SURIYA – KANGUVA: అది నా అదృష్టం : సూర్య

42a9dced dbf7 4153 b48f c3c7b649f23d SURIYA - KANGUVA: అది నా అదృష్టం : సూర్య

కోలీవుడ్ స్టార్ సూర్య (Surya) బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా రోజులైంది. కానీ ఆయన నటించిన సినిమాలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. కొత్త స్టోరీలతో , సామాజిక అంశాలతో కూడిన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సూర్య. సొసైటీకి దీటుగా, దురాచారాలను ఎత్తిచూపే ‘సురారై పోట్రు’(Surarai Potru), ‘జై భీమ్‌’(Jai Bheem) లాంటి సినిమాలు ప్రజల్లో ఎంతో ఇంపాక్ట్ చూపించాయి.

ఆ సినిమాల తర్వాత లోకేష్ కానగరాజ్ (Lokesh kanakaraj) డైరెక్షన్ లో వచ్చిన విక్రమ్ (Vikram) మూవీ క్లైమాక్స్ లో రోలెక్స్ లా కనిపించి అందరిని మెప్పించాడు. ఇక ఇప్పుడు తాజాగా పాన్‌ ఇండియా మూవీ ‘కంగువ’ (Kanguva)లో నటిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సూర్య ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కంగువ పోస్టర్, టీజర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి . సూర్య లుక్స్ గూస్ బంమ్స్ తెప్పించాయి. ఈ మూవీతో హిట్ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

మూవీ గురించి సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా చేయటం నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

162798b0 eb20 4c71 82d6 58d3c19f418b SURIYA - KANGUVA: అది నా అదృష్టం : సూర్య

అదృష్టవశాత్తు నాకు దక్కింది :

కంగువ (Kanguva) గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో సూర్య(Surya )తో పాటు మూవీ టీమ్ పాల్గొంది. ‘కంగువ’ లాంటి గొప్ప మూవీలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని సూర్య తెలిపాడు. “గొప్ప సినిమాలో నటించే ఛాన్స్ అదృష్టవశాత్తు నాకు దక్కింది. షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మరింత బిగ్ ప్రాజెక్ట్ గా మారుతూ వచ్చింది. ప్రతి సినిమాలో అనుకున్నదానికన్నా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ, ‘కంగువ’ విషయంలో అలా జరగలేదు.

ప్రతి రోజూ మరింత బెటర్ గా అవుట్ పుట్ ఇచ్చేందుకు ట్రై చేశాం. ఒక కొత్త క్యారెక్టర్ లోకి వెళ్లడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. హీరోగా 25ఏళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైటై వర్క్ చేయడం అంత ఈజీ విషయం కాదు. ‘కంగువ’ షూటింగ్ జరిపిన 150 రోజులు ఎగ్జైట్ మెంట్ తోనే పని చేశాం. అందుకు శివ(Siva)కు థ్యాంక్స్. కంగువ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చిన జ్ఞానవేల్ రాజా(Gnanaveil raju)కు కృతజ్ఞతలు. కంగువ మాకెంతో స్పెషల్. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం” అని సూర్య తెలిపాడు.

కంగువ పీరియాడికల్ స్టోరీ :

పీరియాడికల్ కథతో కంగువ తెరముందుకు వస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ సిరుత్తై శివ (Siruttai Shiva)కంగువ (kanguva) సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ (UV Creations), స్టూడియో గ్రీన్‌ (Studio Green)సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ( Disha Patani) హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు (Jagapathi Babu), బాబీ డియోల్‌ (Bobby Deol), యోగిబాబు (Yogibabu), కోవై సరళ (Kovai Sarala)కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DeviSri Prasad)మ్యూజిక్ అందిస్తున్నారు.

350f7512 d264 4166 ae95 72c6a80ebad5 SURIYA - KANGUVA: అది నా అదృష్టం : సూర్య

త్రీడీ ఫార్మాట్‌లో కంగువ :

‘కంగువ’ (kanguva)షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయింది. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు . త్రీడీ ఫార్మాట్‌లో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని ఏకంగా 10 భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో కంగువను నిర్మిస్తున్నారు మేకర్స్. ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి క్యారెక్టర్ లో కనిపిస్తారు. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడతో కనెక్ట్‌ అయ్యే ఓ పాయింట్‌తో ‘కంగువా’ను తెరెకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. మొదటి భాగం 2024లోనే విడుదల చేయనున్నారు.

Leave a Comment