2023 Historical Events in India: 2023 లో చారిత్రక సంఘటనలు ఇవె.

Add a heading 2023 12 28T110531.126 2023 Historical Events in India: 2023 లో చారిత్రక సంఘటనలు ఇవె.

2023 Historical Events in India: 2023 లో చారిత్రక సంఘటనలు ఇవె.

ప్రతి సంవత్సరం ముగిసేసరికి మనదేశంలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటాయి, కానీ వాటిలో మరచిపోలేనివి, ప్రజల మనసులో ముద్ర వేసుకున్నవి కొన్నే ఉంటాయి.

అటువంటి వాటి గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా 2023 సంవత్సరం పూర్తయ్యే సమయంలో భారత దేశం సాధించిన ఘనతలు ఏమిటి అనేది ఒక్కసారి చర్చించుకుందాం.

01 చంద్రయాన్ : (Chandrayan – 3) :

చంద్రయాన్ -3 అనేది 2023 సంవత్సరంలో భారతదేశం సాధించిన ఒక అతిపెద్ద ఘనత గా చెప్పుకోవచ్చు. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టింది ఈ చంద్ర యాత్రను.

ఇందులో ఒక రోవర్, అలాగే ఒక లాండర్ ఉంటాయి. ఈ ప్రయోగానికి నెల్లూరు సమీపంలో ఉన్న శ్రీహరి కోట లోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(Satish Dhawan Space Center) వేదిక అయింది.

ఇది ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో ఇది చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో సేఫ్ గా సాఫ్ట్ ల్యాండ్ అయింది.

ఇది ల్యాండ్ అయిన ప్లేస్ కి శివశక్తి అని పేరు పెట్టారు. ఈ ప్రయోగం సక్సస్ కావడంతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరిని అభినందించారు.

ఇక ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీని భారతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు.

చంద్రయాన్ 3 విజయం పై యావత్ భారత దేశం హర్షం వ్యక్తం చేసింది. మన దేశ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతం అవడంతో ప్రజలు హర్షాతిరేఖాలు వ్యక్తం చేశారు.

02 జీ 20 సమ్మిట్ (G 20 Summit):

Add a heading 2023 12 28T111103.983 2023 Historical Events in India: 2023 లో చారిత్రక సంఘటనలు ఇవె.

ఇది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, దీనిని కేంద్ర ప్రభుత్వం(Central Government) చాలా ప్రస్టీజియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఈ జీ 20 సమ్మిట్ లో పాల్గొనేందుకు ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 20 దేశాల అధినేతలు మన దేశానికి వస్తారు.

కాబట్టి దీనిని అత్యంత వైభవంగా నిర్వహించాలని నిశ్చయించుకుంది, అనుకున్న దానికన్నా గ్రాండ్ గానే నిర్వహించింది. ఈ జీ 20 సమ్మిట్ లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకి సంబంధించిన ప్రణాళికపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు,

ఆ అభిప్రాయాలపై చర్చలు జరిపిన అనంతరం కొన్ని కీలక నిర్ణయాలు అక్కడ చేయబడతాయి. ఈ సదస్సు ప్రతి యేడాది ఎదో ఒక దేశంలో జరుగుతుంది. గత ఏడాది ఇండోనేసియా(Indonesia) లో జరగ్గా, 2023 లో దీనిని నిర్వహించే బాధ్యత భారత్(India) కి దక్కింది.

ఈ జి 20 సమ్మిట్ ను నిర్వహించడం పైనే భారత్ సమర్ధత ఆధారపడి ఉంటుంది, కాబట్టే దీనిని నిర్వహణపై కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు అందరు శ్రద్ధ వహించారు.

మన దేశ రాజధాని ఢిల్లీ(Delhi) ఇందుకు వేదిక అయింది అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ జి-సమ్మిట్ అనంతరం సమ్మిట్ కి హాజరైన దేశాధినేతలంతా కలిసి ఫోటో దిగారు. దానిని ఫ్యామిలీ ఫోటోగా అభివర్ణిస్తారు.

03 అత్యధిక జనాభా (Heavy Population):

అధిక జనాభా అనేది ఒక రకంగా సమస్య తో కూడుకున్న అంశమే, కానీ మరో రకంగా చూసుకుంటే యువత ఎక్కువగా కలిగిన దేశంగా కూడా చెప్పుకోవచ్చు. యువ రక్తం ఎక్కువగా ఉంటె మాన్ పవర్ కి కొదువ ఉండదు అంటారు. పైగా భారత్ నుండి ఎంతో మంది విదేశాలకు వెళ్లి వివిధ రకాల పనులు చేసుకుంటున్నారు.

కాబట్టి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నినాదాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచాలంటే ఖచ్చితంగా ఆ స్థాయిలో పని చేసేవారు కూడా ఉండాలి. కాబట్టి ఒక రకంగా ఇది మేలే చేస్తుంది.

ఉదాహరణకు చైనా ను తీసుకుంటే ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జనాభా సంఖ్య లో చైనా నెంబర్ వన్ గా ఉండేది. కానీ ఇప్పుడు అత్యధికంగా వస్తులువు ఉత్పత్తి చేస్తున్న చైనా అన్ని దేశాలకు ఎగుమతులు చేస్తూ మంచి వృద్ధిని సాధించింది.

దానికి కారణం చైనా లో పని చేయడానికి సిద్ధంగా ఉండేవారు ఎక్కువగా ఉండటమే. ఇక భారత్ విషయానికి వస్తే ప్రస్తుతం 142.86 కోట్ల మంది జనాభాతో తొలి స్థానం లో నిలిచింది. అది 2023 లో సంభవించింది.

అంతే కాదు ఇప్పటివరకు భారతదేశం అధిక జనాభా విషయంలో వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కావడం ఇదే తొలిసారి. అందుకే 2023 లో ఈ సంఘటన మరపురాని ఘటనగా నిలిచిపోతుంది.

ఏది ఏమైనా అధిక జనాభా అని మంచి పరిణామం కాదని, అధిక జనాభా ను నియంత్రించాల్సిన అవస్సరం కూడా ఉందని కొందరు ఆర్ధిక నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

04 కొత్త పార్లమెంట్ భవనం (New Parliament Building) :

Add a heading 2023 12 28T110841.740 2023 Historical Events in India: 2023 లో చారిత్రక సంఘటనలు ఇవె.

భారత దేశం లో 2023 సంవత్సరంలో చోటుచేసుకున్న కొన్ని గుర్తుండిపోయే విషయాలలో మే 23 వ తేదీన జరిగిన సంఘటన ఒకటి. అదే భారతదేశ కొత్త పార్లమెంట్ భవనం ఓపెనింగ్(New Parliament Building Opening). 2020 వ సంవత్సరంలో ప్రారంభమైన దీని నిర్మాణం 2023 కి పూర్తయింది.

మే నెలలో ఈ భవనాన్ని శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొని పార్లమెంట్ భవనాన్ని తానే స్వయంగా ఓపెన్ చేశారు. పాత భవనం చుస్తే అది 1927 వ సంవత్సరం లో నిర్మించబడింది.

ఇప్పటికి అది వాడుకోవడానికి యోగ్యంగానే ఉన్నప్పటికీ, ఇప్పుడున్న అవసరాలకు అనుకూలంగా మరింత శక్తివంతంగా కొత్త భవనాన్ని నిర్మించారు.

కొత్త భవనాన్ని పాత పార్లమెంట్ భవనం లోని స్థలం లోనే నిర్మించారు. కొత్త భవనం లోక్ సభలో(Lok Sabha) 888 సీట్ల సామర్ధ్యం ఉంది. 384 సీట్లతో రాజ్యసభ హాల్(Rajya Sabha Hall) కూడా ఉంది.

అంతే కాదు లోక్ సభ హాలులో 1272 మంది కూర్చునే విధంగా సీట్లు అమర్చారు. పైగా ఇది పర్యావరణ సురక్షిత భవనంగా చెబుతున్నారు. అంతేకాదు ఇందులో అనేకమైన విశిష్టతలు ఉన్నాయి.

ఏది ఏమైనా ఈ భవన ప్రారంభోత్సవం చేయడం ఉపయోగంలోకి తీసుకురావడం అనేది మరువలేనిది, చరిత్రలో లిఖించబడేది. కాబట్టి 2023 వ సంవత్సరంలో ఇది మరపురాని సంఘటనగా మిగిలిపోతుంది.

సిల్క్యరా టన్నెల్ (Silkyara Tunnel) : ఒకరు కారు ఇద్దరు కాదు ఏకంగా 41 మంది కార్మికులు సజీవంగా ఒక టన్నెల్ లో ఇరుక్కుపోయారు. అదే సిల్క్యరా టన్నెల్ (Silkayara Tunnel) వారు బయటకు వచ్చే మార్గం పూర్తిగా మూసుకుపోయింది.

వారిని రక్షించడం భారత ప్రభుత్వం ముందున్న లక్ష్యం. అందులో గనుక విఫలమైతే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయి, సఫలమైతే గనుక అది నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది.

అందుకే సిల్క్యరా టన్నెల్ ఉదంతాన్ని కేంద్ర సర్కారు(Central Government) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టన్నెల్ లో ఉండిపోయిన వారిని వెలికి తెచ్చేందుకు అస్త్ర శాస్త్రాలు అన్ని ఉపయోగించింది.

మొదట్లో వారికి కనీసం త్రాగునీరు, ఆహారం(Water & Food) పంపించడానికి ఆపసోపాలు పడిన అధికారులు ఆ విషయంలో విజయం సాధించారు. ఎప్పుడైతే వారిని అన్నపానీయాల సదుపాయం కల్పించారో అప్పుడే సగం విజయం సాధించారు.

ఈ వ్యవహారం పై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులతో పనులు చేయించారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు అత్యాధునిక సౌకర్యాలు ఉన్న యంత్రాలను వివిధ ప్రాంతాల నుండి తెప్పించారు.

చివరికి అధికారుల కఠోర శ్రమ ఫలించింది. పూడుకుపోయిన టన్నెల్ నుండి బాధితులను బయటకు సజీవంగా సురక్షితంగా తీసుకొచ్చారు. వారు బయటకు వచ్చిన వెంటనే చికిత్స నిమిత్తం వారిని ప్రత్యేక అంబులెన్సులలో ఆసుపత్రికి తరలించారు.

వారు రక్షింపబడ్డారు అని తెలిసిన క్షణం వారి కుటుంబాల్లో పండుగవాతావరణం వెల్లివిరిసింది. కేవలం వారి కుటుంబసభ్యులు, బంధువులు మాత్రమే కాదు ఈ ఘటన దేశంలోని అనేక మందిని ఆశ్చర్యానికి ఆనందానికి గురిచేసింది.

ఇంతటి పెద్ద ప్రమాదం నుండి 41 మందిని రక్షించడం అనేది చాలా పెద్ద విషయం, కాబట్టి ఇది 2023 సంవత్సరం లో మరపురాని ఘటనగా నిలిచిపోతుంది.

Leave a Comment