Hyderabad Regional ring road Projects: ఎన్నికల తరవాత కూడా ఊపందుకొని రియల్ రంగం2023 నవంబర్ నెలలో తెలంగాణ9Telangana) లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది,
కాబట్టి ఆనతి ఉండే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్(Real Estate) డల్ అయింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల భూములు,
ఆస్తుల క్రయ విక్రయాలు దాదాపుగా నిలిచిపోయాయి. అందుకు ప్రధాన కారణం పరిమితికి మించిన నగదు రవాణాకు ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోవడమే. మొత్తానికి ఎన్నికలు ముగిశాయి,
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) విజయం సాధించింది. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్య మంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే ఇంకా ఇక్కడ గమనించవలసిన అమషం ఏమిటంటే రియల్ ఎస్టేట్ రంగం లో మాత్రం అనుకున్న స్థాయిలో కదలిక లేకపోయింది.
క్రయవిక్రయాలు మునుపటిలా జోరందుకోవడం లేదు. అందుకే ఈ వ్యవహారంలో రాష్ట్ర సర్కారు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది.
ఎప్పుడైతే భారీ ప్రాజెక్టులు వస్తాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి తప్పకుండ జరుగుతుంది. అభివృద్ధి చెందిన ప్రాంతంలోమీ రియల్ రంగం పుజుకుంటుంది.
కాబట్టి ఇప్పుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి ఆ దిశగా అధికారులతో సమాలోచనలు చేస్తున్నారు. అందుకు ఫలితంగా కొన్ని ప్రాజెక్టులను చేపట్టబోతున్నారు.
ఫార్మా సిటీ కి అడుగులు 19 వేల ఎకరాల సేకరణ : 19K Acers Land For Pharma City
వాటిలో ప్రప్రధమమైనది ఫార్మా సిటీ(Pharma City), ఈ ప్రాజెక్టు కోసం కందుకూరు-యాచారం (Kandukuru-Yacharam) మధ్య సుమారుగా 19 వేల ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించినట్టు తెలుస్తోంది.
పైగా ఈ ప్రాజెక్టును రెండు లేదంటే మూడు క్లస్టర్లలో చేపట్టాలని భావిస్తోంది. ఈ ప్రాంతంలో కేవలం ఫార్మా రంగాన్ని(Pharma Industry) మాత్రమే కాకుండా దాని అనుబంధ రంగాలను కూడా ఏర్పాటుచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇక ఈ భూములను అభివృద్ధి చేసే బాధ్యతను హెచ్.ఎం.డి.ఏ(HMDA) కి అప్పగించాలని నిర్ణయిస్తున్నారట. అయితే ఆ నిర్ణయం ఇంకా ఖారారు కాలేదు.
ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు కూడా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా రోడ్లు (Roads), ఎలక్ట్రిసిటీ (Electricity), నీటి వసతులు వంటి వాటిలో జాగ్రత్తలు చేపడుతున్నారు.
ఈ పనులన్నీ పూర్తయ్యాయి అనుకుంటే గనుక గ్రీన్ సిటీ ప్రాజెక్ట్ (Green City Project) కు శంకుస్థాపన చేయాలనీ అనుకుంటున్నారు. అధికారులు కూడా ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు కృషి చేస్తున్నారు.
ఔటర్ రింగ రోడ్డు లో 80 వేల ఎకరాలు : 80 k Acers Across ORR
ఇది ఇలా ఉంటె హైదరాబాద్ (Hyderabad) నగరానికి చుట్టూరా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) కూడా చూస్తుండగానే చాలా అభివృద్ధి చెందుతూ వస్తోంది.
మొదట్లో ఎక్కడో గాని ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్ ఉండేవి కావు, కానీ ఇప్పుడు చాలా పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల సముదాయాలు అక్కడ పుట్టుకొచ్చేస్తున్నాయి.
అయితే ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, రోడ్ల విస్తరణ వంటివి జరిగితే రియల్ ఎస్టేట్ మరింత లాభసాటిగా మారుతుందని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇరుకైన రోడ్లు ఉండటం,
కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అసలు లేకపోవడం వల్ల దాదాపు 80 వేల ఎకరాలు ఖాళీగా ఉండిపోతున్నాయి. సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లో ఎంత లేదన్నా సుమారు నాలుగైదు మినీనగరాలు వెలుస్తాయి సమీప భవిష్యత్తులో.
అయితే ఈ దిశగా గత ప్రభుత్వం కూడా ఆలోచనలు చేసింది, కానీ అందుకు తగ్గట్టు చర్యలు చేప్పట్టకపోవడం వల్ల ఆ వైపుగా అడుగులు పడలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిని చాలా ప్రస్టిజియస్ గా తీసుకుంది.
అందుకోసమే గుజరాత్ వెళ్లారు : The reason Behind Visiting Gujarat
వీటితోపాటు నగరంలో ఉన్న ట్రాఫిక్ ను కొంతైనా తగ్గించి, తద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించేందుకు నడుం బిగించింది రేవంత్ సర్కారు. ఇందులో భాగంగానే మెట్రో విస్తరణను (Metro Extension) చేపట్టింది.
గత బి.ఆర్.ఎస్(BRS) ప్రభుత్వం రాయదుర్గం(Rayadurgam) నుండి శంషాబాద్ విమానాశ్రయం (Samshabad Air Port వరకు మెట్రో లైన్ వేయాలని డిజైన్ సిద్ధం చేసింది,
కానీ ఆ ప్రాజెక్టును అయితే ఆపకుండా రూట్ మాత్రం మార్చింది కొత్త సర్కారు. ఈ కొత్త మెట్రో లైన్ శంషాబాద్ కు ఓల్డ్ సిటీ మీదుగా వెలుతుందట, అలాగే మూసి నది(River Moosi) సుందరీకరణ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలని భావిస్తోంది.
ఈ ప్రాజెక్టు పనుల నిమిత్తమే హెచ్.ఎం.డి.ఎ (HMDA) అధికారులు గుజరాత్ (Gujarath) వెళ్లి రెండు రోజుల పాటు సబర్మతి నది(River Sabarmati) ప్రాజెక్టు ను పరిశీలించి వచ్చారు.
సబర్మతి నదీ ప్రరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు అన్న విషయాన్నీ అక్కడి అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.
కేవలం సుదరీకరణ మాత్రమే కాదు, మూసి నదికి ఆనుకుని ఉన్న తూర్పు మరియు పడమర రహదారి కారిడార్ అభివృద్ధిపై కూడా సర్కారుకి నివేదిక సమర్పించనున్నారు.
ఈ నివేదికలను పరిశీలించిన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదానిపై వేచి చూడాలి.