Hyderabad: క్వాలిటీ ఆఫ్ లివింగ్ లో హైదరాబాద్ టాప్.

Add a heading 2023 12 13T155354.086 Hyderabad: క్వాలిటీ ఆఫ్ లివింగ్ లో హైదరాబాద్ టాప్.

Hyderabad: క్వాలిటీ ఆఫ్ లివింగ్ లో హైదరాబాద్ టాప్.

ఇటీవల జరిగిన మెర్సర్స్ చేసిన క్వాలిటీ ఆఫ్ లివింగ్ 2023లో భారతదేశంలో ఏడు స్థానాలు అగ్ర స్థానంలో నిలిచాయి.ఈ ఏడు స్థానాల్లో హైదరాబాద్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.

భారతదేశంలో ఉన్న ఏడు ముఖ్య నగరాల్లో హైదరాబాద్ ముందంజలో ఉండటం నిజంగా గొప్ప విషయం. హైదరాబాద్ తరువాత పూణే రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఈ జాబితాలో బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్ కత్తా, ఢిల్లీ తదితర నగరాలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ ర్యాంక్ లను పరిశీలిస్తే హైదరాబాద్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ లో 153 వ స్థానంలో ఉంది. ఆ తర్వాత చాలా దగ్గరగా ఉన్నది పూణే 154. ఇక ఆ తర్వాతి స్థానాన్ని బెంగళూరు 156 వ స్థానంతో సొంతం చేసుకుంది.

ఇక చెన్నై 161, ముంబై 164, కోల్కత్త 170, ఢిల్లీ 172 స్థానాలో ఉన్నాయి.2019 లో 143 లో ఉన్న హైదరాబాద్ స్థానం, 2023 కి వచ్చేసరికి 153కి తగ్గింది. ఓ 10 స్థానాలు తగ్గినప్పటికి ప్రపంచవ్యాప్తంగా తగ్గినప్పటికి, దేశవ్యాప్తంగా మాత్రం ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది.

హైదరాబాద్ లో ఉన్న స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, రవాణా సదుపాయాలు, విద్యా, సాంకేతికాభివృద్ది లాంటి అంశాలలో మరియు సామాజిక- సాంస్కృతిక అభివృద్ది ఈ ప్రధాన స్థానానికి గల కారణం.

వలస వచ్చే వారికి హైదరాబాద్ అన్నీ రకాలుగా సౌకర్యవంతంగా ఉండటం, ఉద్యోగావకాశాలు సమృద్దిగా ఉండటం, ఢిల్లీ తో పోల్చితే హైదరాబాద్ కాలుష్యరహితంగా ఉండటం ఇటువంటి అనేక కారణాల వల్ల వాలసదారులు హైదరాబాద్ నే మొదటి ఎంపికగా మార్చుకుంటున్నారు.

Leave a Comment