Amazon Prime: అమెజాన్ ప్రైమ్ ఇచ్చే ప్లాన్స్ పై భారీ డిస్కౌంట్.
ఓటీటీ లకు అలవాటుపడిపోయిన లవర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది..ప్రముఖ అమెజాన్ సంస్థ.అదేవిధంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు
ఎన్నో అద్భుతమైన ప్రీమియం ప్లాన్స్ ను అందించడం లో పోటీ పడుతున్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ ఆఫర్స్ ను, డిస్కౌంట్స్‌ను కూడా అందిస్తున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కామర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అమెజాన్ సంస్థ 4 రకాల ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్స్ ను అందిస్తోంది. అవి:
- మంత్లీ ప్రైమ్ ప్లాన్ అంటే ఒక నెలకోసం తీసుకునేవారికి 299 రూపాయలను
- క్వార్టర్లీ ప్రైమ్ ప్లాన్ అంటే 3 నెలల కోసం 599రూపాయలు
- యాన్యువల్ ప్రైమ్ ప్లాన్ అంటే 12 నెలలకు 1499 రూపాయలు
- యాన్యువల్ ప్రైమ్ లైట్ ప్లాన్ 12 నెలల కోసం తీసుకునే వారికి 799 రూపాయలను ప్రకటించినట్టు ఆ సంస్థ తెలిపింది.
ఈ ధరలు ఇలా ఉండగా అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్షిప్ ప్లాన్ ధరను ఏకంగా 200 రూపాయల వరకు తగ్గించింది.
దీనితో 999 రూపాయలు విలువైన అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు కేవలం 799 రూపాయలకే లభిస్తోందని ఆ సంస్థ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్షిప్ ఉన్న వారికి పలు బెనిఫిట్స్ లభిస్తాయి.
నెట్ ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ తీసుకునే వారికి ఆ సంస్థ:
నెలవారీ చందాను 149 రూపాయలను, ఈ ప్లాన్ తీసుకున్నవారు 480p రిజల్యూషన్‌తో ఫోన్, ట్యాబ్లెట్స్‌లో వీడియోలను చూసే అవకాశాన్ని కల్పించింది.
అలాగే, నెట్ ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ లో
నెలవారీ చందాను 199 రూపాయలకే ప్రకటించింది. ఈ ప్లాన్ ను తీసుకున్నవారు 720p రిజల్యూషన్‌తో ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీల్లో వీడియోలను చూడవచ్చు.
అలాగే, నెట్ ఫ్లిక్స్ స్టాండెడ్ ప్లాన్నెలవారీ చందాను 499 రూపాయలకే ఇస్తుంది. ఈ ప్లాన్ తీసుకున్నవారు 1080p రిజల్యూషన్‌తో ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీల్లో నెట్‌ఫ్లిక్స్ వీడియో కంటెంట్‌ను చూసి, ఆనందం పోదవచ్చ. ఇంకా, ఈ సంస్థ నెట్ ఫ్లిక్స్ ప్రీమియం నెలవారి చందా ప్లాన్
649 రూపాయలగా ఉంటుందని తెలిపింది. ఈ ప్లాన్ ను తీసుకున్నవారు 4K+HDR రిజల్యూషన్‌తో ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీల్లో నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం కంటెంట్‌ను హ్యాపీ గా చూడవచ్చు.
మరో ప్రముఖ సంస్థ
డిస్నీ-హాట్‌స్టార్. ఇది కూడా రెండు రకాల ప్లాన్లను అందిస్తోంది:
- సూపర్ ప్లాన్ : దీనిలో
సంవత్సర చందాను 899 రూపాయలకు అందిస్తుంది. దీనిలో 1080p ఫుల్ హెచ్డీ క్వాలిటీతో వీడియోలను చూడవచ్చు. - ప్రీమియం ప్లాన్ :దీనిని తీసుకున్నవారికి సంవత్సర చందాను 1499 రూపాయలకే అందిస్తుంది. అయితే, 299 రూపాయలకే నెలవారీ డిస్నీ హాట్‌స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా తీసుకునే అవకాశం కల్పించింది. దీనిలో 4కె క్వాలిటీతో మూవీస్, లైవ్ స్పోర్ట్స్, టీవీ షోలను చూడవచ్చు.
ఈ డిస్నీ హాట్‌స్టార్ మెంబర్షిప్ తీసుకున్నవారు, సూపర్, ప్రీమియం కంటెంట్‌ను సెల్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్‌లో కూడా క్వాలిటీ తో చూడొచ్చు.