంకే పార్టీలో చేరి సీఎం అవ్వగా, జయలలిత అన్నా డీఎంకే నుండి సీఎం గా అయ్యారు. ఇక పార్టీ పెట్టి వేరే రాజకీయ పార్టీల్లో విలీనం చేసిన వారు, అసలు పార్టీ పేరు పెట్టిన కొన్నాళ్లకే రాజకీయాలనుండి వైదొలగినవారు కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు.
ప్రస్తుతం విజయ్ ఏం చేస్తున్నదంటే : What Vijay Is Doing Now
ప్రస్తుతం విజయ్ పూర్తి స్థాయిలో సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. 2026 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని పొలిటికల్ కెరియర్ ను ప్లాం చేసుకుంటున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలు, అలాగే ఒప్పుకుని డేట్స్ ఇచ్చిన సినిమాలను కంప్లీట్ చేసి ఫుల్ టైం పాలిటిక్స్ లోకి ఎంట్రీ అవుతారట.
ఇప్పటివరకు 68 సినిమాల్లో నటించిన విజయ్ ఇక మీదట పాలిటిక్స్ లోకి వెళితే కంప్లీట్ గా సినిమాలను పక్కన పెట్టేస్తారా ? లేదంటే అప్పటి ఎన్టీఆర్(NTR), ఇప్పటి పవన్ కళ్యాణ్(Pavan Kalyan) మాదిరిగా రెండు రంగాలను సమానంగా మానేజ్ చేస్తారా అన్నది వేచి చూడాలి. ఇక విజయ్ పాలిటిక్స్ లోకి వస్తారని దాదాపు దశాబ్ద కాలం నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక విజయ్ కూడా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు.