బ్లూ ఫిలిం కేసులో ఆమె వల్లే ఇరుక్కున్నాను – టాలీవుడ్ హీరో సుమన్.

website 6tvnews template 91 బ్లూ ఫిలిం కేసులో ఆమె వల్లే ఇరుక్కున్నాను - టాలీవుడ్ హీరో సుమన్.

I got stuck in the blue film case because of her – Tollywood hero Suman : ఒకప్పుడు తిరుగులేని నటుడు గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగాడు హీరో సుమన్. మంచి హీరో గా స్దిరపడుతున్న సమయం లో కొన్ని అనుకోని సంఘటనలు ఆయన జీవితాన్ని అల్లకల్లోలం చేసాయి.దాని వల్ల ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. ఆయన ఎదుర్కొన్న కేసుల గురించి ఆ రోజుల్లో జనాల్లో అనేక రకాల పుకార్లు వచ్చాయి.

కాని జరిగిన సంఘటన వేరు. అసలు ఈయన్ను చుట్టు ముట్టిన వివాదాలు ఏంటి? ఆయన మీద కేసులు ఎవరు పెట్టారు?ఎందుకు పెట్టారు దీనికి గురించి దర్శకుడు సాగర్ అపోహల్ని, ఉహాగానాలను చెప్పుకొచ్చారు కొద్ది రోజుల క్రిందట.

ఏ రాష్రం లో అయిన ముఖ్యమంత్రి , ఆ రాష్ట్ర DGP చాల పవర్ ఫుల్ గా ఉంటారు. లిక్కర్ బిజినెస్ వ్యక్తులు కుడా ధన బలం తో చాల పవర్ ఫుల్ గా ఉంటారు. ఇప్పుడు కేసులోని అసలు విషయానికి వస్తే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి MGR, ఆ రాష్ట్ర DGP తో పాటు లిక్కర్ కింగ్ వడయార్ ఆ ముగ్గిరి వల్లే సుమన్ జైలు కి వెళ్ళాల్సి వచ్చింది.

ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వ్యక్తి పెద్ద స్కెచ్ వేసి ఇరికించాడు. దీనికి కారణం అప్పటి DGP కుమార్తె కి సుమన్ అంటే చాల ఇష్టం. కాని సుమన్ కి మాత్రం ఆమె మీద ఎలాంటి అభిప్రాయం లేదు. అప్పటికే ఆమెకి పెళ్ళైన కుడా సుమన్ తెగ ఇష్ట పడేది. అదే సమయం లో సుమన్ ఫ్రెండ్ లిక్కర్ కింగ్ వడయార్ కూతురు ని ప్రేమించాడు. కాని సుమన్ షూటింగ్ లో ఎక్కడ ఉంటె అక్కడికి పోలీస్ సెక్యురిటి తో వెళ్ళుతు ఉండేది.

17. Mr. Suman Talwar Actor బ్లూ ఫిలిం కేసులో ఆమె వల్లే ఇరుక్కున్నాను - టాలీవుడ్ హీరో సుమన్.

ఇక అదే సమయం లో సుమన్,DGP కూతురు వ్యవహారం ముఖ్యమంత్రి దగ్గరకి వెళ్ళింది. అప్పుడు MGR సుమన్ పిలిపించి మాట్లాడాడు. కాని MGR మాట్లాడే స్దితి లో లేరు, ఎం చెప్పాలనుకున్నా పేపెర్ మీద రాసి చూపించేవారు. అప్పుడు MGR బాబు నువ్వు ఒక మంచి నటుడువి. ఎంతో భవిష్యత్ ఉంది నీకు ఇలాంటి వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు నికే మంచిది కాదు అని చెప్పారు. ఆ విషయం నాకు కాదు సార్ ఆ అమ్మాయికి చెప్పండి అని సున్నితంగా చెప్పారుట. కాని అది రాంగ్ వె లో వెళ్ళింది. సుమన్ చెప్పింది MGR కి నచ్చలేదు.

అప్పుడు రంగం లోకి దిగారు DGP. తనకి ఉన్న పవర్ తో సుమన్ మీద అల్లర్ల కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. బయటకి రాకుండా ఎన్ని కేసులు వెయ్యాలో అన్ని వాడేసారు. చివరకి బ్లూ ఫిలిం కేసులు కూడా పెట్టినట్లు ప్రచారం జరిగింది. అవన్నీ పుకార్లు అని సుమన్ ఫ్రెండ్ కి ఒక వీడియో షాప్ ఉండడం వల్ల ఇలాంటి ప్రచారం జరిగింది అని ఆయన చెప్పారు

ఇలా కొన్ని నెలల పటు సుమన్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అప్పటి రోజుల్లో గవర్నర్ కి సుమన్ వాళ్ళ అమ్మ గారికి బాగా పరిచయం ఉండడం వల్ల తొందరగానే బెయిల్ వచ్చింది.కాని జైలు నుండి బయటకి వచ్చేసరికి సుమన్ దగ్గర డబ్బు తీసుకున్న ఫ్రెండ్స్ అందరు కలిసి మోసం చేసారు.

ఆ సమయం లో సుమన్ కు ఆర్దిక్ ఇబ్బందులు వచ్చాయి. కాని బాధాకరమైన విషయం ఏంటంటే సుమన్ అరెస్ట్ వెనుక చిరంజీవి హస్తం ఉందని అప్పట్లో పత్రికలలో పుకార్లు వాచ్చాయి. ఇందులో కూడా ఎలాంటి వాస్తవం లేదు అని దర్శకుడు సాగర్ చెప్పారు. అవన్నీ ఆ సమయలో వచ్చిన అనేక రకాల ఉహాగానలే అని సుమన్ ఎపిసోడ్ కి తెర దించారు దర్శకుడు సాగర్.

Leave a Comment