ఎలాన్ మస్క్ ” మెదడు చిప్ ” కల నిజమవుతున్న వేళ

website 6tvnews template 14 1 ఎలాన్ మస్క్ " మెదడు చిప్ " కల నిజమవుతున్న వేళ

ఇటీవల ఒక మనిషి మెదడు లో న్యురాలింక్ అనే సంస్ద ఒక చిప్ ని విజయవంతంగా అమర్చింది. ఇప్పుడు ఆ మనిషి కుడా పూర్తి గా కోలుకుంటున్నాడని, అతని ఆలోచనల ద్వార కంప్యూటర్ మౌస్ ను కంట్రోల్ చేయగల్గుతున్నట్లు స్టార్టప్ అధిపతి ఇలాన్ మస్క్ ఒక ప్రకటన విడుదల చేసారు. మెదడు లో చిప్ అమర్చిన వ్యక్తి పూర్తి గ కోలుకోవడమే కాకుండా తగిన పురోగతి కూడా కనిపిస్తోందని అయన చెప్పారు.

అతను కేవలం ఆలోచించడం ద్వారా స్క్రీన్ మెదడ మౌస్ కదిలించగలడని, అయితే ఇప్పుడు ఎంత వీలు అయితే అంత మౌస్ బటన్ క్లిక్ లను పొందడానికి న్యురాలింక్ ప్రయత్నం చేస్తోందని ఆయన చెప్పారు గత ఏడాది సెప్టెంబర్ లో హ్యూమన్ ట్రయల్ కోసం అనుమతి తీసుకున్న తర్వాత తమ సంస్ద గత నెలలో ఫస్ట్ టైం మనిషి మెదడు లో చిప్ ని సక్సెస్ ఫుల్ గా అమర్చింది.

14265031 musk chip ఎలాన్ మస్క్ " మెదడు చిప్ " కల నిజమవుతున్న వేళ

తాము ఎంచుకున్న వ్యక్తి మెదడు లో ఒక ప్రాంతం లో ఆపరేషన్ చేసి చిప్ పెట్టామని ఆయన చెప్పారు. తమ ప్రధాన ఉద్దేశ్యం మెదడు లో చిప్ అమర్చడం వల్ల తన ఆలోచనలు ద్వార కంప్యూటర్ కర్సర్ లేదా కీబోర్డ్ ను నియంత్రించగల్గెలా చేయడమే అని చెప్పారు. మా ప్రయత్నం వెనకాల ఇంకో ఆలోచన ఉందని మనిషి నాడీ సమస్యలు తోను, వెన్నుపూస కు దెబ్బలు తగలడం తర్వాత లేదా పక్షవాతం వల్ల కాళ్ళు చేతులు పనిచేయక పోవడం, చచ్చు బడ్డ రోగులలో ఈ చిప్ అమర్చడం ద్వారా వారిలో కదలికలు వచ్చేల చెయ్యడానికి వీలు అవుతుందని అనుకుంటున్నామని ఆయన చెప్పారు.

అంతే కాకుండా డిమేన్షియ, అల్హిమర్స్, పార్కిన్ సన్స్ వ్యాధి ఉన్నవారు, మానసిక సమస్యలకు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్లకు ఇది ఉపయోగపడవచ్చు. ఇలాన్ మస్క్ అనేక సార్లు తన కల గురుంచి చెప్పారు అదే మనిషి మెదడు లో చిప్ అమర్చడం. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో రోజులనుండి ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. చివరకు మా కృషి ఫలితం గా దానికి కావలసిన అనుమతులు తీసుకుని ఒక మనిషిని ఎంచుకుని ఆ వ్యక్తి మెదడు లో చిప్ అమర్చడం జరిగిందని చెప్పారు.

ఇది తమను సక్సెస్ వైపు గా నడిపిస్తోందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందని ఆశక్తి గా ఎదురుచూస్తున్నాం అని ఆయన చెప్పారు.

Leave a Comment