Saindhav Movie Trailer: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్(Venkatesh) సైంధవ్ (Saindhav)సినిమాతో సంక్రాత్ బరిలో నిలిచారు. వెంకీ నటిస్తున్న 75వ చిత్రం సైంధవ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
హిట్ మూవీ ఫేమ్ డైరెక్టర్ శైలేష్ కొలను (Shailesh Kolanu) రూపొందించిన ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath)హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రొడ్యూసర్ వెంకట్ బోయనపల్లి (Venkat Boinapally) నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ (Niharika Entertainment)పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు.
సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా సైంధవ్ ట్రైలర్ (Saindhav Trailer) ను రిలీజ్ చేసి వెంకీ ఫ్యాన్స్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించారు.
ఓ వైపు పాప సెంటిమెంట్ మరోవైపు యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్ ఓ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి వెంకటేష్ ఖాతాలో భారీ హిట్ ఖాయమని తెలుస్తోంది.
Saindhav Hits Box office on Sankranthi : సంక్రాంతి బరిలో సైంధవ
సంక్రాంతి (Sankranthi) గిఫ్ట్ గా జనవరి 13న సైంధవ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంతోష్ నారాయణ్ (Santosh Narayan) సంగీతాన్ని స్వరపరిచిన రాంగ్ యూసేజ్ అనే పాట కూడా దుమ్ముదులిపింది
ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో లేటెస్టుగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే సంక్రాంతికి ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu) మాస్ లుక్ లో నటిస్తున్న గుంటూరు కారం (Guntur Karam)విడుదల కాబోతోంది.
ఈ మూవీతో పాటే యంగ్ హీరో , తేజ సజ్జా (Tej Sajja) పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ హనుమాన్ (Hanuman)కూడా విడుదలకు రెడీ అయ్యింది.
మాస్ మహారాజ, రవితేజ (Raviteja) నటించిన ఈగల్ (Eagle) మూవీతో పాటు , నాగార్జున (Nagarjuna)మూవీ నా సామి రంగ ( NasamiRanga) సంక్రాంతి బరిలో ఉన్నాయి.
తెలుగుతో పాటు రెండు తమిళ సినిమాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధమయ్యాయి. సైంధవ్ మూవీ వెంకటేశ్(Venkatesh)
సినీ కెరియర్లోనే వస్తున్న పాన్ ఇండియా మూవీ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సైంధవ్ ను వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.
Saindhava trailer Review:సైంధవ ట్రైలర్ ఎలా ఉందంటే
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సైంధవ్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ , టీజర్లు కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈమధ్యనే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సైంధవ్ కు U/A సర్టిఫికెట్ వచ్చింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 15 నిమిషాలు ఉంది. ఇక లేటెస్టుగా కొత్త సంవత్సరం కానుకగా సైంధవ్ ట్రైలర్ ను విడుదల చేశారు. 3 నిమిషాల 36 సెకెండ్ల డ్యూరేషన్ ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఓ ఇంగ్లీషు పాటతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. వెంకటేష్ కూతురు మా నాన్న సూపర్ హీరో అంటూ చెప్పడం, వెంకీ కూతురితో ప్రేమగా ఉంటూనే మరోవైపు కొంత మంది వ్యక్తులను కిరాతకంగా చంపుతుంటాడు. హీరోయిన్ శ్రధ్దా శ్రీనాధ్, వెంకటేష్,
వెంకీ కూతురు వారి లైఫ్ సాఫీగా సాగుతున్న తరుణంలో అనుకోని రీతిలో పాపకు ఓ సమస్య వస్తుంది. పాప జబ్బున పడటంతో ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే ఇంజెక్షన్ కోసం 17 కోట్ల వరకు అవసరమవుతాయి.
కట్ చేస్తే… సైకో ఈజ్ బ్యాక్ అనే డైలాగ్ తో వెంకీ యాక్షన్ సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిధ్దిఖి (Nawazuddin Siddiqui) విలన్ గా కనిపిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ నటులు ఫ్రేమ్ లో కనిపిస్తారు.
కట్ చేస్తే వెంకటేష్ తన పాపను ఎలా రక్షిస్తాడు, ఫ్లాష్ బ్యాక్ లో వెంకీ ఎవరు ఎందుకు సైకోగా మారి హత్యలు చేస్తున్నాడు. అనేది తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
Tamil Hero Arya special Role : ప్రత్యేక పాత్రలో తమిళ హీరో ఆర్య
పాన్ ఇండియా సినిమా కావడంతో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తారలతో భారీ తారాగణంతో సైంధవ్ విడుదల కాబోతోంది. విలన్ గా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ
(Nawazuddin Siddiqui)కనిపిస్తుండగా , తమిళ హీరో ఆర్య (Arya) కూడా ఈ ట్రైలర్ లో మెరిసాడు. ఆర్య స్పెషల్ అప్పీయరెన్స్ తో ట్రైలర్ ఆధ్యంతం అందరినీ ఆకట్టుకుంది.
ఈ మూవీలో నటి శ్రద్దా శ్రీనాథ్ కంటే ఎక్కువ ఫ్రేమ్ లో తమిళ నటి ఆన్డ్రియా (Andriya)కనిపించింది. దీంతో సినిమాపై సౌత్ లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. . సంతోష్ నారాయణ్ అందించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. విజువల్స్ కూడా చాలా రిచ్ గా కనిపించాయి.