How Hyderabad is overtaking Bengaluru in terms of IT Sector : బెంగళూరు vs హైదరాబాద్ ఐటీ ఫుల్ కేస్ స్టడీ
ఐటీ శాఖా మంత్రి KTR గత రెండేళ్లలో ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ వేగం బెంగళూరుని దాటేసి ముందుకు వెళ్ళిందని అన్నారు.
ఇండియాలోని మొత్తం ఐటీ ఉద్యోగాలలో 44 శాతం తెలంగాణ వాళ్ళే ఐటీ ఉద్యోగాలలో రాణిస్తున్నారని వెల్లడించారు.
ముఖ్యంగా మన తెలంగాణలో ఐటీ పరిశ్రమలోగాను హైదరాబాద్ కు దక్కిన అరుదైన గౌరవం ” హైదరాబాద్ నగరం భారతదేశం యొక్క సాఫ్ట్వేర్ రాజధాని” అన్న బిరుదు.
హైదరాబాద్ చిన్నదే అయినప్పటికీ దేశపు ఐటీ అబివృద్దికి కీలక నగరంగా నిలిచింది.
ఐటీ స్థాపన విషయానికి వస్తే హైదరాబాద్లో మొట్టమొదట 1986 లో బేగంపేట్ లో ఒక ఐటీ టవర్ ని ఇంటర్గ్రాఫ్ అనే పేరుతో మొదలుపెట్టారు.
1990 ల చివరలో HYSEAని ఆంద్రప్రదేశ్ స్థాపించినప్పుడు హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ అడుగుపెట్టింది. 1991 లో జనార్ధన్ రెడ్డి సాఫ్ట్వేర్ పరిశ్రమల్ని మొదలు పెట్టారు.
హైదరాబాద్ లో ఐటీ స్థాపించినప్పటినుండి ఇప్పటివరకు ఐటీ రంగంలో దాదాపు 9,05,715 మంది ఉద్యోగులను కలిగి ఉంది.
గత ఏడాది 7,78,121 ఉద్యోగాలు ఇవ్వగా ఈసారి 1,27,594 కొత్త ఉద్యోగాలు ఇచ్చింది అంటే ఉద్యోగాలలో 16.29 శాతం వృద్ది అన్నమాట.
వీళ్ళంతా 1500 కంపెనీలలో పనిచేస్తున్నారు. ఇక్కడ మైక్రోసాఫ్ట్, గూగుల్,ఫేస్బుక్, అమేజాన్ లాంటి అతిపెద్ద టెక్ దిగ్గజ కొంపెనీలు ఉన్నాయి.
ఈ ఐటీ కంపెనీల అబివృద్ధి ఎంతలా పెరిగింది అంటే, 2022 -23 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ 2,41,275 కోట్ల ఐటీ ఎగుమతులు చేసింది.
ఈ ఎగుమతుల వృద్ది 31.44 శాతం. గత ఏడాది 1,83,569 కోట్ల ఎగుమతులు ఉండేవి. అంటే ఈసారి 57,706 కోట్ల ఎగుమతులు పెరిగాయి.
ఈ ఎగుమతులతో ఐటీ పరిశ్రమలోనే భారతదేశంలో హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ 2023 నాటికి 16.77 శాతం ఐటీ ఉపాధి వాటా తెలంగాణదే ఉంది.
హైదరాబాద్ లో ఐటీ అబివృద్దిలో రాజకీయ నాయకుల కృషి ;
చంద్రబాబు నాయుడు ;
ఐటీ అబివృద్ధి గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడి గురించి చెప్పుకోవాల్సిందే, ఈయన బయోటెక్నాలజీ కంపెనీలను మన హైదరాబాద్ కి తీసుకురావడానికి ఎంతో కస్టపడ్డారు.
1999 లో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ తో ప్రభుత్వ – ప్రైవేటు రెండింటి భాగస్వామ్యంతో జీనోమ్ వ్యాలీని ఎస్పి బయోటెక్ పార్క్ గా మార్చారు.
చంద్రబాబు నాయుడు ”హలో హైదరాబాద్”, ”బై బై బెంగళూరు ” అనే నినాదాన్ని ఇచ్చారు. ఆయన హయాంలోనే విజన్ 2020 ని తయారు చేసి దానికోసం హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ కోసం బిల్ గెట్ ని కలిసి ఈ రూపకల్పన గురించి చెప్పి ఒప్పించారు.
మైక్రోసాఫ్ట్, సిఏ టెక్నాలజీస్, డెలాయిట్, ఇంకా ఇతర అంతర్జాతీయ కంపెనీలతో కలిసి వాటిని హైదరాబాద్ కి తీసుకొచ్చేందుకు కృషి చేశారు.
కేటీఆర్ ;
హైదరాబాద్ లోని మలక్పేట్లో ఐటీ టవర్ కి శంకుస్థాపన చేశారు. ఈ టవర్ ని 700కోట్ల వ్యయంతో నిర్మిస్తారని, దాదాపు 50000 ఐటి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా దీని నిర్మాణం అని వివరించారు.
ఐటీ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న బెంగళూరుని వెనక్కి నెట్టి హైదరాబాద్ ని ముందుకు తీసుకెళ్లాడమే లక్ష్యం అని వివరించారు.
హైదరాబాద్ లో అత్యంత ఎత్తైన ఐటీ టవర్ ని ఫిబ్రవరి 17లో గెట్ వే ఐటీ పార్క్ ను మొదలుపెట్టింది. ఇది నగరానికి 35 కి.మీ దూరంలో మేడ్చల్ దగ్గరలోని కండ్ల కోయలో నిర్మించేదుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ 2016 ఫిబ్రవరిలో వరంగల్ జిల్లాలోని మడికొండలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ని స్థాపించారు.
బెంగళూరు vs హైదరాబాద్ ఐటీ ;
బెంగళూరు ని భారతదేశపు ఐటీ హబ్ గా పిలుస్తారు. మన దేశం మొత్తంలో ఐటీ రంగంలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది.
బెంగళూరులో చాలా పెద్దమొత్తంలో SEZలు ఉన్నాయి. ఇది ఐటీ పరిశ్రమలకు కేంద్రం అని చెప్పవచ్చు. ఇక దీని తరువాత మన హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది.
చూస్తుంటే హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమల వేగానికి మరికొన్ని ఏళ్లలో మొదటిస్థానాన్ని చేరున్నా ఆశ్చర్యం లేదు. 1990 నుండి ఐటీ కంపెనీల సంఖ్య హైదరాబాద్ లో గణనీయంగా పెరిగింది.
పెరుగుతున్న స్టార్టప్ లకు అనుగుణంగానే ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ లో జీవనవ్యయం చాలా తక్కువ, ఉద్యోగులకు ఇది చాలా ఉపయోగకరమైన అంశం.
బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ లో నివాసం చాలా సౌకర్యం.
హైదరాబాద్ నగరంలో 34 SEZలు ఇప్పటికే పూర్తిగా పనిచేస్తున్నాయి. 64 SEZ లు అధికారికంగా ఆమోదించబడ్డాయి.
హైదరాబాద్ లో ఐటి అభివృద్ది;
హైదరాబాద్ లో 700 లకు పైగా ఐటీ మరియు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి.
హైదరాబాద్ లో ప్రధాన ఐటీ కంపెనీలు;
- గూగుల్
- ఐబిఎం
- మైక్రోసాఫ్ట్
- ఇన్ఫోసిస్
- SAP
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
- ఆమెజాన్
- హ్యూలెట్ ప్యాకర్డ్
- సోనీ
- తోషిబా
- నోకియా
- ఏరిక్సన్
- టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్
- ఓగిల్వి మరియు మాథర్
- డెల్
- డెలాయిట్
ఇవి మాత్రమే కాకుండా అనేక ఐటీ పార్కులు వనెన్ బర్గ్, సైబరాబాద్ సోషల్ ఏకోనామిక్ జోన్, L మరియు T ఇన్ఫోసిటీ, మైండ్ స్పేస్, DLF IT SEZ, TCS సినర్జీ పార్క్ మరియు ఎన్నో కొత్త సంస్థలకు హైదరాబాద్ నిలయం.
హైదరాబాద్ నగరంలో గూగుల్;
గూగుల్ US తర్వాత తన అతిపెద్ద కంపెనీని మన భారతదేశంలో స్థాపించడం పెద్ద విషయం కాదు కానీ హైదరాబాద్ లో నిర్మించడం చాలా పెద్ద విషయం.
భారతదేశంలో గూగుల్ తన కంపెనీని మొదలుపెట్టేందుకు ఎంచుకున్న మొదటి నగరం హైదరాబాద్. 2004లో గూగుల్ హైదరాబాద్ లో తమ ప్రధానేతర కార్యాలయాన్ని స్థాపించారు.
ఐబిఏం ;
ఐబిఎం భారతదేశంలో 1951 నుండి ఉంది.
2016 లో హైదరాబాద్ నగరం లోని మాదాపూర్ లో ఐబిఎం స్థాపించబడినది. ఐబిఎం పూర్తి సంస్థలో ఇపుడు 2,88,300 మంది ఉద్యోగులు ఉన్నారు. 100000 మంది ఉద్యోగులు భారతీయులే ఉన్నారు.
మైక్రోసాఫ్ట్;
మైక్రోసాఫ్ట్ బెంగళూరు , నోయిడా లాంటి ప్రదేశాలలో ఉంది. అయితే హైదరాబాద్ లో 1990లో మైక్రోసాఫ్ట్ స్థాపన జరిగినది. మైక్రోసాఫ్ట్ ఇండియా – మైక్రోసాఫ్ట్ క్యాంపస్ గచ్చిబౌలి లో ఉంది.
మైక్రోసాఫ్ట్ ఇండియా (2) – మాదాపూర్ లో ఉంది మైక్రోసాఫ్ట్ గ్లోబల్ సర్విస్ సెంటర్ – మాదాపూర్ లోని విట్టల్ రావ్ నగర్ లో ఉంది. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇండియా – మాదాపూర్ లోని విట్టల్ రావ్ నగర్ లో ఉంది.
ఇన్ఫోసిస్ ;
2000 ఏప్రిల్ లో ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. దీనిని చంద్రబాబు నాయుడు ప్రారంబించారు.
ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో మొదలుపెట్టినపుడు కేవలం 50 మంది ఉద్యోగులు ఉండేవారు, కానీ ఇపుడు 20000 నుంచి 40000 మంది ఉద్యోగులు ఉన్నారు.
SAP;
1996లో SAP బెంగళూరులో స్థాపించబడింది. 2013 ఆగస్ట్ లో ఈ SAP సాఫ్ట్వేర్ సంస్థ హైదరాబాద్ లో స్తాపించబడినది.
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఇది స్థాపించబడినది. పూర్తి SAPలో దాదాపు 1,11,961 ఉద్యోగులు ఉన్నారు. భారతదేశంలో 5 ప్రాంతాలలో SAP బ్రాంచ్ లు ఉన్నాయి అవి – బెంగళూరు, గుర్గావ్, పూణే, ముంబై, హైదరాబాద్.
టాటా కాన్సెల్టెన్సీ సర్వీసెస్;
టాటా కాన్సెల్టెన్సీ సర్వీసెస్ హైదరాబాద్ లో 4 బ్రాంచ్ లు ఉన్నాయి. అవి, TCS – మాదాపూర్, టాటా కాన్సెల్టెన్సీ సర్వీసెస్ – గచ్చిబౌలి,టాటా కన్సల్టెన్సీ సర్విస్- ఫతే మైదాన్ రోడ్డు హైదరాబాద్, టాటా కాన్సెల్టెన్సీ సర్వీసెస్ – సైబరాబాద్.
ఈ టాటా కాన్సుల్టెన్సీ సర్వీసెస్ పూర్తి 46 దేశాలలో 150 ప్రదేశాలలో బ్రాంచ్ లు ఉన్నాయి.
1979 లో హైదరాబాద్ లో మొదటి అడుగు మోపింది.
అమెజాన్ ;
2004 లో అమెజాన్ హైదరాబాద్ లో స్థాపించబడినది. స్థాపించిన కొద్ది కాలానికే హైదరాబాద్ బ్రాంచ్ 2వ స్థానానికి చేరుకుంది.
అరుణ్ కుమార్ ఈ హైదరాబాద్ బ్రాంచ్ కి CEOగా ఉన్నారు. 9.7 ఎకరాల విస్తీర్ణంలో కట్టబడింది. అమెజాన్ 13 దేశాలలో 6 వేర్వేరు ప్రాంతాలో బ్రాంచ్ లను కలిగి ఉంది.
హ్యూలెట్ ప్యాకర్డ్;
HP ఇండియాలో 1988 నవంబర్ 8న స్థాపించబడినది. హైదరాబాద్లో బేగంపేట్ లో ఉంది.
సోనీ;
2008 లో హైదరాబాద్ లోని సోమాజిగూడలో సోనీ సంస్థని స్థాపించడం జరిగినది.
తోషిబా;
తోషిబా హైదరాబాద్ లో 30 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది. 640,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తోషిబా స్థాపన జరిగింది.
నోకియా ;
1995 లో ఇండియాలోకి నోకియా ప్రవేశించింది, ప్రస్తుతం నోకియాలో 16,800 ఉద్యోగులు ఉన్నారు.
ఏరిక్సన్;
1940లో ఎరిక్సన్ ని స్థాపించడం జరిగినది. ప్రస్తుతం హైదరాబాద్ లోని బెగంపేట్ లో ఉంది.
టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్;
1990 లో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ని హైదరాబాద్ లో స్థాపించడం జరిగినది. ఇది కూడా ప్రస్తుతం బేగంపేట్ లో ఉంది.
ఓగిల్వి మరియు మాథర్ ;
2004లో ఓగిల్వి మరియు మథర్ ని హైదరాబాద్లో స్థాపించడం జరిగినది.
ప్రస్తుతం ఇది మాదాపూర్ లో ఉంది. ఈ కంపెనీ దేశ వ్యాప్తంగా 6 బ్రాంచ్ లు కలిగి ఉంది, అవి – గుర్గావ్ , ముంబై, హైదరాబాద్, కలకత్తా, చెన్నై, బెంగళూరు.
డెల్;
మార్చి 2003 లో డెల్ ని హైదరాబాద్ లో స్థాపించారు. 6.6 ఎకరాల్లో డెల్ ఇండియా హైదరాబాద్ లో శంకుస్థాపన చేశారు.
డెలాయిట్ ;
2010 జూన్ 30 న స్థాపించబడినది.
ఇన్ని ఐటి పరిశ్రమలు ఇంత అబివృద్ది చూస్తుంటే హైదరాబాద్ మరికొన్ని ఏళ్లలో బెంగళూరుని దాటేసి ముందుకు దూసుకుపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఇన్ని సంవత్సరాలుగా ఐటి పరిశ్రమలు సాదించినది ఒకెత్తు అయితే ఈ రెండేళ్లలో సాధించిన మార్పు గణనీయమైనది.