హైదరాబాద్ లో నీళ్ళకి భలే గిరాకి HMWS బోర్డు – రోజుకి 50 లక్షలు ఆదాయం !

website 6tvnews template 2024 04 04T123115.382 హైదరాబాద్ లో నీళ్ళకి భలే గిరాకి HMWS బోర్డు - రోజుకి 50 లక్షలు ఆదాయం !

హైదరాబాద్ లో నీటి అవసరాలు రోజు రోజు కి పెరిగి పోతున్నాయి. అసలే ఎండాకాలం దానికి తోడు తెలంగాణా లోఉన్న అన్ని రిజర్వాయర్ లో నీళ్ళు లేకపోవడం ఇంటింటికి నీళ్ళు అందించడం చాల కష్టం అవుతోంది. ఉన్న నేతిని పొడుపు గా వాడమని వాటర్ బోర్డు అధికారులు హెచ్చరిస్తున్న ఇంకా కొన్ని చోట్ల నీరు వృధాగా పోవడం జరుగుతోంది.

అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న ఇంకా అక్కడక్కడ నీరు వృదా ఆపలేకపోతున్నారు. కాని నీళ్ళ విషయం లో ఎవరికీ ఇబ్బంది కలగాకుడదని వాటర్ బోర్డ్ తగిన ఏర్పాట్లు చేసారు. ప్రతీ రోజు నీటి అవసారాల కోసం వాటర్ బోర్డు అధికారులు టాంకర్ ల ద్వార నీటిని సరఫరా చేస్తున్నారు. దీనికోసం రోజుకు 10 వేలు టాంకర్ లు నీటి సరఫరా కోసం ఉపయోగిస్తున్నారు. అయితే అధికారులు ఈ నీటి టాంకర్ లకు ఓక ధరని నిర్నయుస్తూ ఒక ప్రకటన విడుదల చేసారు.

గృహ అవసరాల కోసం అయితే ఒక టాంకర్ కు 500 రూపాయలగాను, అదే వ్యాపార అవసరాల కోసం వినియోగించే నీళ్ళకు ఒక టాంకర్ కు 850 రూపాయల గా నిర్ణయించారు. అయితే గత ప్రభుత్వం ప్రతీ ఇంటింకి నీళ్ళను ఉచితం గా సరఫరా చేసిందని అలాగే టాంకర్ ల ద్వార గృహ అవసరాలకు నీళ్ళను అందించాలని నగర ప్రజలు వాటర్ బోర్డు అధికారులను కోరుతున్నారు.

అయితే కొన్ని చోట్ల అపార్ట్ మెంట్ వాసులు వారికి వారే నీళ్ళను వృధా అరికట్టడం కోసం నీళ్ళను ఎక్కవగా వాడే వారికి ఫైన్ వేసే విధానం అమలుచేస్తున్నారు. ఇలా చెయ్యడం ద్వార నీరు వృధా అరికట్టవచ్చని అలాగే నీళ్ళను పొదుపు గా వాడడానికి అవకాశం ఉంటుందని అపార్ట్ మెంట్ సెక్రటరీలు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment