Horoscope on December 4th: ఈ రోజు ఏయే రాశుల వారికి ధనలాభమో తెలుసా..

Horoscope on December 4th

Horoscopes on December 4th: డిసెంబర్ 4 న రాశిఫలాలు..ఈరోజు ఈ రాశి వారికి ధనయోగం ఉంది.

మేషరాశి:

మేషరాశి వారికి ఈరోజు అంత ఆశాజనకంగా లేదు. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా సాగుతాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

చేసే ఉద్యోగంలో శ్రమ ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. మాతృ సంభంధిత వ్యక్తులకు అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి

వృషభ రాశి:

ఈ రాశి వారికి ఈరోజు చాలా బాగుంది. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో విందు, వినోదాలలో పాల్గొంటారు.

రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు.

మిధున రాశి

మిధున రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. అయితే సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. ధనపరంగా కూడా కొన్నిరకాల ఇబ్బందులు ఎదురవుతాయి.

చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి అయినప్పటకీ అతికష్టం మీద వాటిని నెరవేరుస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

కర్కాటక రాశి:

ఈరోజు ఈ రాశి వారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చెప్పదగిన సూచన. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి..

సింహ రాశి:

సోదరుల నుంచి అనుకున్న సహాయం సమయానికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణం చేస్తారు. స్వల్ప అనారోగ్య కలుగుతుంది. నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు మరింత బాధిస్తాయి.

కన్య రాశి:

ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో పేరు ప్రతిష్టతలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలున్నవి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగ సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం.

తుల రాశి:

వీరికి ఈరోజు ఇంటా బయటా అనుకూల పరిస్థితులున్నాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలున్నాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చిక రాశి:

ఈరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు.

చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు రాశి:

Add a heading 2023 12 04T105328.435 1 Horoscope on December 4th: ఈ రోజు ఏయే రాశుల వారికి ధనలాభమో తెలుసా..

ఈ రాశి వారికి ఈ రోజు పనిచేసే చోట అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి.. స్థిరమైన ఆలోచనలు ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు తప్పవు.

దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

మకర రాశి:

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్తువాహనాలు కొంటారు. ఇంట్లో , బయటా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కుంభ రాశి:

కొత్త ఇంటిని కొనుక్కోవాలన్న మీ కల నెరవేరుతుంది. పనిచేసే చోట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పనుల్లో శారీరక శ్రమ తప్పదు. ముఖ్యమైన పనులను అతికష్టంతో పూర్తి చేస్తారు. అనుకోని ప్రయాణాలున్నాయి.

మీన రాశి:

పనిచేసే చోట మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అవి మీకు అనుకూలంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

ఆర్థికంగా బాగుంటుంది. ప్రేమవ్యవహారాలు లాభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలం. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది.

Leave a Comment