చైనా అంత సంపన్న, శక్తివంతమైన దేశంలా ఎలా మారింది అంటే.
ఒకప్పుడు అధిక జనాభా తో పేదరికంతో సతమతమైన చైనా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా ఎలా అవతరించింది అగ్రరాజ్యం ఆమెరోకానీ వెనక్కి నెట్టి ధనిక దేశం అనే పేరును ఎలా సంపాదించుకోగలిగింది. కేవలం పొరుగున ఉన్న భారత్ తోనే కాక ఏ దేశంతో నైనా కయ్యానికి కాలు దువ్వుతోంది అంటే డ్రాగన్ దేశాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు, అయితే ఆదేశం అంత శక్తివంతంగా ఎలా అవతరించింది. ఇలాంటి ప్రశ్నలు చాలామంది సామాన్యుల మదిలో మెదులుతున్నవే. ఒకప్పుడు చుస్తే భారత్ చైనా కన్నా జనాభా సంఖ్యలో తక్కువగానే ఉంది, చైనాకి ఎలాంటి వనరులు ఉన్నాయో భారత్ కు కూడా ఇంచు మించు అదే స్థాయి వనరులు ఉన్నాయి, మరి భారత్ ఎదుగుదల నిదానంగా కొనసాగుతూ ఉంటె చైనా చుస్తే ఉండగానే ట్రిలియన్ డాలర్లకు ఎలా పదలెత్తింది.
Agriculture sector:
గడిచిన కొన్ని సంవత్సరాల కాలంలో చూస్తుండగానే చైనా చాలా మారిపోయింది. ప్రపంచం దృష్టినే తనవైపు తిప్పుకునే అంతలా మారిపోయింది. చైనా లోని ముఖ్య నగరాల్లో భవనాలను చుస్తే ఇవి ఆకాశాన్ని తాకుతాయా అన్నట్లు ఉంటాయి, అలాగే అక్కడి బుల్లెట్ రైళ్ల వేగం చుస్తే, ఆ స్పీడు ని మన మనస్సు కూడా అందుకోగలుగుతుందో లేదో అన్నంత సందేహం కలుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఒక వెనుక బడిన కమ్యూనిస్ట్ కంట్రీ గ్లోబల్ కాపిటలిజం కి ఇంజన్ లా ఎలా మారింది అని ఆశ్చర్యం వేస్తుంది. అయితే గడిచిన 40 సంవత్సరాలలో చైనా ఇంతగా వీరుఇది చెందడానికి ఆ దేశంలో తీసుకువచ్చిన ఆర్ధిక సంస్కరణలే కారణం గా చెప్పుకోవచ్చు. 1978లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు చైనాను అత్యంత ధనిక దేశంగా మార్చేశాయి. చైనాను మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి దోహదపడ్డాయి. విదేశీ పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెంచడంలో ఈ సంస్కరణలే ఉపయోగపడ్డాయి. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏదేశము దృష్టిపెట్టని దానిమీద చైనా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. అందుకే ఆ దేశంలో సిరుల పంట పండుతోంది. ఆ రంగమే వ్యవసాయం. చైనా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టింది. అదేవిధంగా సాంకేతికతను పరిపూర్ణంగా అభివృద్ధి చేసింది. ఆ సాంకేతికత వ్యవసాయ ఉత్పత్తిని గణనీయంగా పెంచేసింది. అలా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తి ఆహార భద్రతను మెరుగుపరిచింది. డీఎంతో చైనా అత్యధిక జనాభా కలిగి ఉన్నప్పటికీ ఆహార కొరత అన్నది ఎక్కడా కనిపించకుండా చేసింది
Commodity production:
చైనా పేరు చెప్పగానే మనకు అనేక రకాలైన వస్తువులు గుర్తుకు వస్తాయి. ప్రతి రోజు మనం వాడే సెల్ ఫోన్ ల దగ్గర నుండి టీవీలు, కెమెరాలు, కార్లలో స్పేర్ పార్టులు ఇలా చెప్పుకుంటూ పొతే అనేక వస్తువులను చైనా ఉత్పత్తి చేస్తూనే ఉంది. కాబట్టి చైనా దేశం పారిశ్రామికంగా ఎంతలా డెవలప్ అయింది మాటల్లో వారించనవసరం లేదు. జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేలా అన్నట్టు ఉంటుంది ఆ వ్యవహారం. చైనా ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో కూడా పెట్టుబడులు ఎక్కువగానే పట్టింది. అంతేకాకుండా తమ వద్ద ఉన్న వరరుల గురించి వివరించి, తాము కల్పించే వసతుల గురించి చెప్పి విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించింది. తద్వారా పారిశ్రామిక అభివృద్ధిని సాధించగలిగింది. కేవలం కొన్ని సంవత్సరాలలోనే అతిపెద్ద పారిశ్రామిక దేశాలలో ఒకటిగా చైనా మారిపోయింది.
In the service sector:
సేవారంగం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో కూడా చైనా వేగంగానే ముందుకు వెళుతోంది. చైనా అనే దేశం ఒకప్పుడు ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిమిగిన దేశం, అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ ఆక్రమించింది అనుకోండి, అది వేరే విషయం. అయితే ఆ అధిక జనాభాలో ఉన్న యువత ఉపాధిని వెదుకుతూ ప్రభుత్వం పై ఆధారపడకుండా ముందుకు వెళుతుండటం తో అది ఆ దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇలాంటి కారణాలన్నీ చైనాను ధనిక దేశంగా మార్చాయి. ప్రస్తుతం 2023 సంవత్సరానికి గాను చైనా జిడిపి చుస్తే 19.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది అమెరికా జీడీపీ కంటే కొంచమే తక్కువ అయినప్పటికీ నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే.
How many dollars is the financial income of a Chinese citizen:
చైనా దేశంలో ప్రస్తుతం ఒక్కో పౌరుడి ఆర్ధిక ఆదాయం సగటుగా తీసుకుంటే 2023 సంవత్సరానికి గాను 10 వేల డాలర్లకు మించే ఉంది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ గణనీయమైన వృద్ధి సాధించడం కోసం చైనా దేశం సమిష్టిగా కృషి చేసింది అని చెప్పొచ్చు. ఇక పేదరికం గురించి కూడా మాట్లాడుకోవాలి. అగ్రరాజ్యం అమెరికాలో కూడా తప్పకుండా పేదరికం ఉంది తీసుతుంది. అక్కడ కూడా మురికి వాడలు ఉంటాయి, ఒకవేళ ఏవ్ గనుక లేకుంటే ఇంగ్లీష్ లో స్లం ఏరియా అనే మాట ఎలా పుట్టుకొస్తుంది, పూర్ అనే పదం ఎలా వినిపిస్తుంది. కాబట్టి ఎంత ధనికదేశంలో అయినా ఈ రెండు తప్పనిసరిగా ఉంటాయి. చైనాలో కూడా ఇప్పటికి పేదరికం ఉంది. అయితే వారు గర్వంగా చెప్పుకునే అంశం ఏమిటంటే 1981 వ సంవత్సరంలో చైనాలో 88% మంది పేదరికంలో ఉండగా ఇప్పుడు కేవలం 0.6 శాతానికన్నా తక్కువగా ఉంది అని. ఆ దేశ పౌరుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలైన వైద్యం,. విద్య వంటివి అందుబాటులో ఉన్నాయి. అక్కడి ప్రజలు వాటిని అందిపుచ్చుకోవడం సులభతరం చేశాయి ఆ దేశ ప్రభుత్వాలు.
The seed of China’s growth is the same:
చైనా దేశం ప్రపపంచంలోనే ధనిక దేశంగా ఎదగడానికి 1978 లో ప్రవేశ పెట్టిన సంస్కరణలే కారణం అని మనం చెప్పుకున్నాం, అయితే అవి ఎటువంటి సంస్కరణలు, వాటిని ప్రవేశపెటింది ఎవరు అని ఒక్కసారి చూద్దాం. 1978లో, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత డాంగ్ శ్యావోపింగ్ చైనా ముఖచిత్రాన్ని మార్చేందుకు బీజం వేశాడని చెప్పొచ్చు. ఆరోజు డాంగ్ శ్యావోపింగ్ పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఈ సంస్కరణలు చైనా ఆర్థిక వ్యవస్థను మార్చడాని కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. డాంగ్ శ్యావోపింగ్ ప్రైవేట్ వ్యాపారాలను బాగా ప్రోత్సహించారు, వాటిని ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వ రంగంపై ఆధారపడటాన్ని తగ్గేలా చేశారు. అది నెమ్మదిగా ఇండస్ట్రీలిస్టుల పెరుగుదలకు దోహదం చేసింది. ఎప్పుడైతే ఒక కంపెనీ ఎదుగుతుందో అది పన్నుల రూపంలో ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తుంది, ప్రజలకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధిని కల్పిస్తుంది,
Foreign investment:
కేవలం చైనా లో ఉన్న పారిశ్రామిక వేత్తలు మాత్రమే పెట్టుబడులు పెడితే సరిపోదు, వారితో పాటు విదేశీ పెట్టుబడులు కూడా తప్పనిసరిగా అవసరమే. అందుకే డాంగ్ శ్యావోపింగ్ విదీశీ పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏయే చర్యలు అవసరమో అన్ని చర్యలు తీసుకున్నాడు. వాడవలసిన అస్త్రశస్త్రాలు అన్నీ వాడాక విజయం ఎందుకు వరించడు అన్నట్టు. చైనా దేశం కూడా విదేశాల చూపు తనవైపు తిప్పుకునేలా చేసింది. అక్కడ పెట్టుబడులు పెట్టాల్సిందే అనేలా ఆకర్షించింది. తద్వారా విదేశీ పెట్టుబడులతో మరిన్ని పరిశ్రమలు వచ్చి తిష్టవేశాయి. మరి పెట్టుబడులు ఎప్పుడైతే పెరుగుతాయో ఆదాయం కూడా వద్దన్నా వస్తూనే ఉంటుంది. అదే చైనా వృద్ధికి మరొక ముఖ్యమైన కారణంగా మారింది.
So many benefits due to productivity:
డాంగ్ శ్యావోపింగ్ చేసిన సంస్కరణల్లో అతి ముఖ్యమైనది ప్రొడుక్టివిటీకి సంబంధిచింది. ఉత్పత్తిశీలత దృడంగా ఉంటె అభివృద్ధి వేగంగా ఉంటుంది. అందుకే శ్యావోపింగ్ దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉత్పత్తిశీలత అనేది మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు బాటలు వేస్తుంది. 1978 సంస్కరణల ద్వారానే చైనాలోని వ్యాపారాలకు మరిన్ని అవకాశాలను కల్పించాయని చెప్పొచ్చు. చైనా జనాభా సంఖ్య పెద్దది అంటారు. ప్రపంచంలో కెల్లా ఎక్కువ జనాభా కలిగిన దేశంగా చైనాను చూపెడుతూ ఒకప్పుడు ఆ దేశాన్ని కొన్ని దేశాలు గేలి చేశాయి. .అయితే అదే జనాభా చైనా దేశానికి వరంగా మారింది. ఎక్కువ జనాభా కలిగిన దేశంగా ఉంది అంటే ఎక్కువ కార్మిక శక్తిని కూడా కలిగి ఉందనే చెప్పాలి. ఆ కార్మిక శక్తిని అభివృద్ధికి రెక్కలుగా వాడుకుంది చైనా. సంఖ్య ఎక్కువగా ఉండటంతో తక్కువ ఖర్చుతో
పనివారు దొరికే సౌకర్యం కలిగింది పరిశ్రమలకు. నిర్వహణ తక్కువ లాభాలు ఎక్కువ గున్నప్పుడు ఏ దేశానికి చెందిన కంపెనీ అయినా చైనాకి వెళ్లి పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడడు కదా. అదే జరిగింది చైనా విషయంలో.
Is that why China has invested in transportation:
వ్యాపారానికి ఎప్పుడైనా రవాణా అనేది కీలకం. కాబట్టి చైనాలోని ప్రభుత్వం మౌలిక సదుపాయాల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. రవాణా విషయంలో ఎక్కడ జారీ పడకుండా రోడ్లు, ఓడలు, విమానాలు అన్నింటా అత్యధికంగా పెట్టుబడులు పెట్టెల చేసింది. ఇలా అభివృద్ధికి భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల చైనాలో వ్యాపారాలకు మరింత ఊతమివచ్చినట్టయింది. చైనా లో విమానాశ్రయాలు, ఓడరేవులు, రహదారులు అన్నింటిని ప్రధమ శ్రేణి లో ఉంచడంతో అవి అధివృధికి దారులను సుగమం చేశాయి. దీంతోపాటుగా సాంకేతిక రంగం కూడా చైనా డెవెలెప్మెంట్ కి కలిసివచ్చిన అంశంగా చెప్పొచ్చు. చైనా దేశం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూనే ఉంది, అందుకే అక్కడ బులెట్ ట్రైన్స్ వంటివి కనిపిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఒక దేశం పోటీపడాలంటే ఖచ్చితంగా టెక్నాలజీ అనేది కీలకం. అటువంటి అద్భుతమైన టెక్నాలజీ చైనా సొంతం చేసుకుంటోంది కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ పనిని పూర్తి చేయగలుగుతుంది. యాంత్రీకరణ ను ప్రవేశపెట్టి పనిగంటలు ఆదా చేసుకుంటూ వేగంగా ముందుకి కదులుతోంది. ప్రొడక్టివిటి అనేది ఎక్కువగా ఉంది అంటే అది ఖచ్చితంగా నిరుద్యోగాన్ని కూడా తగ్గిస్తుంది. ఏ దేశంలో అయితే నిరుద్యోగం తగ్గుతుందో ఆ దేశం ఆర్ధికంగా బలపడుతుంది. పైగా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుపడతాయి.
How is China in terms of military:
ఇక చైనా ఎంతటి శక్తివంతమైన దేశంగా ఉంది అనే విషయాలు కూడా మనం ప్రస్తావించుకోవాలి, చైనా దేశం అత్యంత ఎక్కువ సైన్యాన్ని కలిగి ఉంది. సంఖ్యా పరంగా చుస్తే ప్రపంచంలో చైనా సెకండ్ ప్లేస్ లో ఉంది ఆర్మీ విషయంలో. దేశ రక్షణ విషయం లో చైనా చాలా పకడ్బందీ గా ఉంటుంది. అయితే అదే సమయంలో సరిహద్దు దేశాల పట్ల కవ్వింపు చర్యలకు కూడా పాల్పడుతూ ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఆక్రమణ విషయంలో దుందుడుకు గా వ్యవహరిస్తున్న చైనా మొదటి నుండి సైనిక శక్తి పరంగా బలపడుతూ వస్తోంది. ఆదేశం మిలటరీ కోసం ఎక్కువగా పెట్టుబడులు పెడుతూనే ఉంది. రక్షణ రంగాన్ని నాధునీకరించడం కోసం ఎంతైనా ఖర్చుచేయడానికి వెనకడుగు వేయడం లేదు. తన ఆర్ధిక వ్యవస్థ, సైనిక శక్తితో ప్రపంచంలోనే ఒక బలమైన దేశంగా మారిపోయింది. చైనాను ఎంత ద్వేషించినా ఆ దేశ అభివృద్ధి వారు నిర్ణయాలు, దేశ రక్షణ కోసం వారు చేపడుతున్న చర్యలు చుస్తే వారిని శభాష్ అనకుండా కొంతమంది ఉండలేరు.