How did Hyderabad become an IT hub? : బిర్యాని హబ్ లా ఉండే హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా అయ్యింది..

anil 5 How did Hyderabad become an IT hub? : బిర్యాని హబ్ లా ఉండే హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా అయ్యింది..

How did Hyderabad become an IT hub? : బిర్యాని హబ్ లా ఉండే హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా అయ్యింది..

బిర్యాని హబ్ లా ఉండే హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా అయ్యింది..హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు ఏ సంఖ్యలో ఉన్నారో తెలుసా..భాగ్యనగరం సౌభాగ్యంగా అవ్వడానికి ఐటీ పాత్ర ఎంత..

హైదరాబాద్ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది ఘుమ ఘుమలాడే బిర్యాని, భాగ్యనగరంలో ప్లేస్ ఏదైనా సరే బిర్యాని మాత్రం అదరహో అనిపించాల్సిందే. నాన్ వెజ్ తోనే కాకుండా వెజ్ తో కూడా ఇక్కడ రకరకాల బిర్యానీలు ఉంటాయి.

అవి తిన్నవారు తప్పకుండా అద్భుతః అని తీరుతారు. ఎందుకంటే ఇక్కడి బిర్యాని రుచులు అలాంటివి. హైదరాబాదీ బిర్యానీకి సామాన్య ప్రజలు మాత్రమే కాదు సినీ తారలు కూడా పిచ్చ ఫాన్స్ అయిపోతారు.

బిర్యాని తింటే లావయిపోతారు అని తెలిసినా జిహ్వ చాపల్యాన్ని ఆపుకోలేక కొంచమయినా టేస్టింగ్ బడ్స్ కి బిర్యాని రుచి చూపించకుండా ఆగలేరు. అది ఇక్కడి బిర్యాని స్పెషల్.

షూటింగ్ స్పాట్ లో ఆఫ్టర్ నూన్ లంచ్ లో హీరో గారికి ఎం కావాలి అంటే మరో థాట్ లేకుండా వినిపించే మాట వేడివేడి బిర్యాని. అలా ఉంటది మరి మన హైదరాబాదీ బిర్యాని తోని.

కానీ ఇప్పుడు హైదరాబాద్ పేరు చెబితే మషాలా ఫ్లేవర్ బిర్యాని తోపాటుగా మరో పేరు కూడా వినిపిస్తోంది. అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.

హైదరాబాద్ అంటే ఐటీ.. ఐటీ అంటే హైదరాబాద్ అన్నట్టు మారిపోయింది. కేవలం తెలంగాణ వారికే కాక అనేక రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఐటీ సెక్టార్ లో ఉద్యోగం చేసుకుంటూ మంచి జీతంతో జీవనాన్ని సాగించేవారు అనేక మంది ఉన్నారు.

ఒకప్పుడు బిర్యాని బాక్స్ లా ఉన్న హైదరాబాద్, ఇప్పుడు ఐటీ కి కేరాఫ్ అడ్రస్ లా ఎలా మారింది ? అనే విషయాలు చూద్దాం.

బిర్యాని హైదరాబాద్ కి ఎలా వచ్చింది..

Add a heading 2023 11 26T141301.894 How did Hyderabad become an IT hub? : బిర్యాని హబ్ లా ఉండే హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా అయ్యింది..

హైదరాబాద్ నగరం ఐటీ కి కేరాఫ్ అడ్రస్ ఎలా అయింది అన్నది పక్కన పెడితే అసలు ముందు హైదరాబాద్ నగరం బిర్యాని కి అంత ఫెమస్ ఎలా అయింది అన్నది ముందు చూద్దాం.

బిర్యాని అనేది ఒక ప్రత్యేకమైన వంటకం దీనిని చాలా శ్రద్దగా వండాలి, ఎలా పడితే అలా చేస్తే దాని రుచి పాడవుతుంది.

అందుకే హోటళ్లలో బిర్యాని వండేందుకు నిపుణులు, బాగా చేయితిరిగిన వంటగాళ్లను మాత్రమే తీసుకుంటారు.

ఈ బిర్యాని కోసం కొన్ని ప్రత్యేకమైన మసాలా దినుసులను ఉపయోగిస్తారు. అలాగే సన్నని బాస్మతి రకం బియ్యాన్ని వాడతారు.

ఇది ఎలా తయారు చేస్తారు ఎంవెం ఉపయోగిస్తారు అనేది చూసే ముందు అసలు హైదరాబాద్ లోకి ఈ బిర్యాని ఎప్పుడు ఎలా ప్రవేశించింది అనేది చూద్దాం.

బిర్యాని అనే వంటకం భాగ్యనగరంలోకి ఎలా వచ్చింది అని చెప్పడానికి ఖచ్చితమైన నిర్ధారణ ఏమి లేదు. ఇప్పటివరకు అటువంటి దాఖలాలు కూడా చరిత్రలో మనకు లభించలేదు.

కానీ కొన్ని ఆధారాల ప్రకారం ఈ బిర్యాని 16వ శతాబ్దంలో హుమయూన్ చక్రవర్తి ద్వారా ఇది హైదరాబాద్ లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది.

హుమాయూన్ చక్రవర్తి మంచి భోజనప్రియుడట, అయన 1540 లో హైదరాబాద్ నగరాన్ని స్థాపించినప్పుడు ఇక్కడే ఉండాల్సి వచ్చింది.

మరి తన రుచికి అభిరుచికి తగ్గట్టు తనతోపాటు తన పాకశాస్త్ర నిపుణుడిని కూడా వెంట తెచ్చుకున్నాడట హుమాయూన్ చక్రవర్తి.

అలా ఆ పాకశాస్త్ర నిపుణుడు బిర్యానీని తాను వాడటమే కాక ఇక్కడి వారికి దానిని తయారుచేయడం కూడా నేర్పించాడట.

మొఘలాయుల పాత్ర కూడా ఉందనే చెప్పాలి

Add a heading 2023 11 26T142314.736 How did Hyderabad become an IT hub? : బిర్యాని హబ్ లా ఉండే హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా అయ్యింది..

బిర్యాని హైదరాబాద్ చేరుకోవడానికి మరో కథనం కూడా ఉంది. 17 వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనలో హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది.

మొఘల్ చక్రవర్తి కూడా హుమాయూన్ చక్రవర్తి మాదిరిగానే మాంచి ఫుడీ అని అంటారు. కాబట్టి అయన కూడా హైదరాబాద్ కి వచ్చినప్పటికీ బిర్యానీని మాత్రం వదలలేకపోయారు.

కనుక తనతో పాటు తన షెఫ్ ను కూడా అప్పట్లోనే వెంటబెట్టుకుని తెచ్చుకున్నాడని తెలుస్తోంది.

హైదరాబాద్ ను తన రాజధానిగా చేయుకున్నాడని మొఘల్ చక్రవర్తి అనుకున్నాడు కానీ తన తో పాటు తెచ్చుకున్న బిర్యానీకి కూడా హైద్రాబాద్ ను రాజధాని చేస్తున్నాడన్న విషయం అప్పుడు అతనికి తెలియదేమో.

అప్పట్లో మొహాలీ చక్రవర్తి తోపాటు హైదరాబాద్ కి వచ్చిన వంట నిపుణులు నిర్యానిని ఎలా తయారుచేయాలో ఇక్కడి వారికి నేర్పించారు అని తెలుస్తోంది. దాని కారణంగానే ఇక్కడివారికి బిర్యాని ఒక స్పెషల్ ఫుడ్ గా మారిపోయింది.

హైదరాబాద్ లో ఉన్న వారు వారి ఇళ్ళకి ఎవరైనా అతిధులు వచ్చినా వారికి ప్రత్యేకంగా చేసిపెట్టిన వంటకం బిర్యాని, అలా ఆ బిర్యాని అనేక ప్రాంతాలకి పాకిపోయింది.

బిర్యాని హైదరాబాద్ నుండి ఎన్ని ప్రాంతాలకి వెళ్లినా కానీ హైదరాబాద్ లో చేసే బిర్యానీకి వచ్చే రుచి మరెక్కడా చేసినా ఆ బిర్యానీకి రాదనే అంటారు.

అందుకే మొఘలాయులు, హ్యుమాయున్ చక్రవర్తుల ద్వారా పరాయి రాష్ట్రాల నుండి హైదరాబాద్ కి బిర్యానీ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికి హైదరాబద్ బిర్యాని అంటే మహామహులంతా ఇష్టంగా ఒక పట్టు పట్టేస్తారు.

బిర్యాని రుచికి మూలం ఏమిటంటే..

Add a heading 2023 11 26T153125.728 How did Hyderabad become an IT hub? : బిర్యాని హబ్ లా ఉండే హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా అయ్యింది..

ఇక్కడి బిర్యానీకి అంతటి రుచి రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమిటి అంటే అందులో వాడే మసాలాలు ఒకటయితే వండే తీరు మరొకటి.

ఇందులోకి నల్ల మిరియాలు, బిర్యాని ఆకులు, షాజీరా, లవంగ, దాల్చిన చక్క, కుంకుమ పువ్వు, యాలుకలు, మెంతులు, నెయ్యి , జాజికాయ, దానిమ్మ పొడి వాడతారు.

వీటితి పాటుగా అల్లం వెల్లుల్లి పేస్టూ గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వంటిని, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, టమోటా వంటి వాటిని ఉపయోగించడం తప్పనిసరి. అయితే బిర్యాని తినే వారి రుచికి తగినట్టు మాంసాన్ని ఎంచుకుంటారు.

కొందరు లేత పొట్టేలు మాంసాన్ని ఎంచుకుంటే కొందరు బాగా ఎదిగిన పొట్టేలు మాంసాన్ని ఉపయోగిస్తారు. కొందరు నాటు కోడిని వాడితే, మరికొంతమంది బ్రాయిలర్ కోడి మాంసంతో బిర్యానీ తయారుచేసుకుంటారు.

ఈ బిర్యాని కోసం మసాలా పేరుతో కలిపి నానబెట్టిన మాంసాన్ని తగినంత పరిణామం లో నీరు బియ్యం తో కలిపి ఉడికిస్తారు.

అయితే బిర్యాని వండే క్రమంలో ఆవిరిని బయటకు పోనివ్వకుండా పాత్రకు మూతను గట్టిగా పెట్టి దానిపవు బరువును కూడా ఉంచుతారు. అందుకే అందులోని మాంసం మెత్తగా ఉడుకుతుంది అంటారు.

చెప్పినంత సులువు కాదు బిర్యాని వండి నలుగురికి నచ్చే విధంగా వడ్డించడం అంటే. అది కేవలం హైదరాబాదీలకు సాధ్యం అని నిరూపించుకున్నారు కాబట్టే ఇక్కడి బిర్యాని అంతగా ఫేమస్ అయ్యింది.

ఐటీ అడుగుపెట్టింది అప్పుడే..

Add a heading 2023 11 26T151442.806 How did Hyderabad become an IT hub? : బిర్యాని హబ్ లా ఉండే హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా అయ్యింది..

హైదరాబాద్ చెప్పగానే మొఘలాయ్ బిర్యాని, దం బిర్యాని అని షాహీ బిర్యాని అని అనేక రుచులు మన మనసులను దోచుకుంటాయి, కానీ హైదరాబాద్ పేరుచెప్పగానే గుర్తుకువచ్చేది మరొకటి కూడా ఉంది.

అదే ఐటీ సెక్టార్. ఈ ఐటీ సెక్టార్ హైదరాబాద్ లోకి అడుగు పెట్టడం వల్లనే బిర్యాని హబ్ గా ఉన్న హైదరాబాద్ ఐటీ హబ్ గా మారిపోయింది.

అసలు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలని హైదరాబాద్ లోకి ఎప్పుడు ల్యాండ్ అయింది ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు దీన్ని డెవలప్ చేశారు అనే విషయాలు చూద్దాం.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మొట్టమొదటిసారి తెలంగాణ లోకి అడుగుపెట్టింది 1992 వ సంవత్సరంలో అని చెప్పాలి.

1990 లలో భారత దేశ ప్రభుత్వం పెట్టుబడుల కోసం చేపట్టిన ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా కొన్ని విదేశీ కంపెనీలు మన తెలంగాణా లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

అలా 1992లో ఒక ఐటీ కంపెనీ తన కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో స్థాపించింది. ఆతరువాత 1993 లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో ఐటీ హబ్ కోసం భూమిని కూడా కేటాయించినట్టు కొన్ని అధరాల ద్వారా తెలుస్తోంది.

కానీ కొన్ని సంవత్సరాల పాటు ఐటీ రంగం తెలంగాణ లో మందకొడి గానే సాగింది.

ఒకప్పుడు సైబర్ టవర్స్ పరిస్థితి..

Add a heading 2023 11 26T143246.525 How did Hyderabad become an IT hub? : బిర్యాని హబ్ లా ఉండే హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా అయ్యింది..

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టు ఉండేది ఒకప్పటి ఐటీ రంగం తీరు, తెలంగాణ లో 1999 నుండి ఐటీ నిలకడ గా నడవడం మొదలు పెట్టింది.

ఆసమయంలోనే సైబర్ టవర్స్ వెలిశాయి. హైటెక్ సిటీ అనే ఒక ఏరియా పుట్టుకొచ్చింది. హైదరాబాద్ లో పరుగులు పెట్టడం ఒక్కరోజులో సాధ్యంకాలేదు.

ఆనాడు సైబర్ టవర్స్ తో మొదలైన ఐటీ రంగం ఈ నాడు సైబర్ సిటీగా మారి రాష్ట్ర ఖజానాకు సిరులు కురిపిస్తోంది అంటే ఓవర్ నైట్ లో సాధ్యపడింది కాదు.

సమైక్యంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లోని వారు తెలంగాణ లోని వార్ కలిసి కలిసి చేయిపట్టి దీనిని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ ఐటీ రంగంతో కలిసి ఎదిగిన వారు ఇక్కడే స్థిరపడిపోయారు.

ఎక్కడో పుట్టినప్పటికీ దశాబ్దాల కాలంగా ఇక్కడే ఉండటం వల్ల తెలంగాణ మీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఓటు హక్కు కూడా పొంది, హైదరాబాదీలయిపోయారు.

ఇక ఒకప్పుడు గంటకి ఒక బస్సు ఉండేది హైటెక్ సిటీకి, కోడలు గుట్టల మధ్య, చెట్ల పొదలు, రాళ్లు రప్పల మధ్య ఉండేది సైబర్ టవర్స్.

కానీ ఇప్పుడు ఆకాశాన్ని తాకే అంత పెద్ద పెద్ద భావనాలు అనేక కంపెనీలు, లక్షల్లో ఉద్యోగులు, కోట్లల్లో టర్నోవర్, ఇది ఐటీ తీరు ఈనాడు.

లక్షల్లో ఉద్యోగులు..కోట్లల్లో టర్నోవర్

Add a heading 2023 11 26T145005.739 How did Hyderabad become an IT hub? : బిర్యాని హబ్ లా ఉండే హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా అయ్యింది..

ఎప్పుడు చూసినా, షిఫ్తుల్లో పనిచేసే ఉద్యోగులు, కరోనా సమయంలో కూడా ఆగని ఐటీ పరుగులు, చాలా రంగాలు కరోనా సమయంలో ఆర్ధికంగా నలిగిపోయాయి కానీ ఐటీ రంగం మాత్రం ఇస్త్రీ చొక్కా మాదిరిగా ఏ మాత్రం చెక్కుచెదరకుండా నిలకడ ఉంది.

ఉన్న ఎంప్లాయిస్ అందరు ఇళ్ళకి చేరుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. కొత్త వాళ్ళను కూడా ఆన్ లైన్ విధానంలో రిక్రూట్ చేసుకునిఎంతో మందికి ఉపాధి కల్పించింది ఐటీ రంగం.

కరోనా సమయాన్ని కాస్త పక్కన పెడితే ప్రతి రోజు వేల సంఖ్యలో చదువు పూర్తి చేసుకున్న వారు కోటి ఆశలతో హైదరాబాద్ లో దిగిపోతారు. ఎస్సార్ నగర్ అమీర్ పెట్ హాస్టళ్లల్లో ఉంటూ మైత్రి వనం లో కోచింగులు తీసుకుంటూ ఉంటారు.

కోచింగులు పూర్తవగానే ఎదో ఒక కంపెనీలో జాబ్ కొట్టేస్తారు. అంటే ఐటీ మీద ఆధారపడి హైదరాబాద్ లో ఎన్ని కోచింగ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి అని చెప్పడం కష్టం.

అందులోను ఏ కోచింగ్ సెంటర్లు కేవలం మైత్రీవనం లో మాత్రమే ఉన్నాయనుకుంటే పొరపాటే, ఇప్పుడు ఇవి నగరంలోని అనేక ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.

ఇతర జిల్లాలకి విస్తరిస్తున్న ఐటీ

ఇక ఐటీ రంగం కూడా తెలంగాణ లోని హైదరాబాద్ కి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అనేక జిల్లాలకు కూడా విస్తరించేలా చేయాలనీ ఇప్పటి ప్రభుత్వం సత్తా విధాలా ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగానే వరంగల్ ఐటీ హబ్ పెటిట వరంగల్ లో ఐటీ కంపెనీలు వచ్చేలా అడుగులు పడుతున్నాయి.

అందుకోసం పెట్టుబడులను ఆకర్షించే విధంగా మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక పెట్టుబడి పెట్టె కంపెనీలకు రాయితీలు ఇవ్వడంలో కూడా వెనుకాడటం లేదు.

హైదరాబాదీ బిర్యానీ రుచులు కేలవం హైదరాబాద్ తోనే ఆగిపోకుండా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర మొత్తం పాకాయి. ఎలానే ఇతి కూడా విస్తరించింది.

ఆంధ్ర లో కూడా ఐటీ

ఈ ఐటీ రంగం కూడా కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ విశాఖ నాగరాల్లోకి కూడా ఐటీ విస్తరించింది.

ఐతే హైదరాబాద్ రేంజ్ లో పరుగులు పెట్టాలంటే కొంత సమయం అయితే పడుతుంది అంటున్నారు నిపుణులు.

ఇప్పటికే విశాఖపట్టణంలో ఐటీ సెజ్ మధురవాడ అనే పేరుతో ఒక ఏరియానే ఉంది. కానీ అక్కడ ఐటీ రంగం ఇంకా పూర్తి స్థాయిలో వృద్ధి కావలసి ఉంది.

ఆశించిన స్థాయిలో కంపెనీలు రాలేదు. వచ్చిన కంపెనీలు కూడా అనుకోని కారణాలతో పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిపోయాయి.

కొంత సమయం పట్టినప్పటికీ విశాఖ లో కూడా ఐటీ రంగం తప్పక వేళ్ళూనుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Leave a Comment