How to stop Pop up ads on Phone?: మనలో చాల మంది స్మార్ట్ ఫోన్ యూస్(Adds In Smart Phone) చేసేవారు ఉన్నారు. కాలేజీ పిల్లల నుండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరికి ఈ స్మార్ట్ ఫోన్ చాలా అవసరంగా మారిపోయింది.
ఉన్న చోటి నుండి కదలకుండా సినిమా టికెట్స్ బుక్(Online Tiketing) చేసుకునే దగ్గరి నుండి, ఉన్నత చదువులకు సంబంధించి అనేక విషయాల గురించి మొబైల్ తోనే పని పూర్తి చేసుకుంటాము,
ఇక బ్యాంకింగ్(Online Banking) రంగం విషయానికి వస్తే ఎవరికైనా నగదు పంపించాలి అంటే బ్యాంకుకి వెళ్లి డిపాజిట్ స్లిప్ ఫీల్ చేసి క్యూ లైన్ లో నిలబడి మన వంతు వచ్చేవరకు వెయిట్ చేయక తప్పేది కాదు.
కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటె చాలు నెట్ బ్యాంకింగ్ తో క్షణాల్లో పనైపోతుంది. అయితే ఇక్కడే ఒక చికొచ్చి పడింది. మొబైల్ వాడే సమయంలో అనవసరమైన యాడ్స్ తో చాలామంది విసిగిపోతున్నారు.
మొబైల్ యాడ్స్ వల్ల బెడదా ? Are you worried about mobile ads?
మొబైల్ లో మన పని చేసుకుంటూ పోతుండగా సడన్ గా కనిపించే ఈ యాడ్స్ మన దృష్టిని ఇట్టె మరల్చేస్తాయి. దీంతో అసలు పని మర్చిపోయి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అనేక మంది.
కొందరికైతే అవి యాడ్స్ అని తెలియదు పాపం, అక్కడ అడిగే వివరాలన్నీ సమర్పించేస్తుంటారు. దాని వల్ల జేబుకు చిల్లు పడి లబోదిబోమన్న వారు కూడా లేకపోలేదు.
అసలు ఇలా మోసపోవడానికి మూలమైన యాడ్స్ నుండి విముక్తి పొందే వీలు లేదా, మన మొబైల్ లో ఈ యాడ్స్ రాకుండా చేసుకునే మార్గం ఉంటె బాగుండు అని అనుకుంటున్నారా ? అయితే ఈ వీడియో మీకోసమే..
యాడ్స్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి : Do this to avoid ads
యాపిల్ ఫోన్లకి(Apple Mobile) అసలు ఈ యాడ్స్ బెడద అనేదే ఉండదు, ఆ విషయం యాపిల్ ఫోన్ వాడేవారందికీ తెలుసు. మరి యాండ్రాయిడ్ ఫోన్(Android Mobile) లో యాడ్స్ ను కట్టడి చేయడం ఎలా అంటే..
ముందుగా మొబైల్ సెట్టింగ్స్(Sttings) ఓపెన్ చేయాలి, అక్కడ గూగుల్(Google) పై క్లిక్ చేయాలి. అక్కడ మేనేజ్ యువర్ గూగుల్ (9Message Your Google) అనే అప్షన్ ఉంటుంది,
దానిమీద టాప్ చేయండి. అప్పుడు మీకు డేటా అండ్ ప్రైవసీ(Data And Privacy) కి సంబంధించిన అప్షన్ చూపెడుతుంది.
దానిని నెమ్మదిగా స్క్రోల్ చేస్తూ ఉంటె పర్సనలైజెడ్ యాడ్స్(Personalized Adds) అని అప్షన్ ఉంటుంది. దానిని యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు మీ మొబైల్ లో ఏవేం ట్రాక్ అవుతున్నాయి అనే విషయం తెలుస్తుంది.
అలా మీకు వేటి వల్ల యాడ్స్ వస్తున్నాయి అనేది తెలిసిపోతుంది. ఇక పెర్సనలైజ్డ్ యాడ్స్ లో మీకు మై యాడ్స్ సెంటర్(Adds Center) అనే అప్షన్ ఉంటుంది,
దానిని గనుక మీరు క్లిక్ చేస్తే మీ పర్సనలైజ్డ్ యాడ్స్ లో టోగుల్ (Togle) అనేది తెరుచుకుంటుంది. ఆలా ఓపెన్ అయి ఉన్న టోగుల్ ను ఆఫ్ చేయాలి.
ఇలా చేస్తే మీ సమయం డబ్బు ఆదా చేసుకోవచ్చు : Doing this – So You can save you time and money
ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక మరలా మీరు గూగుల్ సెట్టింగ్స్(Google Settings) వెళ్లి డిలీట్ అడ్వర్టైజింగ్(Delete Advertisements) అని ఒక ఐడి ఉంటుంది,
అప్పుడు దానిని క్లిక్ చేయాలి. ఆలా చేస్తే మీకు యాడ్స్ రావడం ఆగిపోతాయి. ఆతరువాత నుండి మీరు మీ మొబైల్ లో ఏ పని అయితే మొదలు పెడతారో ఆ పనినే పూర్తి చేసుకుంటారు, పైగా టైం వేస్ట్, మనీ వేస్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది.