నాచురల్ స్టార్ నాని, తెలుగు ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటులలో నాని ప్రధమ శ్రేణి లో ఉన్నారు. సినిమా సినిమా కి డిఫరెన్స్ చూపెడుతూ, కొత్త కొత్త కధలను తెరపై చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
కేవలం కొత్త కధలను చూపెట్టడమే కాదు, కొత్త దర్శకులను ఇండస్ట్రీకి తన సినిమాతో పరిచయం చేస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్న హీరోల్లో నాని, రవితేజ పేర్లు బాగా వినిపిస్తాయి. ఇక నాని నటించిన తాజా చిత్రం హాయ్ నాన్న విడుదలైంది. ఈ సినిమా ను కూడా సౌర్యువ్ అనే కొత్త దర్శకుడే రూపొందించాడు.
నాని నటించిన గత చిత్రం పూర్తి గా మాస్ యాక్షన్ సినిమా అయితే ఇది కంప్లీట్ గా తండ్రి కూతుళ్ళ మధ్య బంధానికి సంబంధించి తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమాలో మృణాల్ నాని కి జోడి గా నటించింది, అదే విధంగా స్రుతి హాసన్ ఒక ముఖ్య భూమిక పోషించినట్టు సమాచారం.
ఈ సినిమాకి హషీమ్ అబ్దుల్ వాహబ్ స్నాగీతాన్ని సమకూర్చగా, సాను వర్గీస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్ బేబీ, విరాజ్ అశ్విన్, శ్రుతిహాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చెరుకూరి మోహన్, తీగల విజేందర్ రెడ్డి, కె.ఎస్ మూర్తి సంయుక్తంగా నిర్మించారు. మరి ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
ఈ సినిమా హిట్టా ఫట్టా అని తెలుసుకునే ముందు ఈ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. ఇందులో నాని క్యారెక్టర్ పేరు విరాజ్ . ముంబై లో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా పని చేస్తుంటాడు. అతనికి మహి అనే కూతురు ఉంటుంది. ఆ ఆ పాపకి పుట్టనప్పుడే ఒక జబ్బు కూడా ఉంటుంది.
తల్లి లేని బిడ్డ అవడం, పైగా అనారోగ్య సమస్య కూడా ఉండటంతో నాని తన కూతురిని గాజు బొమ్మ లా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. తనని నిద్ర పుచ్చడం కోసం ప్రతి రోజు కధలు చెబుతూ ఉంటాడు. కానీ ఒక రోజు మహి అమ్మ కదా చెప్పమని అడుగుతుంది.
ఆ కథను దాటవేయడానికి క్లాస్ ఫస్ట్ తెచ్చుకోమని అంటదు నాని, అయితే మహి పట్టుదలతో క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటుంది. కానీ నాని కథ చెప్పడు, దాంతో అలిగిన మహి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది, ఈ క్రమం లో మహిని యాష్న రోడ్డు ప్రమాదం నుండి కాపాడుతుంది. మృణాల్ ఠాకూర్ యాష్న పాత్రలో కనిపిస్తుంది మనకి. కూతురుని వెదుకుతూ వచ్చిన నానికి మహి యాష్న ఇద్దరు ఓ కాఫీ షాప్ లో కనిపిస్తారు. దీంతో నాని అదే కాఫీ షాప్ లో కదా చెప్పక తప్పదు.
నాని ఎప్పుడు తన కూతురుకి కదా చెప్పినా ఆ కధలో మెయిన్ రోల్ లో నానిని ఊహించుకుంటుంది. అయితే ఈ కధలో తన తల్లి క్యారెక్టర్ ను యాష్న లో చూసుకుంటుంది మహి. ఆ పాత్ర పేరు వర్ష. అయితే సినిమా లో అసలు వర్ష ఎవరు, వర్షకి యాష్న కి సంబంధం ఉందా, వర్ష మహి కి ఎందుకు దూరంగా ఉంటోంది. యాష్న నాని ప్రేమలో ఎలా పడింది. నాని యాష్న ను పెళ్లి చేసుకుంటాడా ? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
తండ్రి కూతుళ్లు మధ్య బాదం తో అల్లిన కదలు, అమ్మానాన్నల ప్రేమ కథతో అల్లిన కధలు ఇప్పటికే అనేకం చూసాం మనం తెలుగులో, కానీ ఈ సినిమాలోని సన్నివేశాలు ఇప్పటివరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉంటాయి. సినిమాలో అసలు కథ మొదలైనప్పటి నుండి ప్రేక్షకుడి ఊహకి అందని విధంగా ఉంటాయి సినిమాలోని మలుపులు. సహజంగానే నాని సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని చాలా చక్కగా పండించగలడు అనే పేరుంది, దానిని ఈ సినిమాలో కూడా నిలబెట్టుకున్నాడు.
ఈ సినిమా లోని ఒకే కథలో రెండు లవ్ స్టోరీస్ ఉంటాయి. ఒకటి విరాజ్అండ్ వర్ష ది, రెండు విరాజ్ అండ్ యాష్న ది. అయితే ఫస్ట్ ఆఫ్ లోని కథ మాత్రం ప్రేక్షకులు ఊహించినట్టుగానే ఉంటుంది, అన్ని సినిమాల్లో మాదిరిగానే హీరోయిన్ హీరో ప్రేమలో పడఁజూతుంది, ఒక హీరోయిన్ హీరో తో విడిపోతుంది. కానీ సెకండ్ ఆఫ్ లో మాత్రం దర్శకుడి మ్యాజిక్ కనిపిస్తుంది.
సినిమా చూసే ఆడియన్స్ స్టోరీ లో రాబోయే సీన్ ఎలా ఉంటుందో ఊహించలేరు, అలా దర్శకుడు గ్రిప్ సంపాదించాడు అని చెప్పొచ్చు. ఇక సినిమా చివరిలో జయరాం పాత్ర రావడం, యాష్న తన ప్రేమను విభిన్న రీతిలో వ్యక్త పరచడం, తండ్రి కూతుళ్ళ మధ్య పాండే భావోద్వేగాలు, సినిమాకి అదనపు బలంగా చెప్పొచ్చు.
ప్రేక్షకుల ఊహకి అందని కథేమీ కాదు, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు నిదానంగానే ఉంటాయి. అయినప్పటికీ తండ్రి కూతుళ్ళ కథ కావడం, పైగా ప్రేమ కథ కావడంతో ఇది ఎక్కడ బోర్ అనిపించదు, పైగా ఈ సినిమాకి ఫామిలీ ఆడియన్స్ క్యూ కట్టే ఛాన్స్ ఎక్కువే కాబట్టి నిర్మాతలకు పెట్టిన పెట్టుబడితో పాటు లాభాల పంట పండిస్తోంది హాయ్ నాన్న సినిమా.
ఈ సినిమాలో ప్రధాన బలం హీరో హీరోయిన్ల నటన, పైగా చైల్డ్ ఆర్టిస్ట్ అయినా కియారా కూడా తన నటనతో బాగా ఆకట్టుకుంది. అయితే ఇలాంటి సినిమాల్లో సన్నివేశాలను తారా స్థాయికి తీసుకెళ్లి పండించేది సంగీతం, హషీమ్ అబ్దుల్ వాహబ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మంచి బలాన్ని ఇచ్చింది సినిమాకి. ఇక బలహీనతలు ఏమైనా ఉంటె అది చిన్నదే అని చెప్పాలి, ఈ సినిమాలో అక్కడక్కడా నిదానంగా సాగె సన్నివేశాలు తారసపడతాయి. కథ కూడా ఊహించిన విధంగానే ఉంటుంది.