How to check YSR Aasara Scheme Funds : ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లోని స్వయం సహాయక సంఘాలకు జగన్ మోహన్ రెడ్డి సర్కారు(Jagan Mohan Reddy Government) రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తోంది.
ఈ ప్రక్రియను వైసీపీ సాగారు 2019 నుండి అవలంబిస్తూనే ఉంది. ఇప్పటివరకు వరుసగా మూడు సంవత్సరాలు నిధులు విడుదల చేసిన అధికార వైసీపీ(YCP) ఇప్పుడు నాలుగో విడత నిధులను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది.
రాష్ట్రం లోని డ్వాక్రా మహిళలు, ఎన్.హెచ్.సి మహిళా బృందాల(NHC Women Groups) వారు బ్యాంకులలో తీసుకున్న రుణాలను మాఫీ చేసే విధానం ఇది.
ఎంతమంది లబ్ది పొందారంటే : How Meany People Got Benefit
ఇక దీనిని వైఎస్ఆర్ ఆసరా పథకం(YSR Asara Scheme) అని పిలుస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం(Anantapuram) జిల్లా ఉరవకొండ(Uravakonda) లో జనవరి 23వ తేదీన నాలుగో విడతకు సంబంధించిన నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు.
7,98,395 SHG గ్రూపుల్లోని 78,94,169 మంది మహిళలకు లబ్ది చేకూరింది. ఈ ఆసరా పధకం తాలూకు నిధులు జనవరి 23 వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కొనసాగనుంది.
How To Check Status : స్థితిని ఎలా తనిఖీ చేయాలి
#step 1
అయితే ఈ వై.ఎస్.ఆర్ ఆసరా తాలూకు నిధులు మహిళల అకౌంట్ లో జమ అయ్యాయా లేదా అన్న విషయం ఎలా తెలుసుకోవాలి అన్నది చూద్దాం, ఆసరా పేమెంట్ చెక్ చేసుకోవడానికి వెబ్ సైట్ లో కి వెళ్లి పేమెంట్ స్టేటస్ అని ఉన్న దానిపై క్లిక్ చేయాలి.
#step 2
ఆతరవాత ఈ పధకానికి సంబంధించి లోన్ పేమెంట్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలి. అందుకోసం అక్కడ ఉన్న లింక్ ను క్లిక్ చేయాలి.
#step 3
లబ్ధిదారులు స్టేటస్ ను చెక్ చేయడానికి ముందుగా వారి జిల్లా, మండలం, గ్రామాన్ని ఎంచుకోవాలి.
#Step 4
అప్పుడు ఓపెన్ లోన్ చూపిస్తుంది, అక్కడ 2019 ఏప్రియల్ 11 నాటికి లోన్ జారీ చేసిన తేదీ అలాగే ఆ తేదీ లోపు చెల్లించాల్సిన మొత్తానికి మద్దతు ఉంటుంది.
ఈ పధకానికి అసలైన లబ్దిదారులెవరు : Eligibilities For This Scheme
అసలు ఈ పధకానికి అర్హులు ఎవరు అన్నది ఒక్కసారి చుస్తే ఇందులో కేవలం మహిళలు మాత్రమే లబ్ది పొందుతారు, అందులోను వారు ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వారే అయి ఉండాలి.
అంతే కాకుండా డ్వాక్రా వంటి స్వయం సహాయ బృందాల్లో మెంబర్ అయి ఉండాలి. అంతే కాకుండా 11 ఏప్రియల్ 2019 నాటికి వారికి బ్యాంకు లో చెల్లించాల్సిన బకాయి ఋణం ఉండాలి.
అప్పుడే వారు ఈ పధకానికి అర్హులు అవుతారు.