Apply for Ration card రేషన్ కార్డు :
రేషన్ కార్డులు రెండు రకాలని అందరికీ తెలిసిందే, దానిలో ఒకటి గులాబి రేషన్ కార్డ్, మరొకటి తెల్ల రేషన్ కార్డు.
పింక్ రేషన్ కార్డు – ఇది కుటుంబంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవాళ్ళు, కానీ దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వ్యక్తులకోసం.
తెల్ల రేషన్ కార్డు – దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళు ఈ తెల్ల రేషన్ కార్డు కి అర్హులు.
పింక్ రేషన్ కార్డు తెలంగాణ పౌరులకు గృహ, విద్య, వైద్య మరియు అనేక స్కాలర్‌షిప్ లతో సహా అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది.
తక్కువ ధరలో ఆహారపదార్థాలని అందిస్తుంది. తెల్ల రేషన్ కార్డు దారులతో పాటు ఈ పింక్ రేషన్ కార్డు వారికి కూడా సహాయం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఇక అప్లై చేసేందుకు దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు గులాబీ రేషన్ కార్డులకు అప్లై చేసేందుకు అర్హులని , అయితే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని గమనించడం ముఖ్యం.
రేషన్ కార్డు ధరఖాస్తుకు అర్హత:
తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారై ఉండాలి.దరఖాస్తుదారు దారిద్య్రరేఖకు ఎగువన ఉండాలి.
ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయ పరిమితికి అర్హత సాధించాలి
ధరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
- ఆధార్ కార్డ్
- ఆదాయ దృవీకరణ
- కుల ధృవీకరణ పత్రం
- పాన్ కార్డ్
- పాత రేషన్ కార్డు
- చిరునామా ప్రూఫ్ సర్టిఫికేట్
- మీ కుటుంబం యొక్క మొబైల్ నంబర్
- ఇమెయిల్ ID
- పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు