HOW TEMPLES ARE MAKING INDIA RICH? : దేవాలయాలు భారతదేశాన్ని ఎలా సంపన్నం చేస్తున్నాయి?
భారతదేశం ఎన్నో దేవాలయాలకు నిలయం. ఎన్నో మతాలకతీతంగా మన దేశంలో 500,000 దేవాలయాలు ఉన్నాయి. చారిత్రాత్మకంగా ఈ దేవాలయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.
మన భారత దేశంలో ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకంగా భావించే దేవాలయాలు ఉన్నాయి. వీటిని దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు వస్తారు.
యాత్రికులు ఇచ్చే విరాళాలు, బంగారం వెండి ఇతర రూపాలలో ఇచ్చే బహుమతులు ఇవన్నీ దేవాలయ ఆదాయాన్ని పెంచుతాయి.
ఈ పెరుగుదల కేవలం దేవాలయానిది మాత్రమే ఎందుకు అవుతుంది. ఆ దేవాలయం ఉన్న దేశానిది కూడా కదా.
భారతదేశంలో ఎన్నో ప్రత్యేకమైన చరిత్ర కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అలాగే ఎన్నో చిక్కుముడుల కథల దేవాలయాలు ఉన్నాయి.
ఇలాంటి దేవాలయాలు దర్శించుకోవడానికి పాశ్చాత్యులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అలాంటి అద్భుతమైన భారతదేశ దేవాలయాల జాబితా.
1. పద్మనాభస్వామి ఆలయం, కేరళ – 1,20,000 కోట్లు ;
భారతదేశంలోనే అత్యంత ధనిక ఆలయంగా పేరు పొందింది. ఇది కేరళలోని తిరువనంతపురంలో ఉంది.
500 BCల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయం శ్రీ మహా విష్ణువు కొలువుదీరిన ఆలయం.
ఎన్నో పురాతన విశేషాలను కలిగిన ఈ ఆలయకట్టడం ఎంతో ప్రత్యేకమైనది. అలాగే ఎన్నో గుప్తనిధులు కలిగిన గుడిగా ప్రసిద్ది చెందినది.
గుడిలోని ప్రతి గది ఓ నిగూడ రహస్యాన్ని దాచింది. ఈ గుడిలోని సొరంగాలు ఈ ఆలయానికి ఆసక్తి కలిగించే అంశం.
అయితే ఈ ఆలయంలోని నిధుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిన తర్వాత వినోద్ రాయ్ 2011 జులైలో 1,00,000కోట్ల ఆలయ నిధిని సమర్పించిన మొదటి నివేదిక తర్వాత సామాన్య ప్రజలకి ఈ గుప్త నిధి ఉందన్న విషయం తెలిసింది.
ఈ ఆలయంలో ఆరు భూగర్భనిధులు నిధులు ఉన్నాయి. ఆలయపూజారులు ఇచ్చిన లేబల్ ప్రకారం పురావస్తు శాస్త్రవేత్తలు2001 లోనే తమ అన్వేషణ మొదలు పెట్టారు.
ఈ అన్వేషణలో వాళ్ళు వెయ్యి సంవతరాల నాటి బంగారు నాణాలు, 1700ల నాటి 7 కిలోల బంగారు నాణాలు, నెపోలియన్ పాలన కాలం నాటి 18 నాణాలు, అత్యంత విలువైన రాళ్ళు నాణాల రూపంలో 1000 కిలోల బంగారాన్ని అలాగే ట్రింకెట్స్ తో పాటు పట్టు కట్టలతో చుట్టారు.
2.5 కిలోల, 9 అడుగుల బంగారు హారం, ఆభరణాలు, టన్ను బంగారంతో చేసిన బియ్యం, రత్నాలు, వజ్రాలు, పచ్చలతో అలంకరించిన అనేక పురాతన బుట్టలు, మట్టి కుండలు, రాగి కుండలు ఉంచబడ్డాయి.
బంగారు ఏనుగు విగ్రహం, మూడున్నర అడుగుల పొడవైన మహావిష్ణువు విగ్రహం, 1772 నాటి ముద్రతో కొనధరు సార్వభౌమాధికారులు ఉన్నారు.
ఇక్కడ ఇప్పటికీ తెరవని ప్రధాన ఖజానా గది ఉంది. ఆ గది తలుపు పై హెచ్చరికగా పాము, యక్షి గుర్తులు చెక్కబడి ఉంటాయి.
మార్తాండ వర్మ రాజు కాలంలో అత్యున్నత మత పెద్దలు నాగపాశ మంత్రంతో ఈ ఆలయ నిధిని కట్టుదిట్టం చేశారు, అది తెరవడం కూడా వాళ్ళలో వారికి మాత్రమే సాధ్యం.
ఆ ఖజానాలో ప్రపంచంలోని చాలా సమస్యలు పరిష్కరించగలిగే నిధులున్నాయని నమ్ముతారు.
కానీ అవి శపానికి గురయి ఉన్నాయని, వాటిని తియ్యకూడదని అంటారు.ఏదేమైనా ఇది ప్రపంచం తెలుసుకోవాలనుకునే ఒక ఆసక్తికరమైన అంశం.
ఈ గుడిలో ఇప్పటివరకు దొరికిన సంపద మరియు ఆలయ పర్యటనలో వచ్చే ఆదాయం ఇవన్నీ దేశం సంపన్నంగా మారడానికి దోహదం చేసేవే.
2.తిరుపతి బాలాజీ, ఆంద్రప్రదేశ్, వార్షిక విరాళం – 650 కోట్లు;
శ్రీ వేంకటేశ్వర దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద యాత్ర స్థలాలలో, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలలో ఒకటి.
ప్రభుత్వం వెల్లడించిన నివేధికల ప్రకారం, ప్రతిరోజూ సగటున 30,000 మంది సందర్శకులు దాదాపు USD 6 మిలియన్లు విరాళంగా ఇస్తున్నారు.
ఈ లెక్కన నెలకి ఈ విరాళాల విలువ 180 మిలియన్ల వరకు వెళ్తుంది. 52 టన్నుల బంగారు ఆభరణాలు కలిగిన సంపన్న గుడి ఇది, ప్రతి ఏడాది యాత్రికుల విరాళాల నుండి 3000కిలోల బంగారాన్ని పొందుతుంది.
ఆ బంగారం ఇపుడు జాతీయ బ్యాంక్ లలో బంగారు నిల్వలుగా మారుస్తుంది. తిరుపతి 2023-24 వార్షిక ఆదాయ అంచనా 4,411.68 కోట్లు.
ఇక్కడ తయారు చేసే లడ్డు ప్రసాదం ఏటా 11 మిలియన్ల ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఆలయ ప్రధాన భగవంతుడైన వేంకటేశ్వరుడే 100 కిలోల బంగారంతో కప్పబడి ఉన్నాడు.
3. శ్రీ వైష్ణోదేవి ఆలయం, జమ్ము – 500 కోట్లు ;
భారతదేశంలో అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా ఈ శ్రీ వైష్ణోదేవి ఆలయం గుర్తించబడినది.
మిలియన్ సంవత్సరాల పురాతన గుహ లోపల 5,200 అడుగుల ఎత్తులో, కత్రా అనే ప్రదేశం నుంచి 14 కి.మీ దూరంలో ఉంది, ప్రతి సంవత్సరం ఈ దేవాలయానికి 10 మిలియన్ లకు పైగా పర్యాటకులు వస్తూ ఉంటారు.
ఇక్కడ 1.2 టన్నుల బంగారం ఉంది. 5 సంవత్సరాల కాలంలో మరో వంద కిలోల బంగారం కూడా విరాళంగా వచ్చింది. ఈ ఆలయ సంవత్సర ఆదాయం 500 కోట్లు.
4. షిర్డి సాయి బాబా, నాసిక్ – 320 కోట్లు ;
షిర్డి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఆలయం. ఈ ఆలయానికి ఇప్పటికే 2000 కోట్లకు పైగా వసూళ్లు జరిగాయని సమాచారం.
ఈ ఆలయం 380కేజీల బంగారం, 4400 కేజీలవెండితో పాటు దాదాపు 1800 కోట్లు నగదు రూపంలో ఉన్నట్టు సమాచారం. ప్రధాన సాయిబాబా విగ్రహం 100 మిలియన్ల విలువ చేస్తుంది.
5. గురువాయూర్ ఆలయం – 2500 కోట్లు ;
ఈ పుణ్యక్షేత్రంలో దాదాపు 33.5 మీటర్ల ఎత్తులో బంగారు పూత పూసిన ఒక ద్వాజస్తంబం ఉంటుంది. ఈ దేవాలయ ఆస్తుల విలువ 2500 కోట్లు.
ఈ దేవాలయ బాంకు డెపోజిట్లు 1737 కోట్లు. అలాగే 271 ఎకరాలు ఉన్నాయని అంచనా.
6. గోల్డెన్ టెంపుల్, అమృత్ సర్ – 500 కోట్లు ;
ఈ స్వర్ణదేవాలయాన్ని గురురామ్ దశ జి 1574 లో స్థాపించారు. ఈ గోల్డెన్ టెంపుల్ పెరుకి తగ్గట్లుగానే బంగారు తాపడంతో నిర్మించబడినది.
500 ల కిలోల స్వచ్చమైన బంగారం తో పూత పూసిన గుడి. ఇది సిక్కుల యొక్క పవిత్ర మందిరం.
ఈ దేవాలయ వార్షికాదాయం 500 కోట్లు. దీనిని శ్రీ హారమందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి 7 కోట్ల కానుకలు వారంలోపే వస్తాయి.
7. శబరిమల ఆలయం, కేరళ, 245 కోట్లు ;
కేరళలో రెండవ ధనిక దేవాలయం ఇది పుంపా నది ఒడ్డున ఉంది. దీని నిర్మాణానికే USD 150 మిలియన్లు ఖర్చు చేశారు.
ప్రతీ సంవత్సరం 30 మిలియన్లకు పైగా యాత్రికులు దర్శనానికి వస్తారు. ఈ యాత్ర ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద యాత్ర.
ఇక్కడికి 12 నుంచి 50 సంవత్సరాల మద్య వయసున్న స్త్రీలు 28 సెప్టెంబర్ 2018 వరకు నిషేదించబడ్డారని కూడా మనకు తెలుసు.
అయితే ఇపుడు ఈ నిషేదం లేకపోయినప్పటికి స్త్రీలు అక్కడి ఆచారానికి గౌరవం ఇచ్చి వెళ్ళడం లేదు.
ఇది 15 కిలోల బంగారాన్ని విరాళంగా సేకరించింది. ఈ దేవాలయ వార్షికాదాయం 150 కోట్లకు పైగా లెక్కించబడుతుంది.
8. సిద్దివినాయక దేవాలయం, ముంబై – 125 కోట్లు ;
ప్రతి రోజు 25 వేల నుంచి 2 లక్షల మంది దర్శించుకునే ఈ సిద్దివినాయక దేవాలయం ప్రతి సంవత్సరం 125 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది.
ఇప్పటివరకు 158 కిలోల బంగారు కానుకలు సేకరించింది వీటి విలువ దాదాపు USD 67 మిలియన్లు.
ఈ దేవాలయానికి ప్రపంచవ్యాప్త సందర్శకులు ఉన్నారు.
9. మీనాక్షి దేవాలయం, మదురై – 6 కోట్లు ;
ఈ దేవాలయంలో పదిరోజుల పాటు జరిగే వార్షిక మీనాక్షీ తిరుకల్యాణోత్సవంలో చాలా ప్రదేశాల నుంచి భక్తులు వస్తారు.
ఆ సమయం లో ప్రతి రోజు వచ్చే వారి సంఖ్య దాదాపు 20000 పైనే ఉంటుంది.
దాదాపు 60 కోట్ల విలువైన నగదు, విలువైన లోహాలు, రాళ్ళు, బంగారం, వజ్రాలు సేకరిస్తుంది.
10. శ్రీ పూరీ జగన్నాథ్ దేవాలయం, పూరి – 150 కోట్లు ;
ఈ ఆలయం ఒడిశాలో ఉంది. ఈ ఆలయంలో పూజించే మహావిష్ణువు రూపమైన జగన్నాథునికి 30,000 ఎకరాల భూమిని పేరుతో రిజిస్టర్ చేయబడింది .
ఈ గుడిలో దేవతలను ఒక ఉత్సవం రోజు 209 కిలోల బంగారం తో అలంకరించారు.
ఈ దేవాలయానికి 30,000 లకు పైగా భక్తులు వస్తారు, పండుగ రోజులలో అయితే ఈ సంఖ్య 70,000 లకు పెరుగుతుంది.
11. అమర్నాధ్ దేవాలయం ;
హిందూ దేవాలయం ఆయన అమర్నాధ్ దేవాలయం జమ్ము మరియు కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో ఉంది. ఈ గుహ మందిరానికి 2.39 లక్షల యాత్రికులు ఉన్నారు.
12. కాశీ విశ్వనాథ దేవాలయం – 6 కోట్లు ;
కాశీ విశ్వనాథ దేవాలయం వారణాసిలో ఉంది. ఈ దేవాలయ ప్రధాన దైవం శివుడు. ఆ నగరాన్ని శివుని నగరం అని కూడా పిలుస్తారు.
ఆలయగోపురం పైన 800 కిలోల బంగారంతో తాపడం చేశారు. ఈ ఆలయ వార్షికాదాయం 6 కోట్లు.
13. సోమనాథ్ ఆలయం , సోమనాథ్ – 13 కోట్లు ;
ఈ సోమనాథాలయం గుజరాత్ లో ఉంది. ఇది పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొదటిదైన శివాలయం.
భారత దేశంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పేరు పొందిన దేవాలయం ఇది. 1700 ఎకరాల భూమి కలిగి ఉంది.
14. మహాలక్ష్మి దేవాలయం, కొల్లాపూర్ – 14 కోట్లు ;
శక్తి యొక్క ఆరు నివాసాలలో ఒకటైన మహాలక్ష్మి దేవాలయన్ని చాళుక్యులు ఏడవ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం విలువ 14 కోట్లు.
ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.
ఒక్కొక్క దేవాలయం యొక్క ఆదాయం చూసుకుంటే భారత దేశపు అభివృద్ది వెనకాల దేవాలయాల పాత్ర ఎంత వరకు ఉందో అర్దం అవుతుంది.