తెలంగాణా లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్ధిక సంస్కరణలకు తెర లేపింది. దీనికి కారణం అవసరం లేనిచోట ఉద్యోగుల నియామకాలు వారికి భారీ వేతనాలు ఇతర అలవెన్సులు అంటూ భారీ ఆర్ధిక మోసాలకు పాల్పడింది గత BRS ప్రభుత్వం అని ఆయన విమర్శించారు. రిటైర్డ్ అధికారులకు సలహాదారులు గా నియమించి వారికి భారీ గా వేతనాలు ఇచ్చి ఆర్ధిక సమస్యలని తీసుకొచ్చారని దీని వల్ల అదనంగా ఆర్ధక భారం ఏర్పడుతోంది.
ఈ నియామకాల వల్ల ప్రభుత్వానికి ఒనగూరేది ఎం లేదని అందు వల్ల అలాంటి పోస్ట్ లను రద్దు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అంతే కాకుండా చాల చోట్ల దాదాపు అన్ని శాఖ ల లోను విపరీతమైన దుబారా అవుతోందని ఆర్ధిక నిపుణులు మాకు నివేదికలు ఇచ్చారని దీనికి అనుగుణంగా నే కొన్న సంస్కరణలు చేపట్టాలని అనుకున్నాం అని ప్రకటించారు. దుబార జరిగే చోట వాటిని పూర్తి గా రద్దు చెయ్యడం కాని లేదా ఏ మేరకు అవసరం ఉందొ అంత వరకు మాత్రమే వాడుకుంటామని ఆయన చెప్పారు.
ఈ ఆర్ధిక సంస్కరణలు తమ కార్యాలయం నుండే ప్రారంభించారు రేవంత్ రెడ్డి. మంత్రుల పేషీ లోని పర్సనల్ అసిస్టంట్, పర్సనల్ సెక్రటరీ వంటి కేటగిరి గల వారికి భారీ గా వేతనాలు తగ్గించారు. వాహనాల విషయం లో కూడా అవసరం ఉన్నంతమేరకు వాడాలని ఆయన సూచించారు. ఒక అధికారి రెండు మూడు శాఖల నిర్వహణకు మూడు వాహనాలను ఉపయోగించరాదని మూడు శాఖల లోని ఎదో ఒక వాహనం మాత్రమే వాడాలని, మిగినిలి ఇతర శాఖ వాహనాలను ఆ శాఖకు అప్పగించాలని ఆదేశించారు.
అలాగే ఇతర అలవెన్సు ల విషయం లో కూడా అన్ని లోతుగా పరీక్షించి అప్పుడు బిల్లులు మంజూరు చెయ్యాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలలోను దుబారాను అడుపుచేయాల్సింది గా అన్ని శాఖల అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఎక్కడైనా తప్పు జరిగితే కఠిన నిర్ణయం తో పాటు చర్యలు కుడా తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.