Hollywood chance for Shruti Haasan : సలార్ భామకు హాలీవుడ్ ఛాన్స్.ఆ సినిమా నుంచి సమంత అవుట్.

website 6tvnews template 97 Hollywood chance for Shruti Haasan : సలార్ భామకు హాలీవుడ్ ఛాన్స్.ఆ సినిమా నుంచి సమంత అవుట్.

సమంత శృతిహాసన్ ఇద్దరూ తెలుగులో ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్లు. ఇప్పటికీ వీరిద్దరికీ ఇండస్ట్రీలో , సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

అంతే కాదు వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ అభిమానులను రకరకాల ఫోటో షూట్లతో మూవీ అప్‎డేట్స్‎తో ఎప్పుడూ అలరిస్తుంటారు.

ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు వస్తుండటంతో వీరికి అవకాశాలు కూడా కాస్త తగ్గాయనే చెప్పాలి. ఇదిలా ఉంటే సమంత గత కొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది.

ఆరోగ్యం బాగోలేకపోయినా అంతకు ముందు సైన్ చేసిన యశోద , శకుంతలం ,ఖుషి సినిమాలను పూర్తి చేసింది. ఇక గత సంవత్సరకాలంగా షూటింగ్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటోంది.

ఇప్పటి వరకు సమంతకు సంబంధించిన లేటెస్టు మూవీ అప్ డేట్స్ అయితే ఏమీ లేవు. గతంలో ఒప్పుకున్న సీటాడెల్ మినహా అమ్మడు ఎందులో నటిస్తున్నట్లు న్యూస్ రాలేదు.

కొత్త సినిమాల విషయం పక్కన పెడితే అప్పట్లో ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ లో సమంతకు నటించే ఛాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. బఫ్టా (BAFTA)అవార్డ్ విజేత డైరక్టర్ ఫిలిప్ (Phillip John) జాన్ డైరెక్షన్ లో ఈ సినిమా రానుంది.

అప్పట్లో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలిపి సామ్ తన ప్రేక్షకులను ఖుషీ చేసింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి సమంత తప్పుకుంది.

ఆ ప్లేస్ ని సలార్ (Salaar) బ్యూటీ శృతిహాసన్ రీప్లేస్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

myositis is the reason for leaving the film?: సినిమా నుంచి తప్పుకోవడానికి మయోసైటిస్ కారణమా?

samantha looks to ayurveda to cure autoimmune condition myositis Hollywood chance for Shruti Haasan : సలార్ భామకు హాలీవుడ్ ఛాన్స్.ఆ సినిమా నుంచి సమంత అవుట్.

కొన్ని నెలల క్రితం ఫిలిప్‌ జాన్‌ (Phillip John) డైరెక్షన్ లో రూపొందుతున్న అంతర్జాతీయ ప్రాజెక్టులో సామ్ నటిస్తున్నట్లు అనౌన్స్ మెంట్ వచ్చింది.

‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ (The Arragements Of Love)అనే టైటిల్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ మొదలు కాలేదు. అయితే లేటెస్టుగా ఈ మూవీలో శృతి హాసన్ (Shruti Haasan) నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అంతే కాదు ‘చెన్నై స్టోరీ’ (Chennai Story)అని సినిమా పేరు కూడా పెట్టారు.

నిజానికి ఈ సినిమాలో నటించేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపించింది. ఏకంగా ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ పుస్తకాన్ని కూడా చదివేసింది. దీంతో సినిమాలో యాక్ట్ చేసేందుకుద గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీతో తన క్రేజ్ హాలీవుడ్ (Hollywood)చేరుకుందని కలలు కంది సంత.

కానీ ఇంతలోనే ఆమె మయోసైటిస్ బారిన పడింది . ఈ వ్యాధి నంచి కోలుకోడానికి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఆ బ్రేకే ఈ ప్రాజెక్టు నుంచి తప్పించిందని టాక్ వినిపిస్తోంది. సమంత సైడ్ కావడంతో ఆ ప్లేస్ లో ఇప్పుడు శృతి చేరింది.

Shruthi got Hollywood offer : హాలీవుడ్ ఆఫర్ అందుకున్న శృతి

main qimg 2669a175c9b9d74806366f6c07d72312 lq Hollywood chance for Shruti Haasan : సలార్ భామకు హాలీవుడ్ ఛాన్స్.ఆ సినిమా నుంచి సమంత అవుట్.

గత కొంత కాలంగా శృతి కూడా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. శృతికి ఛాన్సులు రావడం లేదని, ఆమె పని అయిపోయిందని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ గతేడాది సంక్రాంతి నుంచి భామ మళ్లీ టాలీవుడ్ బరిలోకి దూకింది.

వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ చిత్రాల్లో నటించి ఐ యామ్ బ్యాక్ అని ప్రూవ్ చేసింది. చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) వంటి సీనియర్ స్టార్స్ తో జోడీ కట్టి స్క్రీన్ మీద దుమ్ముదులిపింది. లేటెస్టుగా ప్రశాంత్ నీల్ (Prashanth Neil) రూపొందించిన సరాల్ మూవీలో హీరోయిన్ గా నటించి తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకుంది.

త్వరలో సలార్ 2 (Salaar2)లో మెరవనుంది శృతి. ఇదిలా ఉండగా ప్రస్తుతం అడివి శేష్‌ (Adavi Shesh)తో కలిసి ‘డెకాయిట్’ (Decoit) అనే పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేస్తోంది ఈ భామ. ఇదే సమయంలో ఈ అమ్మడు లేటెస్టుగా ఈ హాలీవుడ్ ఆఫర్ వరించింది.

అయితే ఈ సినిమాలో సమంత నటించాల్సి ఉండగా ఇప్పుడు శృతి చెంతకు ఈ ఆఫర్ చేరడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా బాఫ్తా(BAFTA) అవార్డ్ విజేత ఫిలిప్ జాన్ (Phillip John) ‘చెన్నై స్టోరీ’ (Chennai Story)ని ఇంటర్నేషనల్ మూవీగా రూపొందించనున్నారు.

ప్రముఖ నవల ‘ది అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’(The Arragements Of Love) ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

Shruti Haasan as a private detective : ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో శృతిహాసన్

‘చెన్నై స్టోరీ’ ఒక క్రాస్-కల్చరల్ రోమ్-కామ్ అని సమాచారం. ఈ మూవీలో ‘ లిఫ్ట్’ (Lift)ఫేమ్ వివేక్ కల్రా ( Vivek Kalra)తో శృతి కలిసి నటించబోతోంది.

ఇందులో శృతిహాసన్ ప్రైవేట్ డిటెక్టివ్ క్యారెక్టర్ ను పోషించనుంది. బ్రిటన్ కు చెందిన కెవిన్ హార్ట్ (Kevin Hart), జాన్ రెనో (John Reno), శామ్ వర్తింగ్టన్ (Sam Worthington) లాంటి నటీనటులు ఈ మూవీలో నటించనున్నారు.

ప్రస్తుతం ‘చెన్నై స్టోరీ’ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో చెన్నై, కార్డఫ్ నగరాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Leave a Comment