I didn’t enjoy the success of ‘Animal’ – Rashmika : ‘యానిమల్’ సక్సెస్ ను అందుకే ఎంజాయ్ చెయ్యలేదు – రష్మిక టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్న కథానాయికల్లో రష్మిక ఒకరు. రీసెంట్ గా ‘యానిమల్’ సినిమాతో మంచి హిట్ అందుకుంది రష్మిక . ఆ సక్సెస్‌ను ఆమె సెలబ్రేట్ చేసుకోకపోవడంపై బాలీవుడ్‌లో చర్చ జరిగింది.
తను ‘యానిమల్’ సక్సెస్‌ను ఎందుకు ఎంజాయ్ చెయ్యలేదో చెప్పింది. ‘‘యానిమల్ టీమ్ అందించిన భారీ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ప్రశంసలు కురిపించారు. కానీ, ‘యానిమల్’ విడుదలైన మరుసటి రోజే మరో సినిమా చెయ్యాల్సి వచ్చింది. నాకు పని పట్ల ఎంత నిబద్ధత ఉందో అర్థం చేసుకోండి . దీని వల్లే ఇంటర్వ్యూల్లోనూ, విజయోత్సవ వేడుకల్లోనూ పాల్గొనలేకపోయా.
ప్రతిష్ఠాత్మక చిత్రాల షూటింగ్స్ కోసం రాత్రుళ్లు కూడా ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. అందువల్ల అస్సలు టైం ఉండడం లేదు. నా వంతు నేను కష్ట పడుతున్న మంచి సినిమాల కోసం. రాబోయే నా సినిమాలను మీరు చూస్తూ ఎంజాయ్ చేసే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అన్నింటికీ మించి మీ ప్రేమే నాకు సంతోషాన్ని ఇస్తుంది’’ చెప్పుకొచ్చింది.
తన కొత్త సినిమాలోని పాత్ర కోసం రెడీ అయ్యాయని, అందుకే ఫుల్ ఫేస్ చూపించలేకపోతున్నానని తెలిపారు. అఫీషియల్ గా సినిమా పేరు యునిట్ చెప్పకుండా నా కొత్త సినిమా పేరు నా కారెక్టర్ గురుంచి, నా లుక్ బయటపెట్టడం సబబు కాదన్నారు. షూటింగ్ చాలా బాగా జరుగుతోందని పేర్కొన్నారు.