డిల్లీ లో అల్లర్లు జరిగే అవకాశం 20 వేల మంది రైతులు వస్తారని అంచనా

website 6tvnews template 57 డిల్లీ లో అల్లర్లు జరిగే అవకాశం 20 వేల మంది రైతులు వస్తారని అంచనా

High Alert in Delhi – 20 thousand Formers Chalo Delhi : రైతులు తాము పండించిన పంటకు కనీస మద్దతు ధర మీద మరింత స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా స్వామినాధన్ కమిటి సూచించిన సిఫార్సులను అలాగే పంటల మీద రుణాలను అమలు చేసి రైతు కూలీలకు పెన్షన్ వచ్చే విధం గ చట్టం తీసుకురావాలని దీనికోసం పోరాడుతున్న రైతుల విషయం లో కేంద్రం ఎటువంటి ప్రకటన చెయ్యకపోవడంతో రైతులు అందారు కలిసి చలో డిల్లీ తో నిరసన చేపట్టాలని నిర్ణయించారు.

ఈ నిరసన కార్యక్రమాలలో రైతులు ఆందోళనలు మరింత తీవ్రం గా ఉండవచ్చని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ రావడం తో పోలీసులు భద్రతను మరింత పెంచారు. కేంద్ర మంత్రులు తో జరిగిన చర్చలు విఫలం అవ్వడం వల్ల ఈ ఆందోళన చేపడుతున్నట్లు రైతులు చెప్తున్నారు. ఏది ఏమైనా పండించిన పంటలకు కనీస మద్దతు ధర పై స్పష్టమైన భరోసా కల్గించాలి డిమాండ్ చేస్తున్నారు.

అంతే కాకుండా కేంద్ర చట్టాలకు వ్యతిరేకం గ ఆందోళన చేపట్టిన రైతుల మీద ఉన్న కేసులు కూడా తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి కేంద్రం కూడా అంగీకరించింది, ఆందోళన చేస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు తగిన నష్ట పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

డిల్లీలో పోలీసులు రైతుల ఆందోళన కారణం గా రహదారుల దగ్గర పోలీస్ పికెటింగ్ వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్భందులు ఎదుర్కుంటున్నారు. అయితే రహదారులు అన్ని మూసివేయలేదని అక్కడక్కడ మాత్రం ఫెన్సింగ్ ఏర్పాటు తనిఖీల అంతరం వారిని అనుమతి ఇస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.

Leave a Comment