Huge project for GMR Corporation – International Airport in Greece : ప్రఖ్యాత మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్ద GMR కు ఒక అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు భారీ ప్రాజెక్ట్ వచ్చింది. గ్రీస్ దేశం లో క్రీట్ అనే నగరం లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నట్లు GMR సంస్ద ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రీస్ దేశం లో మౌలిక రంగాల లో పెట్టుబడులు పెట్టడానికి భరత్ నుండి ఎన్నో సంస్దలు మా దేశానికి రావడం చాల సంతోషం గా ఉందని గ్రీస్ ప్రధాని కిరియో కోస్ మిత్సో టాకీస్ అన్నారు.
ఒక ప్రఖ్యాత బ్రాండ్ కలిగిన భారతీయ సంస్దలలో ఒకటైన GMR ఈ ప్రాజెక్ట్ చేపట్టడం అలాగే నిర్మించ దానికి ముందుకు రావడం మాకు చాలా సంతోషం గాఉందని ఆయన అన్నారు. ఇటీవల ఆయన భారత దేశానికి వచ్చినపుడు GMR సంస్ద ఢిల్లీ లో నిర్మించిన ఎయిర్ పోర్ట్ ను నిన్న సాయంత్రం సందర్శించారు. అక్కడ ప్రయాణికుల కోసం కల్పించిన సకల సౌకర్యాలు చూసి అడిగి తెలుసుకుని ఇంత సౌకర్యవంతం గా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ను నిర్మించినందుకు ఆయనని గ్రీస్ ప్రధాని అభినందించారు
ఈ సందర్భం గా గ్రీస్ ప్రధాని మాట్లాడుతూ మా దేశం లో నిర్మించ బోయే విమానాశ్రయం చాల పెద్దదని ఆయన చెప్పారు. ఈ విమానాశ్రయం లో అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం తో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్దేలా ప్రణాలికలు చేసినందుకు చాల ఆనందం గా ఉందని ఆయన చెప్పారు.
భారత్ లో పర్యటిస్తున్న గ్రీస్ ప్రధాని డిల్లి విమానాశ్రయం సందర్శించడం మాకు ఆయనని కలవడం చాల సంతోషం గా ఉందని GMR సంస్ద చైర్మన్ G.M.రావు అన్నారు. GEK టేర్న సహకారంతో గ్రీస్ లో క్రీట్ ద్వీపం లో సకల సదుపాయాలతో పాటు అన్ని సౌకర్యాలు అలాగే లేటెస్ట్ టెక్నాలజీ తో ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నాం అని ఆయన చెప్పారు. ఇప్పటికే ఏధేన్స్ నగరం లో ఒక ఎయిర్ పోర్ట్ ఉందని దాని తర్వాత ఇది రెండో అతి పెద్దదని GM.రావు కొత్త ఎయిర్ పోర్ట్ గురించి వివరాలు చెప్పారు.