China Earth Quake 118 killed: చైనా లో భారీ భూకంపం..వంద దాటిన మరణాలు..సంఖ్యలో క్షతగాత్రులు.

Huge earthquake in China.. More than 100 deaths.. Number of injured.

China Earth Quake 118 killed: చైనా లో భారీ భూకంపం..వంద దాటిన మరణాలు..వందల సంఖ్యలో క్షతగాత్రులు..

China దేశంలో చోటుచేసుకున్న భారీ Earth Quake మృత్యు ఘోషను మిగిల్చింది. డిసెంబర్ 18వ తేదీ రాత్రి సంభవించిన ఈ విధ్వంశకర భూకంపంతో అనేక మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయాల పాలయ్యారు.

ఈ Earth Quake వాయవ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 5.9గా రికార్డయినట్టు అక్కడి అధికారుల ద్వారా తెలుస్తోంది.

ఈ భీకరమైన భూకంపం తాకిడికి 111 మంది మృత్యు వాత పడినట్టు సమాచారం అందుతోంది. ఇక గాయపడిన వారి సంఖ్య వందల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు చైనాలోని అధికారిక మీడియాలో ప్రసారమైన కధనాల ద్వారానే బయటి ప్రపంచానికి తెలుస్తోంది.

Several buildings collapsed :

భూకంపం వల్ల గన్సు ప్రావిన్స్‌ ప్రాంతంలో భారీ కట్టడాలు, గృహ సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్సులు నేలకు ఒరగడంతో రక్షణ సిబ్బంది ఆయా భవనాల శిథిలాలను తొలగిస్తున్నారట, డిసెంబర్ 18 రాత్రి భూకంపం సంభవించగా

డిసెంబర్ 19 ఉదయం నుండే అక్కడి రక్షణ సిబ్బంది సహాయక చర్యలను మొదలు పెట్టారట. గన్సు ప్రావిన్స్‌లో భూకంప తీవ్రత అధికంగా ఉందని అక్కడి యంత్రాంగం ద్వారా తెలుస్తోంది,

దీనివల్ల సుమారు 100 మంది వరకు మరణించినట్టుగా ప్రాంతీయ Earth Quake సహాయ కేంద్రం వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక గన్సు ప్రావిన్స్‌ కి సమీపంలోనే ఉండే కింగ్‌హై ప్రావిన్స్‌లోని కూడా భూకంపం తీవ్రత అధికంగా ఉన్నట్టు వెల్లడైంది.

కింగ్‌హై ప్రావిన్స్‌లోని హైడాంగ్ నగరంలో భూకంపం ధాటికి 11 మంది శిధిలాల క్రింద పడి ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. ఈ నగరంలో 100 మందికిపైగా భూకంప క్షతగాత్రులు ఉన్నట్టు అక్కడి అధికారుల లెక్కల ప్రకారం వెల్లడవుతోంది.

Jinping responded on earth quake :

సాధారణంగా భూకంపం వచ్చిందంటే ఎంతటి దృఢమైన కట్టడాలకైనా బీటలు వరాల్సిందే, కొన్ని భవనాలైతే చూస్తుండగానే నేలమట్టమైపోతాయి.

ఈ భూకంపం కారణంగా పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయని, అధిక సంఖ్యలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది అని China లోని కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇక ముఖ్యంగా భూకంపం సంభవించిన సమయంలో అయితే ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు.

Earth Quake ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయ చర్యలు అందించాలని, China అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రుతి వైపరీత్యం ఎంతో విచారకరమని అయన స్పందించారు.

Earth Quake నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డవారిని సహాయ శిబిరాలకు తరలించాలని పేర్కొన్నారు, వారి ఆస్తులకు కూడా రక్షణ కల్పించాలని అధికారులకు సూచించారు.

US geological survey :

18వ తేదీ రాత్రి సంభవించిన 5.9 తీవ్రత గల ఈ భూకంపం గురించి చుస్తే, దీని భూకంప కేంద్రం గన్సు ప్రావిన్స్ రాజధాని అయిన లాన్‌జౌకి నైరుతి దిశగా 100 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది,

కింగ్‌హై ప్రావిన్స్‌ సరిహద్దుకు సమీపంలో ఇది సంభవించినట్టు తమ నివేదిక లో పేర్కొంది. అయితే China లో భూకంపాలు తరచుగా సంభవిస్తూనే ఉన్నాయి.

ఇదే సంవత్సరం ఆగస్టు నెలలో కూడా ఒక భూకంపం సంభవించింది. ఈ భూకంపం తూర్పు China లో 5.4 తీవ్రతతో చోటుచేసుకుంది. అయితే ఆ భూకంపం వల్ల పెద్దగా ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, ఆస్తినష్టం మాత్రం అధికం గా చోటుచేసుకుంది.

Drastic Earth Quake 2008:

ఈ భూకంపం వల్ల పెద్ద పెద్ద భవనాలు కూలాయి. ఇక 2022 వ సంవత్సరం సెప్టెంబర్ లో కూడా భూకంపం సంభవించింది. సిచువాన్ ప్రావిన్స్‌లో ఆనాడు సంభవించిన భూకంపం తీవ్రత 6.6 గా రిక్టర్ స్కెలు పై నమోదైంది.

ఆ భూకంపం ధాటికి సుమారు 100 మంది ప్రాణాలు మట్టి పాలయ్యాయి. ఇక అన్నిటికన్నా తీవ్రమైన భూకంపం గా దీనిని చెప్పుకోవచ్చు 2008 సంవత్సరంలో ఏకంగా 7.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.

ఈ ఉపద్రవం ఆనాడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 5,335 మంది పాఠశాల విద్యార్థులు సహా మొత్తం 87,000 మందిని మృత్యువు బలితీసుకుంది.

తుఫానులు వస్తున్నాయంటే ముందుగానే అలర్ట్ అందించే సౌకర్యం ఉన్నట్టు ఈ భూకంపాలను కూడా ముందుగానే గుర్తించే ఏదైనా టెక్నాలని ఉంటె పెద్ద ఎత్తున జరుగుతున్నా ఈ ఆస్తి ప్రాణ నష్టాలను అరికట్టే సౌలభ్యం ఉంటుంది అంటున్నారు సామాన్య ప్రజలు.

Leave a Comment