Artificial intelligence: ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ తో ఎంత జాగ్రత్త గా ఉండాలంటే..?

Add a heading 2023 12 13T130108.623 Artificial intelligence: ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ తో ఎంత జాగ్రత్త గా ఉండాలంటే..?

Artificial intelligence: ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ తో ఎంత జాగ్రత్త గా ఉండాలంటే...?

కాలంతో పాటు ప్రపంచం మారిపోతుంది. పరిజ్ఞానం పెరిగే కొద్దీ.. ప్రపంచం ప్రపంచం వేగంగా మన చుట్టూ పెరిగిపోతుంది.

కానీ, పెరుగుతున్న టెక్నాలజీతో లాభాలు ఉన్నాయి అంతకంటే ఎక్కువగా నష్టాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొత్త గా అడుగుపెట్టిన ఆర్టిఫిషియల్

ఇంటెలిజెన్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ..ఉగ్రవాదులు ఈ చేతుల్లో కృత్రిమ మేధను ఉపయోగించడం మొదలు పడితే ప్రపంచానికి పెద్ద ప్రమాదం అని ప్రధానమంత్రి హెచ్చరించారు..

ఈ టెక్నాలజీని ఉపయోగించి మానవ రహిత దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇదే పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

వివిధ అంతర్జాతీయ సమస్యల కోసం ఒప్పందాలు, ప్రోటోకాల్‌లు ఉన్నట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైతిక ఉపయోగం కోసం గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని ఆయన సూచించారు.

దిల్లీలో నిర్వహించిన గ్లోబల్ పార్టనర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌లో మోదీ ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 21వ శతాబ్దంలో అభివృద్ధికి అతిపెద్ద సాధనంగా మారుతుందని,

నాశనం చేయడంలోనూ అంతే శక్తివంతంగా ఉంటుందని ప్రధాని హెచ్చరించారు.అయితే, ఈకృత్రిమ మేధ ప్రస్తుత, భవిష్యత్తు తరాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోందని, మనం చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలని తెలిపారు.

ప్రపంచాన్ని ఏఐ చీకటి కోణాలలోకి నెట్టే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉన్నాయని, తెలిపారు. దీని సవాళ్లను ఎదుర్కొని ప్రపంచాన్ని రక్షించడంలో ముందుండాలని పిలుపునిచ్చారు.

కృత్రిమమేధతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదే స్థాయిలో నష్టాలు కూడా ఉండటం దురదృష్టకరం. 21వ శతాబ్దంలో మానవజాతికి సాయం చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఓ అద్భుతమైన సాంకేతికతే కానీ, అది మనల్ని నాశనం చేయడంలోనూ కీలక పాత్ర పోషించగలదు.

అందుకే, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఏఐ అభివృద్ధికి భారత్ ఎంతగానో కృషి చేస్తుందని,
ఏఐని సరైన పద్ధతిలో వినియోగించకపోతే ఇటీవల సినిమామా నటి ఫొటోల విషయంలో ఈ డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ఎన్నో సమస్యలను సృష్టింంచింది.

కృత్రిమ మేధ అభివృద్ధిని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వాటి ఫలితాలను ప్రధానంగా వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో వినియోగించేందుకు ప్రయత్నాలు చేస్తోందని మోదీ తెలిపారు.

G20 సదస్సుకు అధ్యక్షత వహించిన సమయంలో AI కోసం బాధ్యతాయుతమైన, మానవ-కేంద్రీకృత పాలన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని భారత్‌ ప్రతిపాదించిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు

Leave a Comment