Animal Movie Review: యానిమల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు అంటే..యానిమల్ సినిమా రన్ పై చర్చ.
సెన్సేషనల్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం యానిమల్, ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న నాయకా నాయికలుగా నటించారు. టి సీరీస్ ఫిలిమ్స్, భద్రకాళి ఫిలిమ్స్, సినీ వన్ స్టూడియోస్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.
డిసెంబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా గురించి ఒక విషయం చెబితే ఆశ్చర్య పోకమానరు, ఈ సినిమా రిలీజ్ కి ముందే 20 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టుగా తెలుస్తోంది.
రిలీజ్ కాకుండానే ఎలా సాధ్యం అనుకుంటున్నారా ఈ సినిమా టికెట్లను అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకున్న వారు ఉంటారు కదా, అలా వచ్చిన మొత్తం 20 కోట్లు దాటేసింది ఫిలిం వర్గాల టాక్.
అందుకు హీరో, దర్శకుల కాంబినేషన్ అని తెలుస్తోంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ కు అభిమానులు ఉన్నారు.
అలాంటి రణ్ బీర్ సినిమా కావడం పైగా ఆ సినిమాకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకుడు అవ్వడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇక వంగా సందీప్
మనకి ఎంత గా పరిచయం ఉన్నాడో, బాలీవుడ్ జనాలకు కూడా అంతే స్థాయిలో పరిచయం ఉన్నాడు. ఇక్కడ తీసిన అర్జున్ రెడ్డిని బాలీవుడ్ సినీ అభిమానుల అభిరుచికి తగ్గట్టు దానిని మలచి అక్కడ కూడా మంచి హిట్టు అందుకున్నాడు. పైగా అక్కడ ఆ సినిమాను షాహిద్ కపూర్ తో తెరకెక్కించాడు.
ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో తీసిన యానిమల్ లో చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు ఉన్నాయని అవన్నీ సినిమా చూసి తెలుసుకోవాలని అంటున్నారు చిత్ర బృదం.
ఇక ఈ సినిమా 3 గంటల 20 నిముషాలు ఉండడానికి కూడా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయట. నిడివి తగ్గించడానికి ఎక్కడ ఏ సన్నివేశం కూడా తీసేయడానికి వీలు లేకపోవడంతో అలానే ఉంచేసినట్టు తెలుస్తోంది.
కథమీద దర్శకుడిని నమ్మకం ఉండబట్టే అలా ఉంచారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదని అంటున్నారు. ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య నడిచే సినిమా అయినప్పటికీ యాక్షన్ అంశాలు పుష్కలంగా దట్టించారట.
ఇక ఈ సినిమాలో శృంగారభరిత సన్నివేశాలకు కూడా ఎక్కడా కొదువ లేదని ట్రైలర్ చూస్తేనే అర్ధమైపోతుంది, పైగా ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ కూడా వచ్చింది.
అయితే చిత్ర బృందం మాత్రం ఏ సర్టిఫికెట్ రావడం పై ఎక్కడా చింతిస్తున్నట్టు కనిపించడం లేదట, పైగా దానిని గొప్పగానే భావిస్తున్నట్టు బాలీవుడ్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
పైగా సందీప్ రూపొందించిన రెండు సినిమాలు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ రెండిటికి కూడా ఏ కార్టిఫికెట్ వచ్చింది అప్పట్లో. ఇక ఈ సినిమా లో రణ్ బీర్ కపూర్ టైటిల్ కి తగ్గట్టుగానే బాగా అగ్రసివ్ లుక్ లో కనిపిస్తున్నాడు. తనని తండ్రిగా నిన్నటి తరం కధానాయకుడు అనిల్ కపూర్ నటించగా ధర్మేంద్ర తనయుడు బాబి డియోల్ మరో ముఖ్య పాత్ర పోషించాడు.
ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపై హిందీ తోపాటు తెలుగు కన్నడ లో ఎక్కువ క్రేజ్ నెలకొందని చెప్పాలి.
రష్మిక కన్నడ భామ కావడం, పైగా తెలుగు వారికి కూడా నటిగా దగ్గర అవ్వడం తోపాటు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పూర్తిగా తెలుగుదర్శకుడు అవ్వడం అని చెప్పొచ్చు.
అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఆ ఈవెంట్ కి దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ వచ్చి దర్శకుడు హీరోలైన సందీప్ రెడ్డి, రణబీర్ పై ఓ రేంజ్ లో ప్రశంశల జల్లు కురిపించారు. దాంతో సినిమాపై హైప్ తారాస్థాయికి చేరింది.
అందులోను రాజమౌళి డైరెక్టర్ సందీప్ ను ఆర్జీవీ తో పోల్చేశాడు. ఈ కారణాలన్నీ వెరసి సినిమా ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు అంచనా వేస్తున్నారు.