Jyothika Sadanah Saravanan: ఆ పాత్రలు చేయడం నాకు నచ్చదు..డైరెక్టర్ల ఆలోచన మారాలి : జ్యోతిక.

I don't like doing those roles..Directors' thinking should change : Jyothika.

Jyothika Sadanah Saravanan: ఆ పాత్రలు చేయడం నాకు నచ్చదు..డైరెక్టర్ల ఆలోచన మారాలి : జ్యోతిక.

జ్యోతిక సదనా శరవణన్ ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు జ్యోతిక.

అనేక తమిళ సినిమాల్లో నటించి తన సహజసిద్ధమైన నటనతో అందంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోనూ నటించి వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోశారు.

జ్యోతిక వాలి మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ జ్యోతికకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, శింబు వంటి కోలీవుడ్ స్టార్ హీరోలకు

జోడీగా నటించి అగ్రతారగా ఇండస్ట్రీలో రాణించింది. తెలుగులోనూ ఠాగూర్, బాస్ వంటి చిత్రాల్లో మెగాస్టార్, నాగార్జునతో నటించి తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

ఇక పూవెల్లామ్‌ కేట్టుప్పార్‌ చిత్రంతో జ్యోతికకు స్టార్ హీరో సూర్యతో పరిచయం ఏర్పడింది. ఈ మూవీ చేస్తున్నప్పుడే వీరిద్దరి ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీలో టాక్.

ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి 2006లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ఇద్దరు పిల్లలున్నారు. దేవ్‌, దియా అనే ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లిన టూర్లకు సంబంధించిన పిక్స్ అప్పుడప్పుడు నెట్టింట్లో ప్రత్యక్షమవుతుంటాయి.

ఇదిలా ఉంటే జ్యోతిక తమిళ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులోనూ ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె బహుభాషా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Add a heading 2023 12 13T124251.664 Jyothika Sadanah Saravanan: ఆ పాత్రలు చేయడం నాకు నచ్చదు..డైరెక్టర్ల ఆలోచన మారాలి : జ్యోతిక.

ఎందుకంటే ఆమె నటించే ప్రతి మూవీలో ఆమె క్యారెక్టర్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. జ్యోతిక చేసిన చాలా వరకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలో సోషల్ మెసేజ్ ఇచ్చేవే ఎక్కువగా ఉంటాయి.

ఆమె ఎంపిక చేసుకునే కథల్లో కూడా ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుంది. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన మూవీస్ లో ఉత్తమమైనది‘కాదల్‌ ది కోర్‌’అని జ్యోతిక ఈ మధ్యనే తెలిపారు.

నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఉన్న సినిమాల్లో తనకు నటించాలని ఉంటుందని ఈ మూవీ హిట్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఈ మూవీలో తనది అలాంటి పాత్రేనని తెలిపారు. ఈ సినిమా ప్రతి ఫ్యామిలీకి ఎంతగానో నచ్చిందన్నారు. గతంలో ఎన్నో చిత్రాల్లో ఛాన్సులు వచ్చినా, ఒకే ఒక్క కారణంతో వాటిని యాక్సెప్ట్ చేయలేదని చెప్పుకొచ్చారు.

ఇంటర్వ్యూలో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీస్ గురించి జ్యోతిక మాట్లాడుతూ..” నేను సినిమాల్లోకి వచ్చి 25 ఏళ్లు అవుతోంది. యాక్ట్రెస్ గా రీఎంట్రీ మొదలుపెట్టిన తర్వాత ఎన్నో ఛాన్సులు వచ్చాయి.

టాప్ డైరెక్టర్స్ సైతం అవకాశాలు ఇచ్చారు. కానీ అవేమీ నాకు నచ్చలేదు. అందులోనూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లా నాకు అనిపించలేదు. కేవలం, ఒక హీరో పక్కన జోడీగా కనిపించడానికి సృష్టించిన పాత్రలు మాత్రమే. దీంతో నేను చాలా సాఫ్ట్ గా నో చెప్పేశాను.

ఒకానొక సందర్భాల్లో ఈ పాత్ర చేయడానికి ఏమైనా రెండు మంచి సీన్స్‌ ఉంటే చెప్పండి అని కూడా అడిగాను. దీంతో నాకు అలాంటి పాత్రల్లో నటించాలంటే అమర్యాదకరంగా అనిపించింది. ఎందుకంటే అలాంటి పాత్రల్లో కనిపించడం నాకు నచ్చదు.

ఇదే సమయంలో నాకు మలయాళం నుంచి ‘కాదల్‌ ది కోర్‌’లో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీలో నా పాత్ర హీరోకు సమానంగా ఉంటుంది. బాలీవుడ్‌ టాప్ డైరెక్టర్లే భారీ బడ్జెట్ తో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్ తీస్తున్నారు. కానీ కోలీవుడ్‌ అగ్ర దర్శకులు అలాంటి సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

డైరెక్టర్ల ఆలోచన మారాలి. నిజానికి ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువగా కష్టపడుతున్నారు. అయినా హీరోలనే ప్రయారిటీ ఎక్కువగా ఇస్తున్నారు. అలా చేస్తే హీరోయిన్ల పరిస్థితి ఏంటి” అని జ్యోతిక ప్రశ్నించారు.

Leave a Comment