High Court Break For Vyuham Movie: వ్యూహం సినిమాకి ఓటిటీ లో బ్రేక్ హై కోర్ట్ తీర్పు.

High Court Break For Vyuham Movie: High Court Break in OT for Tathagata movie.

High Court Break For Vyuham Movie: వ్యూహం సినిమాకి ఓటిటీ లో బ్రేక్.

దర్శకుడు రాంగోపాల్‌వర్మ(Ram Gopal Varma)..ఇది పరిచయం అఖర్లేని పేరు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేలా అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయ వాక్యాలు కూడా అవసరం లేదు.

అయన చేసిన సినిమాల కన్నా అయన చేసే వ్యాఖ్యలతోనే ఎక్కువ ఫెమస్ అవుతూ ఉంటాడు. ఈ మధ్య అయన తెరకెక్కించిన “వ్యూహం” (Vyuham)మూవీకి కోర్టు ఒక చిన్న షాక్‌ ఇచ్చింది .

ఓటీటీతో(OTT) పాటు ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫామ్‌లలో(ONline Plot Forms) ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని చెప్పింది అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇది ఇలా ఉంటె ఈ సినిమా విడుదలకు ముందు ఒక వేడుకను కూడా నిర్వహించాలని నిశ్చయించారు.

అందుకు విజయవాడను9Vijayawada) వేదికగా ఎందుకుంది చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు(MLA) కూడా హాజరవుతారని ఆర్జీవీ(RGV) చెప్పుకొచ్చారు. దర్శకుడు రాము రూపొందించిన వ్యూహం చిత్రం ఏపీ రాజకీయాల్లో(AP Politics) ప్రకంపనలు రేపుతోంది.

ఈ సినిమా విడుదల కాకుండానే విపరీతంగా వివాదాలు రేగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan MohanReddy) తన పొలిటికల్ లైఫ్ లో ఎదుర్కొన్న సవాళ్ళను,

వాస్తవ ఘటనల ఆధారంగా చేసుకుని రాము ఈ సినిమా మలచారు. దీనిని డిసెంబర్ 29న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్రణాళిక రచించుకుంది మోవి యూనిట్. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది.

తెలుగుదేశం పార్టీ(TDP) ఈ సినిమా విషయంలో కోర్ట్ మెట్లెక్కింది. సెన్సార్‌ బోర్డు(Censor Board) ఈ సినిమాకి ఇచ్చిన సర్టిఫికెట్‌ను(Certificate) రద్దు చేయాలని కేసు వేశారు ఆపార్టీ ముఖ్య నేతలు.

ఆ పిటిషన్ ను హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టు(Hyderabad City Civil Court) విచారణకు స్వీకరించింది. దీంతో ‘వ్యూహం’(Vyuham) సినిమా విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమం లోనే హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టు(Hyderabad City Civil Court) చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తోపాటు,

సినిమాను నిర్మించిన సంస్థ రామదూత క్రియోషన్స్‌ కు(Ramadhoota Creations) కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ సినిమా గురించిన విశేషాలను చెబుతూ రాజకీయ నేతలు నిత్యం చేసుకునే ఆరోపణలని ఇందులో ప్రస్తావించానని అన్నారు.

వ్యూహం(Vyuham ) సినిమా రాజకీయ కోణం లోనే ఉంటుందని, రాజకీయాల చుట్టూ తిరుగుతుందని పేర్కొన్నారు.

వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar areddy)మరణించిన నాటి నుండి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS jagan Mohan Reddy) పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారి పార్టీ స్థాపించడం,

ఆతరువాత పాద యాత్ర చేయడం(Road Show), ముఖ్యమంత్రి(Chief Minister) అవ్వడం వరకు అన్ని ఉంటాయని చెప్పారు. ఇక ఇదే సమయంలో టీడీపీ(TDP) నేతలు ఆర్జీవీ(RGV) పైన, వ్యూహం(Vyuham) సినిమా పైనా భగ్గుమంటున్నారు.

ఈ ఈసినిమాలో తమ అధినేత చంద్రబాబును (Chandrababu), తెలుగుదేశం పార్టీని(Telugu Desham party) కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటె వ్యూహం సినిమాను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ (Dasari Kiran Kumar) నిర్మించారు.

రామ్ గోపాల్ (Ram Gopal Varma)వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో రంగం(Rangam) ఫేమ్ అజ్మల్(Azmal) జగన్(YS Jagan) పాత్రలో కనిపించగా, జగన్ సతీమణి భారతి(Bharati) పాత్రలో మానస రామకృష్ణ(Manasa Ramakrishna) ఒదిగిపోయారు.

Leave a Comment