శరణ్య ప్రదీప్ .. ఈ పేరు వినగానే ‘ఫిదా’ సినిమా గుర్తుకు వస్తుంది .. ఆ సినిమాలో ఆమె సాయిపల్లవి సిస్టర్ గా పోషించిన పాత్ర కళ్లముందు కదలాడుతుంది. ఆ తరువాత వరుస అవకాశాలతో శరణ్య ప్రదీప్ బిజీ అయ్యారు. రీసెంటుగా వచ్చిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమాలో ఆమె పోషించిన ‘పద్మ’ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
శరణ్య అంటే ఎవరికీ తెల్లియదు కాని ఒకప్పుడు అందరికి ఆమె ఒక యాంకర్ గా మాత్రమే తెలుసు. ఒకరోజు అనుకోకుండా “ఫిదా ” లో నటించే అవకాశం రావడం తో అందులో సాయి పల్లవి కి సిస్టర్ గా నటించింది. ఇప్పటికి ఆమెను తలుచుకుంటే ఆ పాత్ర మన కళ్ళ ముందు ఉంటుంది. ఇక వరుస గా చాల సినిమాలలో అవకాశాలు వచ్చాయి. రీసెంట్ గా అంబాజీ పేట మారేజ్ బ్యాండ్ అనే మూవీ నటించీ అవకాశం వచ్చింది.
అందులో పద్మ గా నటించి అందరిని మెప్పించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమాలో ఒక సీన్ గురుంచి చెప్తూ చాలా భయపడి నట్లు చెప్పింది. ఈ సినిమాలో దర్శకుడు ఒక సీన్ గురుంచి చెప్తూ ఇక్కడ వివస్త్ర గా చెయ్యాలి అని చెప్పగానే చాల భయపడి పోయాను. ఈ సీన్ ఎలా వస్తుందో, ఆడియెన్సు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. కాని ద్రుష్యంత్ మీద ఉండే నమ్మకంతో చేసేసాను. ఎలాంటి విమర్శలు రాకుండా చెయ్యమని రిక్వెస్ట్ చేసాను అంతే. ఆయయన నాకు మాట ఇచ్చినట్లే ఆ సీన్ చాల బాగా తీసారు. ఈరోజు నాకు ఇంత పేరు రావడానికి కారణం ఆయనే అని చెప్పాలి.